Monday, December 31, 2012

వయసొచ్చింది!

వేములచంద్ర | వయసొచ్చింది! | ( 2013, జనవరి 01, మంగళవారం మధ్యాహ్నం 1.00 గంటలు )

అప్పుడు నాకు రెండుపదులెళ్ళి పోయి,
ఇష్టం, సౌఖ్యం, పరవశం .... పొందాలి అనుకుని, 
దాన్ని బలపర్చే లక్షణాన్ని .... ఆరాటాన్ని ప్రేమ అనుకుని,
జీవితం గమ్యం, స్వర్గం అనే నమ్మకాన్ని .... నమ్మే వయస్సు
.
అందము, సుకుమారము, ఆనందమే లక్ష్యం గా
వెండితెర గులాబీ, హీరోయిన్ లాంటి అమ్మాయి ని .... ప్రేమించాలని, 
ఆమె ప్రేమ, లాలిత్యం, అనురాగం జీవితాన్ని స్వర్గమయం చేస్తుంది అని,
ఆశించే, కలలు కని, నమ్ముకునే .... వయస్సు అది.

అప్పుడప్పుడూ అనుమానం ఆవహించేది పెనుభూతం లా.
ఒకవేళ, అంత అందమైన అమ్మాయి నన్ను ఇష్టపడకపోతే ....
పెద్దల ఇష్టాన్ని నా తలరాతగా రాయించుకోక తప్పదా ....!
కలల్లో మాత్రమే ఇష్టాన్ని పరామర్శిస్తూ కూర్చొనక తప్పదా .... అని,

తోడులేని .... ఎవరినీ  ప్రేమించలేని ద్వేషించలేని
ఎవరి చేతా ద్వేషించబడని, ప్రేమించబడని జీవితం జీవించక తప్పదా అని 
ఆలోచనలు .... పీడకలలాంటి భయానకమైన ఆలోచనలు .... చివరికి మెలికలు తిరిగి తిరిగి
చివరికి, అమ్మాయి తోడు లేని నాడు అబ్బాయి అబ్బాయే కాదు అనుకునేవాడ్ని!

నేను ఒక సగటు మనిషిని, సామాన్యుడ్ని!
నా ఇష్టం, లక్ష్యం అనే భావనల చుట్టూ గిరిగీసుకున్నాను ....
నా అనుకునే సాహచర్యం, నేను తన .... అనుకునే తోడు లేని నాడు
బ్రతుకు నిరర్ధకం అని .... అనుకునే ఓ మధ్యతరగతి మనస్తత్వాన్ని అలవర్చుకున్నాను.

Sunday, December 30, 2012

చిన్న మాట!

వేములచంద్ర || చిన్న మాట! ||

ప్రయత్నించి జీవితాన్ని
మార్చుకోవచ్చు,
కానీ ఎగిరిపోలేము.

తాత్కాలికంగా నమ్మకం
దూరం కావొచ్చు,
కానీ శ్వాసున్నంతకాలం .... మరణించము.

పిడికిట్లో నిజం
చెతులు కప్పి మూసెయ్యొచ్చు,
కానీ అది కాలుతున్న వాసన దాయలేము.

ప్రేమ, మనోభావన
ఊహల్లో అస్థిరంగా .... బతకనివ్వదు.
కానీ గుండె చప్పుడై .... దిశా నిర్దేశం చేస్తూనే ఉంటాము.

( 2012,
డిసెంబర్ 31,
సోమవారం ఉదయం 6.00 గంటలకు )

ప్రేమ సామ్రాజ్యం

నీ కోసం
నీ ప్రేమ కోసం
నీ హృదయంలో స్థానం కోసం
ఈ తపనంతా

నీ గుండె కొట్టుకునే
చప్పుడు కారణం నా కదలికలవ్వాలని
నా నడవడిని .... నన్ను నేను మార్చుకుంటున్నా!
నిన్ను....లా ఆలోచిస్తున్న మొండితనం స్వార్ధంతో ఆలోచిస్తున్నా!

నాకు తెలుసు
నా గమ్యం, నా ఆరటం కష్ట సాధ్యం,
నేను నిర్ణయించుకున్న నా ప్రేమ ప్రస్థానం .... పోరాటం అని
నా మార్గం గులాబీ రేకుల తివాచీపై కాదని .... ముళ్ళే అన్నీ అని

భావనల సంకెళ్ళే రహదారంతా
తీరని జీవనావసరాలు, లేని ఆర్ధిక స్వాతంత్రం,
తెగతెంపులు చేసుకోవాల్సిన అనుబంధాల బాధ్యతలే అన్నీ 
తొందరపాటు నిర్ణయం, కన్నీటి వెతలు .... బాధామయం జీవితం అని

నా గుండె ఆయాస పడుతూ 
ఉశ్వాస, నిశ్వాసలు .... సంకోచ, వ్యాకోచాల్లో అలజడి,
నిశ్సబ్దం బ్రద్దలైన విస్పోటంలా, నీ నామమే గుడి గంట మోతలా
రక్త తివాచీ .... స్వాగత తోరణాల స్వచ్చంద ఆహ్వానం .... అదే నా హృదయ మందిరం!

నిరాపేక్ష నిర్మల భావనతో
నా హృదయ సామ్రాజ్యం హక్కులన్నీ ప్రేమ ప్రామిసరీ నోట్ పై రాసి
ఇచ్చేస్తున్నా! నిన్ను నా హృదయ సామ్రాజ్యానికి మహారాణిని చేస్తున్నా!
మౌనంగా శున్యంలోకి నిరిక్షిస్తూ, .... నీ నిరీక్షణ కోసం, నీ భావనల సారాంశాన్ని కావాలని.

Friday, December 28, 2012

మనసంతా నీవే!నిదురమ్మ ఒడిలో కలలుండి,
ఆ కలలే నిజమైతే,
ప్రతి రాత్రీ నిదురను రప్పిస్తా!
ఆ నిద్దురలో నిన్ను .... కలొచ్చని.

ఒంటరి జీవితానికి వరాలుంటే,
ఒంటరిని నేనౌతా! రెండు వరాలడుగుతా!
నా మొదటి ఆశ .... నీవెప్పుడూ నన్ను ప్రేమించాలని.
రెండో ఆశ .... నన్నులో నిన్ను కలుపుకోవాలని.

కన్నీళ్ళతో ప్రేమ గీతాలు రాయాల్సొస్తే,
నా కన్నీరుకు కారణం నీ ముందుంచుతా!
నీకు నా భావనలు తెలిసేలా,
నా ప్రేమ లోతు తెలిసేలా,

కలలు కల వరించిన వారికే ....
కోరికలు అద్భుతాలు నిజాలు కావడమే
కన్నీరు కవితలు రాయడం అసాధ్యమే అని తెలుసు .... అయినా,
ఒక్కటి మాత్రం నిజం .... ఆ కన్నీరు ముత్యాల్లో ప్రేమాక్షరాల్లో .... నీవే!

ప్రేమ ప్రామాణికం!నిన్ను ప్రేమిస్తుండటం ....
నీ ఊహల్లో నిదురించడం
ఒక గొప్ప అద్భుత అనుభూతి.

నీవు నాకు ఎదురవ్వడం ....
నేను గుర్తించగలగడమే ఒక వింత
ప్రామాణికమైన పదాల్లో చెప్పలేను.

నా హృదయపూర్వక ప్రేమ భావనను
వ్యక్తపరచలేను .... ఎందరో రాసిన చరిత్రలు
ప్రణయ కావ్యాల్లో రాసిన పదాలు చదివాక్కూడా!

నీ ఆవేశంలో ఆవేశాన్నై
నిన్ను ప్రేమించడం మినహా ....
నా గుండె, నా ఆత్మ యొక్క సాక్షిగా ప్రేమించగలనే తప్ప!

Tuesday, December 25, 2012

అధికార సుగంధం

చంద్రశేఖర్ వేములపల్లి || అధికార సుగంధం ||

ఈ చెడు ఆలోచనలు
చీకటి ఆవేశం క్షణిక దౌర్బల్యాలు
నిశ్శబ్దం, దుష్టత్వం భారమై .... మనిషి చేతులు క్రిందికే చూస్తున్నాయి.

శక్తిమయం ఈ జగత్తు,
ప్రకృతి, పంచభూతాలే .... ఈ శృష్టికి కారణాలు,
జీవితం, బాధ, తపన .... రాగ ద్వేషాలు ప్రాకృత్యం అని .... తెలుసు.

హింసకే ఎందుకో ప్రాముఖ్యత?
ఈ సమాజం, ఈ అపవిత్ర ధరిత్రిపై .... అధర్మ నిర్మూలనకు,
శక్తి ఆయుధం సమకూర్చుకోక తప్పట్లేదు! జీవితం పునరావిష్కరణకు,

శక్తికి సుగంధం ఉంది.
అంధకారాన్ని తొలిచే .... తొలిపొద్దు
చైతన్యం శక్తి .... అనురాగం సుగంధం పరిసరాలు కమ్మేయడం రేపటి నిజం. 

2012, డిసెంబర్ 26, ఉదయం 5.45 గంటలు

ముద్దు మాట

ముద్దు మాట

పట్టించుకోలేను.
ధైర్యం చెయ్యలేను.
నా అనుకుని సాహసించి స్వాతంత్రించనూలేను.


ఆ లేలేత పెదవులపై
ఎందుకు ఎరుపురంగు అద్దుతున్నావో
నీకు నిద్రెందుకుపట్టట్లేదో తెలియట్లేదు

నాకు అర్ధమయ్యే ఎలాంటి ఆధారాలూ ఇవ్వడం లేదు
మూడీగా పలుకరిస్తే కరిచేలా ఉన్నావు.
శిలలా ఉన్నావు.

ఎక్కువగా ఆలోచించలేక పోతున్నాను.
విరబోసిన ఆ కురుల చాటు ముఖాన్ని చూడలేకపోతున్నాను.
నల్లని పాయల్లా జారిన ఆ కురులు నన్ను ఆలోచించనీయటంలేదు.

ద్వేషంతో సెగలు, విషం చిమ్ముతున్నావు
నీ ఆలోచనల్లోంచి తప్పించుకోలేకపోతున్నాను
ఎదురుపడి బలైపోలేను.

ఈ ఆట ఇంతటితో ఆపుదాం!
నీకు ముగింపు తెలుసు! గెలుపుకు, ప్రేమ ఫలించడానికి
మంత్రముగ్దుల్ని చేసే అందాల రాణివి .... మాత్రమే అయితే చాలదు.

ముక్కలైన హృదయం

చంద్రశేఖర్ వెములపల్లి || ముక్కలైన హృదయం ||

ఆకాశం అడ్డంగా చీల్చినట్లు .... మెరుపులొకవైపు
సముద్రంలో అలలు ఆకాశాన్నందుకునే ఆవేశం ఒకవైపు
అంతకన్నా ముఖ్యంగా .... ఒక గుండె ముక్కలయ్యింది.
పైకి సహజంగానే కనిపిస్తూనే ఉన్నా
ఎవరికీ కనిపించని పగులు తో పెళుసుగా 
సానుభూతి పలుకరింపు శబ్దం తగిలి .... మరీ
విచ్చిన్నమయ్యేలా .... జ్ఞాపకం గాయం బాదై మిగిలి ఉంది

పగిలిన హృదయాన్ని పొదివి పట్టుకుని
అసహాయంగా .... పాలుపోని స్థితిలో
కళ్ళకు కనిపించని నష్టం ....
జీవితాన్ని కోల్పోయి
ఎవరో భావోద్వేగం తో ఆడిన ఆట లో గాయపడి
గెలిచినవారు ఆటలోఆనందం పొందారో లేదో కానీ
ఆ గుండె గొంతు మాత్రం మూగబోయింది.

ఒకరికి ఆనందం ఆట అయితే
వేరొకరికి ఓటమి గుండె పగలడం అయ్యింది.
తిరిగి అతకదని తెలిసీ గుండె పగిలే ఆట ఆడటం
ఖరీదైన జీవితానుభవాలను పోగుచేసుకుంటూ ఒకరు.
ఏమీ పట్టని రాలిన విచ్చిన్నమైన పగిలిన ముక్కలు
చిరిగిన హృదయం పుస్తకం పేజీలను ఏహ్య భావం తో చూసి
దూరంగా జరిగుతున్న సభ్య సమాజాన్ని చూసి బాధతో ఒకరు.

ఆ రోజొకటొస్తే అనే బాధ .... ఆ బాధితుడిది.
ఒక్కసారి తలతిప్పి చూస్తే ....
సహచరులకూ అనుభవానికి రావొచ్చనుకుంటే
శున్యమే కదా అంతటా .... తలభారం ఎక్కువౌతుంది.
మనసుతీరా ఏడుపొస్తుంది .... నొప్పితో శరీరం సలపుతుంది.
గుండెలు విచ్చిన్నమైన దాఖలాలు అందరిలో ....
తిరిగి కలపలేని నిస్సహాయ భావన ఆవేదనే అంతటా!

2012, డిసెంబర్ 25, సాయంత్రం 8.15 గంటలు

Wednesday, December 19, 2012

బంధం

చంద్రశేఖర్ వేములపల్లి || బంధం ||

తప్పించుకోలేనని తెలుసు
కాలుడి కంటి చూపు 
ప్రపంచంలో స్థానం కోల్పోవడం
ప్రపంచం నన్ను కోల్పోవడం
నాకూ ప్రకృతికీ బంధం తెగిపోవడం
తప్పదని తెలుసు ...  మరణించడం

శరీరం కాలి బూడిదయ్యాక ఏడుపా
వినలేని చెవులు
చూడలేని కళ్ళు
అవునూ ఆ బాధ సహజీవిని మరణించాననా ...
నీవూ మరణించాల్సొస్తుందనా
అక్కడుండేది శిలాతత్వం నిశ్శబ్దమే ... నేస్తం

నిజంగా నాపై
నీది ప్రేమే ... దిగులే అయితే
ప్రాణమున్నప్పుడే ప్రకటించు
నీవిచ్చేది పంచేది ప్రేమైనా ఏదైనా
తీసుకోగలిగినప్పుడే ఇచ్చెయ్యి
చచ్చాక ... ఉండదు
ప్రపంచానికి మనిషి మనిషికి ప్రపంచం బంధం
అక్కడుండేది కేవలం శిలాతత్వం నిశ్శబ్దం

రేపనేది
నిజంగా ఉందో లేదో
ఈ ప్రాణం పంచభూతాల్ని ఆశ్వాదిస్తుందో
పంచభూతాల్లో కలిసిపోతుందో
ఎందుకైనా మంచిది ...
వెచ్చదనం ప్రేమను పంచాలనుకుంటే పంచెయ్యి
స్పర్శించాలనుకున్నా స్పర్శించెయ్యి ... బ్రతికున్నప్పుడే సుమా!

2012, డిసెంబర్ 20, గురువారం ఉదయం 6.15 గంటలు

Friday, December 14, 2012

తొలిచూపు

చంద్ర శేఖర్ వేములపల్లి || తొలిచూపు ||

ఒక పెద్ద విస్ఫోటం ...
గుండె శ్వాసించడం మాని
క్షణం భూకంఫం
భూమి బ్రద్దలైనట్లు
సముద్రాలు ఉత్పాతాల్ని సృష్టించినట్లు
సౌందర్యం సాక్షాత్కారం ... నా కళ్ళముందు

చూపులు అతుక్కుపోయి
ప్రమాద సంకేతం
గ్రీన్ సిగ్నల్ గా మారినట్లు ...
మెదడుకు గుండెకు మధ్య
అసహాయత అసంతులనం
రాత్రివేళల్లో
పగటి కలలు కంటూ

చూసింది ఒక్క సారే
ఆ మెరుపు చిరునవ్వు ను
జిగేల్ మనె గుండె ఝలదరింపును
అది ప్రేమేనేమో
తొలిచూపు ప్రేమంటే ఇదేనేమో
నిశ్చయంగా అది ప్రేమే ...
తొలి ప్రేమే

ఏమీ ఆశించకుండా
అన్నీ కోల్పోవాలనిపించే ప్రేమ
పుట్టింది, పెరిగింది
ఆ సాహచర్యం కోసమే అనిపించే ... తొలిభావం ... ప్రేమ
ప్రేమను పొందానని
నాకోసమే పుట్టిన మనోహరిని
చూడగలిగాననే హృదయభావం తొలిచూపు ఆకర్షణాభావం అది.

2012, డిసెంబర్ 14, శుక్రవారం సాయంత్రం 6.30 గంటలు

Wednesday, December 12, 2012

ఎర్రటి రంగు

చంద్రశేఖర్ వేములపల్లి || ఎర్రటి రంగు ||

ప్రతి రోజు
చీకటి రంగు కప్పేస్తూ గుండెను
హృదయం నల్లగా ...
కలహాలు ... విరహాలు
శ్వాస ఆరాటం
నన్ను నేను కోసేసుకుందామనిపిస్తూ
కత్తితో ... ముక్కలు ముక్కలుగా

2012, డిసెంబర్ 12, బుదవారం ఉదయం 7.40 గంటలు

చిన్ని భావాలు

చంద్రశేఖర్ వేములపల్లి !! చిన్ని భావాలు || (  రెండు లైన్ల కవిత లాంటివే ... మూడు నాలుగు లైన్లవి )

గుడి మెట్టు మీద ... చేతులు చాస్తూ మాతృత్వం
రొమ్ముకు తల ఆంచి ... కూతురు
కూతురు ఒడిలో నిదురిస్తూ ... కూతురు కుమార్తె ... మనుమరాలు
రెండుసార్లు దైవం దీవెనలేమో ఆమెకు

దేవత స్త్రీ ...
దైవం పై ప్రేమ ... స్వేచ్చే లక్ష్యం ...
బంధాలు తెగి ... గగన విహారం!

సృజనాత్మకత నిప్పు ...
పొయ్యి సంరక్షణ ...
ఆవేశం ... ఎగసే చైతన్యం సెగ ... ఆత్మ సౌందర్యం!

2012, డిసెంబర్ 13, గురువారం ఉదయం 5.50 గంటలు

Friday, December 7, 2012

పగిలిన గుండె


ఎప్పుడైతే
బాధ, విషాదం జీవన నియమాలో
అప్పుడు గుండె-మనసు భావాల ప్రపంచం బ్రద్దలౌతుంది
చెప్పటానికి ఏమీ మిగలదు
ఎంతగానో ప్రేమించిన ప్రేమ
దూరమైన నిజం గాయమై ... సలుపుతూ

కళ్ళకు
కనిపించని బురుజు గుండె గోడలు
మనసును నిశ్శబ్దంగా పిండేస్తూ
అధిగమించలేని
కనీసం స్పర్శించను కూడా లేని
జ్ఞాపకాల కోట గోడలు ...
ఊపిరాడని స్థితి మనసు ఉక్కిరిబిక్కిరై

రెండు
ప్రపంచాల మధ్య జీవనంలా
ఒరిపిడి, నలిగి బ్రద్దలౌతూ ... ఆలోచనలు
మరణించడమే మిగిలిన ఏకైక మార్గమేమో అని
అదే మేలనే భావం ప్రబలి
మరణం వైపు మొగ్గు చూపే లక్షణాలు
అన్ని వైపుల్నుంచి ముసుగుతూ

ఎంతో పునీతం ... ప్రేమ
వృధా ప్రస్తుతం అనే ఆలోచనల్తో,
కలల్లో జీవిస్తూ ...
జీవితానికి లక్ష్యాన్ని కోల్పోయి, మత్తుకు బానిసై
అర్ధం లేని అయోమయావస్థ లో
నా మెదడు, తల ...
నడుస్తున్న భయవిహ్వలత్వం పొలికేక అయి

ఇప్పుడు
నా గమ్యం ఏమిటి?
చూడాలనుకున్న నేస్తం ... తిరిగి రాలేదని తెలిసీ
చూడాలనా! ఈ వేగిరపడటం!
లేక
జీవితం నేర్పిన మరో ప్రేమ కావ్యం ... పెద్ద పాఠంగా
ప్రపంచం కోసం మిగలడమా

ఈ గాయం
గుండె లోతుల్లో గడ్డకట్టిన రక్తం మరక
హృదయం గోడల్ని చిట్లిస్తూ,
బాధ తీవ్రంగా ఉంది.
అయినా ...
మరచిపోవాలనుకున్న నువ్వొదిలెళ్ళిపోయిన క్షణాల జ్ఞాపకాలు
మనం కలిసి ఆశల్ని పంచుకున్న రోజుల్ని గుర్తు తెస్తూనే ఉన్నాయి

Tuesday, December 4, 2012

సగటు మనసు

నిన్నే ప్రేమిస్తున్నాను.
జీవిస్తున్నాను ... నీ కోసమే అని,
అనలేని అభిమానం!
మాటలురాని, మాటలాడని సంకోచం!

నాది నిజమైన ప్రేమేనా అనే అనుమానం.

ఎందుకిలా?
ఆకర్షణను అభ్యంతరిస్తున్నానో ...
గుండెలు నిండి ... పొంగే ... ప్రేమను,
ద్వేషాగ్ని చాటున దాచుకుంటున్నానో,
ఏ స్వర్గాన్ని ఆశించో ... తెలియడం లేదు

నిజమా ఇది ప్రేమేనా!

ఎందుకు?
ఈ ద్వేష రాగాలు
అసూయ, అభద్రతాభావాలు
గమ్యం, జీవితం అంచున ... నవ్వుతూ,
ఎదురుచూస్తూ ఉన్న ... జాలరి మృత్యువే అని తెలిసీ,

ఆలసిస్తున్న మనోభావాన్నేమనాలో

నిజంగా నిన్ను నేను ప్రేమిస్తున్నానా?
నన్ను నేను ప్రేమిస్తున్నాను అనుకోవడం ...
అనడం ... అబద్దమా?
ద్వేషిస్తున్నాను అనుకోవడం
ఎరుగని, అనుభవరాహిత్యం ... ప్రేమ మోహమా!

నా మధ్య తరగతి ... సగటుమనోభావం పేరు ప్రేమేనా!

Monday, December 3, 2012

చుట్టూ చీకట్లునా చుట్టూ
నిర్మించుకున్న
ఊహల కట్టడం ... భవంతి
చికటిమయం అయిపోయింది.

అయోమయం
అందకారాన్ని పారద్రోలే
నమ్మకం
ఆఖరి కొవ్వొత్తి ... ఆరిపోయింది.

ఇప్పుడు
నా చుట్టూ
భయం, భీతి
అనుమానం, అపనమ్మకం!

శ్మశాన వైరాగ్యం
నిజం ...
సజీవం ... భావన మాత్రమే
శ్వాసించే మృత శరీరాన్ని నేను.

Sunday, December 2, 2012

|| నా ప్రేమ ||

|| నా ప్రేమ ||

చేతిలో చెయ్యి
తలకు తల ఆనించి
కళ్ళుకళ్ళల్లోకి చూస్తూ
నువ్వూ నేనూ

ఆ కళ్ళల్లో
అశూయ
కొరకొర చూపులు
తొంగి చూస్తూ ... అక్కసుతో తారలు

అద్దాల వెనుక ప్రదర్శనారలో
రాధామాదవుల విగ్రహాలు
వాటిపై పరుచుకుంటూ
వన్నెల రేడు ... వెన్నెల వెలుగులు 

మోహాలన్నీ
ఐక్యమైన వ్యామోహం
వాస్తవం ప్రేమ పరాకాష్త
వెర్రి వాంఛ్

అక్షరాలు, పదాలు
పుస్తకాలు రాయని,
రాయలేని అభివర్ణించలేని ... ఆవేశం
నీపై ... నా ప్రేమ

నిజమైన బంధం
రాగం ... అందమైన పాఠ
అంతంలేని పురివేసిన
ద్వనుల సమ్మేళనం ... నా ప్రేమ

అద్భుతం, అపురూపం అయిన
మనసులో మొలిచిన
ఆత్మ, హృదయ తంత్రులు మీటిన
భావాలతో కలిసి రాసిన గీతం ... నా ప్రేమ

అనంతమైన
ఆనందాలు
జ్ఞాపకాలు పరిచిన
మధుర తివాచీ ... నా ప్రేమ

అంతంలేని
మాయని
అంతర్లీనమైన
ఆనంద భావం ... నా ప్రేమ

నీవే నా ప్రేమవి
వ్యామోహానివి
మనసు భావనలు
పురివిప్పి ఆడిన నాట్యమయూరివి.

Wednesday, November 28, 2012

కవిత రాస్తున్నాను.ఒంటరిని
నా చిన్ననాటి జ్ఞాపకాల
వెచ్చదనం ఆశ్వాదిస్తున్నా!
ఉత్సుకత ...
పసితనంలోకి వెళ్ళిపోవాలని ...
స్కూలు కాలేజి రోజులే
స్వర్గం లా కళ్ళ ముందు ... కలలా
పసితనం అల్లరి, మొట్టికాయలు తిన్న జ్ఞాపకాలు 
వెచ్చని అనుభూతుల కోశాగారం ... బాల్యం

ధ్యానం
నా గుండె మీద సముద్ర వైశిష్ట్యం
ఒంటరితనం పై ... ఒక కవిత రాస్తున్నా ...
నన్ను నేను ఉత్తెజపరచుకునేందుకు
ఒంటరి క్షణాల ప్రపంచం ...
ఒక శ్మశానం కాబట్టే కవిత రాస్తున్నాను.
ఒంటరితనాన్ని భావాలతో నింపెయ్యాలని
చీకటి నిశ్శబ్దాన్ని పారద్రోలెయ్యాలని

Tuesday, November 27, 2012

నేను ఒంటరిని కానుప్రేమను నమ్ముతున్నాను.
నేను ఒంటరిగా లేను.
రాత్రి వేళ సీతల వాతావరణంలో
నిశ్శబ్దం, మౌనం, ఒంటరితనం
గాలి గుసగుసలు ...
శరీరాన్ని తాకుతున్నప్పుడు
నాకు తెలుసు
నేను ఒంటరిని కానని
ఆమె నన్నింకా ప్రేమిస్తూనే ఉందని
ఇద్దరం దూరం అయినా,
ఎవరో మధ్యలో వచ్చిపోతూ ఉన్నా,
నాకు తెలుసు
నా చెలి నన్ను మరిచిపోదని
నన్నింకా ప్రేమిస్తూనేఉందని
నేను ఒంటరిని కానని
దేశమంతా తిరిగొచ్చాను
ఎన్నో ముఖాలు
ఎన్నో అనుబంధాలు
ఎన్నో సహవాసాలు ... నా జీవితంలో
అయినా
నాకు తెలుసు
ఆమె నన్ను ద్వేషించట్లేదని
ఏ ప్రేమా ఆమె ప్రేమ అంత నిజం కాదని
నాకు తెలుసు.
ఆమె అవసరం నా జీవితానికి
ఇంతే ... అని మాటల్లో చెప్పలేనని
ఆమె కోసమే జీవిస్తున్నాను కనుక
నేను ఆమెను, ప్రేమను ...
నమ్ముతున్నాను ... ప్రేమిస్తున్నాను కనుక

Monday, November 26, 2012

మనసు పరితాపం!

మనసు పరితాపం!

నీదృష్టిలో పడాలని నీవు నన్ను గమనించి,
గుర్తించాలని నా మనసు ఆశ
నీ ఆనందం చూడడం కోసం
నీవు ఇష్టపడటం కోసం ... ఏదో చెయ్యాలని
జుట్టు స్టైల్ మార్చుకోవాలని?
విచిత్రధారణ చెయ్యాలని?
నడక లో వడిని నాణ్యతను పెంచాలని?
మాట్లాడేప్పుడు పదాల స్పష్టతను మృధుత్వాన్ని పెంచాలని

ఎన్ని నాళ్ళ నుంచో ...
ఎన్ని జన్మలబంధమో నీదీ నాదీ అన్నట్లు,
నా మనసు భావన ...
నా ప్రేరణా శక్తివి నీవని అనుకుంటుంటాను.
నీవు మాత్రం నన్ను సహచరుడిగానే చూస్తున్నావు.
నా భావనల నిజ అస్తిత్వం కానీ, నేను కానీ ... నీకు తెలియదు.
సముద్రమంత లోతు ప్రేమ నీవంటే నాకు అని కానీ,
నా మనసెప్పుడూ ... మనోభావనలు
నీకు మాత్రమే తెలియాలని అనుకుంటుంది అని కానీ,
నువ్వేదో వస్తువైనట్లు నిన్ను సొంతం చేసుకోవాలని ...
నా మనో వాంచ అని కానీ ... నీకు తెలియదు.

కళ్ళు మూసుకున్న ప్రతిసారీ
నీ చిరునవ్వు నిర్మలత్వం ... నీ ముఖమే కనిపిస్తుంది.
అందాల బరిణల్ని, వయసు చమక్కుల్ని,
అతివలెందర్నో చూసా ... కానీ
నీలో ... నీ నడవడికలో ఏదో ...
నాకు మాత్రమే చెందిన ఐశ్వర్యం ఉన్నట్లు
ప్రత్యేకతల్లా ... మనసు ఊరటల్లా నీ సహజీవిలా,
కలిసి పనిచేస్తున్న నీ కొలీగ్ గా నీ సాన్నిహిత్యం.
నామ మాత్రపు స్నేహితుడిగా మాత్రమే తెలుసు నీకు నేను
కానీ, నేను నీవు వదులుకోలేని స్నేహాన్ని
అంతకు మించి ఏమీ కాని మనోభావాన్ని కూడా ...

మరీ ముందుకు కదలలేను ...
భయం ...
పరితాపం చెందాల్సొస్తుందేమో అని,
అందుకే
ప్రస్తుతానికి నీ స్నేహం చాలనుకుంటున్నా!
అతిగా ఆశించి ...
నిన్నూ,
నీ నా బంధాన్ని ప్రశ్నార్ధకం చెయ్యాలని లేదు.
నా ప్రేమను నాలోనే దాచుకుంటా!
గాంభీర్యం ముసుగులో నన్ను నేను దాచుకుంటా!

ఓ రోజొస్తుందని నమ్మకం ...
మనసు బృందావనంలో
చెట్టాపట్టలేసుకుని నీవూ నేనూ కలిసి తిరిగే రోజు
నేను నీకోసం నీవు నా కోసమే అని నీవూ అనుకునే రోజు
అప్పటివరకూ
ఎదురుచూపుల తపస్సు ఇలాగే చేస్తుంటాను.
ఒంటికాలు మీదే అయినా ...
కనులు కాయలు కాసినా ... చూస్తూనే ఉంటాను
ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళిపోతానేమో అని
వెళ్ళేలోపు నా మనసు పరితాపం నువ్వు గుర్తించాలని ...

Sunday, November 25, 2012

బంధం

బంధం

నీవంటే ప్రేమ, నీ నవ్వంటే ఇష్టం,
నా మనసంతా వ్యామోహం పొంగుతూ
నా గుండెలనిండా నీవు ...

తియ్యని బాధ, మోహన రాగం ... కోరికలా,
నా శరీరం ఝలదరిస్తూ ...
నీ ఊసుల గుసగుసలే ఏకాంతంలో నాలో 

నా కళ్ళముందు సౌందర్య రాసివి నీవు.
నీవే నిజం నిండుతనం అన్నట్లు ... జగమంతా శూన్యం
కోమల, పక్వ ... పరిపూర్ణత్వం నీలో చూస్తున్నాను.

నా అదరాలు అదురుతున్నాయి.
పదాలతో నీతో ... ముద్దులముచ్చట్లాడాలని,
ఆశ, ఆవేశం నాలో ... నన్ను నేను కోల్పోవాలని,

నీలోనూ ఇదే స్థితిని,
రెండు గుండెలు, శరీరాలు, ఆత్మలు
ఒక్కటైన నిజాన్ని ... అనుభవిస్తూ చూస్తున్నాను

Saturday, November 17, 2012

నిజమైన ప్రేమజీవన భాగస్వామ్యం
సాహచర్యం  
భావన మాత్రమే సరిపోదు

ఒకే ... భావం, శరీరం
ఒక్కరిలా ...
ఆవేశము, ఆలోచన
ఉద్రేకం, ఉద్వేగం
శ్వాసించడం, గుండె కొట్టుకోవడం
ఏక దృష్టి ... సాధన అయి ... కలిసుండటం
ఒకరిలో వొకరు వొక్కరై ఉండగలగడం
... సంసారాధారము

Thursday, November 15, 2012

జీవన సార్ధకత!


ఎంతో సుందరము ...
చిన్నది జీవితం,
ఉన్నది
బురదలో అయినా, తివాచీ పైనైనా ...
చైతన్యం
కొనలేని యౌవ్వనం
పరిమళిస్తూ ఉంటెనే ...

ఆత్మను ఆవహించే
మత్తు, మాదకద్రవ్యాల
నిద్రలోకి ... జారకుండా,
అమ్ముకోకుండా
జీవితాన్ని మృత్యువు
ఇష్టాఇష్టాలకు వొదిలెయ్యకుండా ఉంటేనే

మనిషి ఆట మొదలు
పుట్టుకతూనే
అమ్మ ఒడిలో నే
మమతానురాగం బహుమానం పొంది
పరువం ప్రకృతి నిర్దేశం
సరైన మార్గం లో
పురోగమిస్తూ ఉంటేనే జీవనం

2012, నవంబర్ 16, శుక్రవారం ఉదయం 7.30 గంటలు

Tuesday, November 13, 2012

ఒంటరిని నేను

ఒంటరిని నేను

జనసమూహాల మధ్య ఒంటరిలా నడుస్తుంటాను.
నా గుండె బిగ్గరగా కొట్టుకుంటూ ...
గాయం సలుపుతూ ఉంటుంది.
చీకటి రాత్రులు ... వీదుల్లో నీడలా నడుస్తుంటాను.
నాకు నా అనే వారు,
బాధ నుంచి, ఉపశమనం ఇచ్చే వారు,
చూరు నీరు వర్షంలా కారే కన్నీటిని ఆపేవారు లేరు.
ఆలోచిస్తూ నవ్వుకుంటుంటాను.
నడుస్తుంటూ ఒంటరిగా,
నాలో నేను ... మాటలాడుకుంటుంటాను.
కారుతున్న కన్నీళ్ళ చారలు
పగిలిన గుండె ముక్కల్ని కలపలేక,
పిచ్చివాడ్ని దిష్టిబొమ్మని లా ... ఒంటరిలా.

Sunday, November 11, 2012

ఆశ!

 || ఆశ! ||

చించి, చీల్చి, విడదీసి, పగలగొట్టినట్లు ... హృదయం!
నా భావనల అనిశ్చితి ... సహాయంకోసం చూస్తూ,
ఎవరైనా
నా గుండెలో లోతుగా దిగిన
అపనమ్మకం తుపాకిగుండును
క్లినికల్ టచ్ తో తీసేసి నమ్మకం కలిగిస్తారని

నీరసం నిస్సత్తువ నిలబడలేనితనం ...
పడిపోకుండా పట్టుకునే
ఆసరాగా
ఎవరో రావాలని ఆశ,
నొప్పి, బాధ అశక్తత ... అసంతులనల గతం ... పీడను
ఆ ... సాహచర్యంలో బంగాళాఖాతంలోకి విసిరేద్దామని

బయటికి మాత్రం ఏమీ జరగనట్లు డాబు ...
నటిస్తున్నా
అపనమ్మకం నొప్పి,
బాధ భరించలేక లోలో తల్లడిల్లుతున్నా
పూర్తి శశక్తుడ్నై, ఆత్మస్తైర్యం పొందాలని ... ప్రయత్నిస్తున్నా
నా హృదయం తాళముచెవి నమ్మకం కొక్కెంకు తగిలించి మరీ

అల్లకల్లోలంగా ఉన్న,
నా హృదయం ప్రేమ మందిరం లో
గోడలనిండా ఆమెకు మాత్రమే అర్ధం అయ్యేలా
మోడ్రన్ ఆర్ట్
నా మనసు భావనల పిచ్చిగీతలు ... విసిరేసిన రంగుల్లా
ఆమె సాహచర్యంలోనే అది సుందర అమూల్య సంపద.

ఒత్తిడి పెరిగి, తత్తరపాటు చీకాకు ఎక్కువై
మహామారి లా ... ఆబ,
నా రొగానికి మందు ...
ఆమె నవ్వు, ఆమె కౌగిలే అయినట్లు
ఎన్నెన్నో భావాలు, సంబందం లేని అస్పష్టత ...
శరీరం అలిసిపోయి కదల్లేని స్థితి ... శూన్యాక్షరాల్లా

ఎవరూ ... పంచుకోలేని, ప్రయత్నించని, పోటీలేని
ఏ గతమూ గుర్తు రాని ...
తిరిగి పలుకరించలేని
ఏకాంతం, సహజీవనం ఆరంభించాలని మనోబిలాష
ఆశ ... నేను ఆమె ఒకరికొకరం కావాలని

అలసట తీరి,
ఒత్తిడి తగ్గి ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్నట్లు ...
జీవితం
సర్వం మసకమసగ్గా కనిపిస్తుంది
ఆమె నేను చేసుకున్న బాసలు గుర్తుకొస్తున్నాయి
నమ్మకం ... ఇప్పుడు నిద్దురలో ప్రతిసారీ ఆమె ముఖం నిర్మలంగా

కలిసి
ఆమె నేను ఇద్దరం
ఏక దృష్టితో గమ్యం
భవిష్యత్తును, ప్రపంచాన్నీ ... ఒక్కటిగా చూస్తున్నట్లు
మేమిద్దరం మాత్రమే ప్రకృతి వసంతంలా ...
పల్లవించి ఫలిస్తున్నట్లు ... ఇప్పుడు మనసెంతో ప్రశాంతంగా ఉంది.

నీవూ నేను

నీవూ నేను

నేను భయపడ్డానని కాదు
నిన్ను పోగొట్టుకుంటానని
వివరించడానికంటూ కారణం లేదు
నీవు ఏడిస్తేనో ... నేను ఒంటరిగా ఉంటేనో తప్ప
ఇంకా పట్టింపు లేదు
నిజం నా గొంతులోనే అదిమేయబడి ఉంది.
నీవు పాడే పాటల్లో తొలగించబడి ఉంది.

నీలో దృష్టి లోపం లేదు
పనికట్టుకుని నన్ను పట్టించుకోవు
నీకు ఎంతో ఉపయోగం అవసరం ఐతే తప్ప!
ఒంటరిగా ఉన్నా కూడా
అతిగా ఆలోచించవు
నా ఆలోచనలు నా భావనలు నీతో
ఒంటరితనాన్ని కోరుకుంటాయని తెలిసి కూడా

కాలుతున్న కొవ్వొత్తులు
పుట్టినరోజు పండుగలు
కాలాల్సిన గంధము చెక్కల జ్వాలలు
దాల్చిన చెక్కల మంటలు
మెల్లగా వేడెక్కి
ద్రవరూపమో బూడిద రూపాంతరమో
చెందాకైనా నీవు నన్ను కలుస్తావా
అనే మీమాంసలో నన్నుంచావు

ఇక్కడ ఒంటరిగా నేను
అక్కడ ఒంటరిగా నీవు
హృదయాలు తగలబడుతున్నాయి.
రక్తం ఉడికి ఉవ్వెత్తున లేస్తుంది.
గుండె వేగంగా కొట్టుకుంటుంది.
మనసొకటి తపిస్తూనే ఉంది
నీతో ఒంటరితనం కోసం

కొవ్వొత్తులు కరుగుతున్నాయి
హృదయాలు కాలుతున్నాయి
నొప్పి ...
ఎండిపోయిన రక్తం చిట్లుతూ
భరించలేనంత బాధ చావకుండానే
నరాలు కండరాల ఏడుపులు
సహజీవనం సాంగత్యం ...
నీతో ఒంటరితనం గుసగుసలాడ్డం కోసం.

అంత సులభం కాదని ... తెలుసు 
అవసరానికి మించి అక్షరమైనా
ఎక్కువ తెలియని స్థితి నాదని
నిజాన్నీ ఎన్నాళ్ళో దాయలేమని
నీవు దాచుకున్న నిజం ఎన్నాళ్ళో దాగదు ... అని
చెబుతాను అన్నావు.
నమ్మాను.
నా కోరికా అవసరం కూడా కనుకే

అయినా ...
ఎందుకో
ఆలోచిస్తుంటే
ఇప్పుడు ... నీవు అంగీకరించాక
ఉండాలనిపించడం లేదు
ఒంటరిగా నీతో

పోరాటం జీవితం ... సాహిత్యం!

చంద్రశేఖర్ వేములపల్లి || పోరాటం జీవితం ... సాహిత్యం! ||

పుట్టడం ప్రాకృత్యం
సమాజంలో జీవించడానికి పోరాడటం అవసరం
ఇల్లు ఉన్నా, సంసారం ఉన్నా, సన్నిహితులున్నా
జీవితం అస్పష్టమే!
కాలంతో కలిసి కదలడంలో
అలసిన ఎందరొకో

ప్రపంచం బహు విస్తారం
చదువు, డబ్బు, గౌరవం ఉన్నా
క్లిష్టమైన ప్రశ్న జీవితం అనిపిస్తుంది
పోగొట్టుకున్నది తిరిగి పొందాలని,
జీవన రహస్యాల్ని చేదించాలని
ప్రతి ఒక్కరి ఆలోచనల సారాంశం ఉద్దేశ్యం

నాగరిక సమాజ నిర్మాణం,
జీవన సరళి, సామాజిక వేదికల పై
భావ ప్రకటనల తో ... పై పై సంతృప్తిని పొందుతున్నా
వాస్తవ సంతృప్తి పొందలేక, జీవితాలు లోతైన శున్యం
ఖాళీ దుఖ్ఖం నిజానుభూతై ...
స్పష్టంగా నెరవేరే అవసరాలు
సంతృప్తిచెందని ... తీరని ఎడారి దాహం మనిషిది

ఒకరూ లేక అందరూ
లోతుగా ఆలోచించాల్సిన జీవన ఆశయం సారాంశం
మతం బోధనల సారం కాంతిలో ... తత్వంలో
ప్రకృతి నడిపించే మార్గంలో,
సాహిత్య కళాకారులే
శాశ్వత ప్రశ్నలకు సమాధానం యివ్వాల్సింది.

సాహిత్యం పుస్తకం ద్వారా
మానవ అనుభవాల్ని
మార్గ ప్రతిపాదనల్ని చెయ్యడం అవసరం
మనిషిలో ఆలోచనల్ని పెంచడానికి
పూర్తిగా సంతృప్తికర సంస్కృతిని
అనుసరించేలా చెయ్యడానికి

2012, నవంబర్ 11, ఆదివారం సాయంత్రం 3.45 గంటలు

పరివర్తన నాలోనే!

చంద్రశేఖర్ వేములపల్లి || పరివర్తన నాలోనే! ||

ఏదో ఆకర్షణ!
ప్రసన్నత నీ ముఖంలో
మంచిని మాత్రమే చూస్తున్న నీ వడపోత లక్షణం!
నీకు ఎదురుపడిన ఎందరిలో నేనూ ఒకడ్ని!
మొండివాడ్నని నాకే అర్ధం అయ్యేలా ...
సరళంగా, సున్నితంగా మధురంగా నీ ప్రవర్తన

నీలాగానే అందరూ ఇష్టపడే,
ఆకర్షణను కావాలని ఆశ, ఆవేశం!
అందరినీ ప్రేమించాలని, అరమరికల్లేకుండా ...
మంచి, స్నేహం, మానవత్వం పర్యాయపదాన్ని
కావాలని ఉంటుంది ... కానీ,
కాలం, అనుభవం నన్ను మార్చేసింది.
ఇప్పుడు ప్రతి ఒక్కరిలో నాకు చెడే కనపడుతుంది.
నీలోనూ చెడునే చూడాలని నా ప్రయత్నం!

నీలో చెడును చూసే ఉద్దేశ్యంలో
నా అస్తిత్వం కోల్పోయాను.
తెలియకుండానే నీ ప్రేమలో పడ్డాను.
నీ మాటలు, నీ లో మంచితనం
నీ లోని సేవాగుణం సహకారం
నీ మంచితనం వైశాల్యం కొలవలేని స్థితి నాది!
అయాచితంగానే కొట్టుకుంటున్నాను. నీ ప్రేమలో
కక్కి మింగలేని నిజం ... నా మది వరకే పరిమితం!

2012, నవంబర్ 11, ఆదివారం సాయంత్రం 3.30 గంటలు

Saturday, November 10, 2012

లుప్త ప్రేమ


ఎంతో కాలం వృధా అవుతుంది
ముదిరిన పిచ్చి తగ్గడానికి సమయం అవసరం
పెళుసైన, బలహీనమైన ప్రేమావేశం
ఆలస్యం చౌరాస్తా లో గమ్యం తెలియని పురోగమనం

ఆశ్చర్యకరంగా చిరిగిన తెల్ల కాగితం లా
నీ చెయ్యి ... నీ చేతిలోనే తెగి రక్తశిక్తమై
రక్తం కోల్పోయాకే ... బ్యాండ్ ఎయిడ్ కనబడినట్లు
గాయాన్ని అప్పుడు గట్టిగా, బిగువుగా చుట్టినట్లు

దైర్యం ఒక కారణం అక్కడ
స్పష్టమైన అభిప్రాయ ఉపసంహరణం 
మాయం కాదు నొప్పి ... నలుపుతూనే ఉంటుంది
మిగిలిపోయిన అపరిష్కృత సమశ్యలా

Wednesday, November 7, 2012

వెన్నెల వాతావరణం!
ఒక చల్లని వెన్నెల రాత్రి
ఆకాశాన్ని చూస్తూ నిద్దురలోకి జారినపుడు
అక్కడ ... తారలు, నక్షత్రాల సరసన నీవు ...
గోరువెచ్చని హాయిలా ... నన్ను పలుకరిస్తూ,  

నీవూ నేనూ పక్కపక్కన కూర్చున్న
గాలి దూరని సామీప్యం ... మంచు కురుస్తున్న చల్లదనంలో,
నేలపై పెరిగిన గడ్డిపరకల్లా ... మనం!
చల్లని చందమామ చూస్తూ, ఆహ్లాదం మారుతున్న అంతరంగాలు!

ఆరుబయట విశాలమైన ఆ నీలి ఆకాశం కప్పు ...
కింద వెన్నెల వెలుగుల ఆవరణలో చల్లదనపు ఆనందం!
గడ్డిపరకల్లా అటూ ఇటూ ఊగుతూ ఇరు మనసుల నాట్యం!
అది, గాలి బలంగా ఊళలు వేస్తున్న ఆత్మీయ రోదనం!

మనం ఒకరి కళ్ళలోకి ఒకరం తదేకంగా చూస్తూ,
ఎదుటివారి ఆవేశాన్ని, ఆలోచనల్ని, అంచనావేస్తూ ...
తనలోలానే అయ్యుండొచ్చా అని ... ఆశ్చర్యపోతుంటే
ముచ్చటగా ... దట్టంగా పెరిగిన గడ్డిపరకలు మనల్ని తాకుతూ,

వెన్నెల కురుస్తున్న చల్లని తెల్లని రాత్రి
ప్రేమకోసం అస్తిత్వాలు కోల్పోయిన హృదయాల అంతరంగంలో మీమాంస,
నీవూ నేను కలిసి మనం మమైకం ఐనట్లా?
లేక చల్లని ఆహ్లాద వాతావరణం మోహనికి మోసపోయినట్లా ... అని,


Tuesday, November 6, 2012

సహజం!


మెరిస్తున్న ఆ కళ్ళు
ఆకాశాన నక్షత్రాలు
నిర్మలం, మబ్బుల్లేని
ఆకాశం ... ఆ ముఖం!

వెలకట్టలేని,
వెన్నెల పరిచిన చల్లదనం ... ఆమె చిరునవ్వు,
మధుర గందర్వ గానం
సున్నితంగా స్పర్శిస్తున్న గాలి గుసగుసలు

ఎటు చూసినా
ఆమే...లా ఆకాశం
నా మనసు భావనల్లో
ఆలోచనల్లో ... ఆమె నా సొంతం అని,

చల్లని గాలి
సుతారంగా స్మృతుల్ని తట్టి,
విరహ వేదన ...
గుండె వేగంగా కొట్టుకుంటూ,

ఒకప్పుడు నేను
ఎంతగానో పూజించి
ఆరాధించిన ఆమె చిరునవ్వే
కనిపిస్తుంది కళ్ళు మూస్తే,

నా కళ్ళు అయాచితంగా
కన్నీరు కారుతూ,
లోలో ... ఆత్మ
మౌనంగా రోధిస్తుంది.

పొందాల్సిన సమయంలో
పొందిన బహుమానం
ఆమె ప్రేమ
తృటిలో పోగొట్టుకున్న నిర్భాగ్యుడ్ని

ఆమె మళ్ళీ కనిపించింది.
మబ్బులు దాటిన ... వెన్నెల వెలుగై,
నా మనసు బృందావనంలో మల్లెలు 
పరిమళాలు ... మనసు పూజ అసహజమా!

Monday, November 5, 2012

పెరటి ఫలంఇవ్వాల్సినవి, ఫలించాల్సినవి ఎన్నో
తొట్రుపడటక తప్పదు ఎంతటివారికైనా
కష్టిస్తేనే జీవితం కనుక
నాకు నేను నా పరిధిలో
మహరాజులా కనిపించొచ్చు

ఎవరి జేబులోనూ చిరుగంటలు లేవు
అందరూ ఆస్తిపరులే ... ప్రకృతి ఆస్తి 
ఒకరి ఆనందంకోసం మరొకరిలో మార్పు రాదు
పరిస్తితుల్ని బట్టి తనను తాను మార్చుకుని
బ్రతకగలిగిన్నాడు ... జీవితం మధురానుభవమే

ప్రతి ఒక్కరిలో లోలో ఆత్మ సంఘర్షణ
తమ కలను నిజం చేసుకునే ప్రయత్నం
ఆశయంపైనే ఖచ్చితమైన దృష్టి ఉండడానికి
చెడు వైపును చెడు నీడల్నీ తొలగించుకోక తప్పదు

నిబంధనల్నీ మార్చుకోక తప్పదు
జీవితం ప్రతి ఖాళీ పేజీ మీద నిర్దిక్షక్షరాల్ని రాయాలి
సామాన్యుడ్ననుకో ... పాజిటివ్ ఆలోచనల్తో
కఠిన రహదారుల్ని మంచి మార్గాలుగా మార్చుకో

ఒక అద్భుతం, ఆనందం జీవితం అవుతుంది
నీవు నాటిన మొక్క ఫలాలు నీకే చెందుతాయనుకుంటే
మరి ఆలశ్యమెందుకు నేస్తం?
స్నేహం, సద్భావనా బీజాలు నాటుదాం ... ప్రతి పెరట్లో
మానవత్వం, మంచి మనుగడ ఫలాల్ని పొందుదాం!

Saturday, November 3, 2012

మనోరోధన


నేను ఒంటరిని
ఒంటరిగా ... సాగుతూ నా నీడ

గాయం సలుపుతూ
చాలా తీవ్రంగా ... దుమ్ము కొట్టుకుపోయి పుండు

అవసరం తీరిన నిర్లక్ష్యం
చెత్తకుండీలో విసిరేసిన విస్తరాకు ... నేను

రక్షణ కవచం సెక్యూరిటీని
అవసరానికీ, ప్రాణానికీ ... తీరాక బారాన్ని

ఒంటరి తపన ... ఎవరూలేరని
సాన్నిహిత్యం, నొప్పి ... ఓదార్పు కోసం

మనో రోధన
ఎదురు చూసీ చూసీ ... ఆశ ఆవిరై పోయి

నేను ఒంటరిని ... ఒంటరితనాన్ని
మనిషి మరిచిన ... ఎవరూ పట్టించుకోని మానవత్వాన్ని

కోరిక!


ఎంతో సులభం ...
ఊహించడం
ఎంత అందంగా కనిపిస్తావో
నా కళ్ళకు నీవని

అద్భుతం, దైవసంకల్పమేమో
అనిపిస్తుంది ...
నీ చెయ్యందుకున్న ప్రతిసారీ
నాజూకైన నీ స్పర్శ

నీ పెదవులు రాలే పలుకు
మాధుర్యం ... ముత్యాల కోసం
కొట్టుకోవడం మానేసి
వెదుకుతుంది నా హృదయం

నా దృష్టి ...
శ్వాసించే గాలి కన్నా ... అమూల్యమైన
నీ పదాలు పూచే
ఆ అదర పరిమళాల పైనే

నా ప్రతి ఊహలో, కలలో
ఊరించే నక్షత్రానివి, ఆశవి
నా మనసును ఆకర్షించి,
కవ్వించే ... మోహ సుగందానివి.

తోడ్పాటును, శ్రమనై ...
నీతోనే ఉండాలని,
నీ ప్రతి కార్యాచరణలో ...
స్వేదబిందువు కావాలని ... కోరిక!

నా ... శరీరం,
నా హృదయం, నా ఆత్మ
నా ప్రతి ఆలోచనా ... నా ప్రతి ఆవేశం
నీ చుట్టూ నీ నీడలా ఉండాలని కాలాంతం వరకూ ... కోరిక!

Friday, November 2, 2012

ఏమని చెప్పను?నీవు నా నమ్మకం
తోడుగా ఉన్నాననే భావం
నా నేస్తం
కష్టాలు, కన్నీళ్ళు,
ఉలికిపాటు బ్రతుకు లో
ఏమాశించావో
నీ మదిలో ఏముందో
అన్ని స్థితుల్లోనూ

నాతోనే ఉన్నావు
నా ఆత్మలా,

బాధతో నేను కొట్టుకుంటున్నప్పుడు
నన్నోదార్చే కాలం ...
నా పక్కన నీవు!
బాధ, ఆవేదన
భరించలేక అల్లాడిపోతున్నప్పుడు
మరిచిపోయేందుకు,
మనో నిబ్బరం పెంచేందుకు,
ఆనందాన్ని నింపేందుకు,
నన్ను కోల్పోయిన నాకు
చిరునవ్వు మాత్రవు!
ఊరట వు! దేవతవు!

జీవితం ఆనందాన్ని
అందాన్ని గుర్తుచేస్తూ
ఆశ ఆవిరై,
అసంభవం అనుకున్న క్షణాల్లో
సంభవమెలాగో విడమరుస్తూ,
సహేతుకంగా బలాన్నిస్తూ,
ఊతగా ...
రాత్రి నా కళ్ళు
మూతలు పడేవరకూ ,
ఆత్మబందువులా ఉన్నావు.

నన్నిప్పుడు డిస్చార్జ్ చేస్తున్నారు ...

కనిపించవేం నేస్తం?
నీవెక్కడ?
నా జీవితానికి నీడగా
నా తోడుగా ...
నా మనసంతా నీవే అని ...
నిన్ను నేను పూజిస్తున్నానని ...
ప్రేమిస్తున్నానని!
ఏమని చెప్పను!

ప్రేమ పూజారి


సగ జీవితం గడిచిపోయింది
నేను కోరుకున్నవాళ్ళు నన్నిష్టపడక
నన్నిష్టపడ్డవారిని నేనిష్టపడక
జీవన బాగస్వామిని నిన్ను వెతకడంకోసం
ఒక జీవితం చాలదేమో అనుకున్నాను

పెద్దలు కుదిర్చిన అనుబంధం
అగ్ని సాక్షిగా పొందిన నీ సాహచర్యం
నిన్ను కాదనుకుని పోగొట్టుకున్నాకే తెలిసింది
అందం వేరు సౌందర్యం వేరని
కళ్ళు మోసం చేస్తాయి మనసుతో చూడాలని

అందంగా సీరియల్ లో అమ్మాయిలా లేవని
నిన్ను కాదనుకున్నాను నీతో జీవించలేనని నిర్ణయించుకున్నాను
అసహ్యించుకున్నాను ... నీవెంత బ్రతిమాలినా ససేమిరా అని
గుమ్మంలోంచి తోసేసాను ... మళ్ళీ రావొద్దని బలవంతంగా
చివరికి నీవు దూరమయ్యి కనుపించనంతవరకూ ... పట్టుబట్టి మరీ

ఏ పాఠం జీవితం నాకు నేర్పాలనుకుందో ఏమో

అద్దంలో నా ముఖం ... లో అవాంచనీయమైన మార్పులు
నాకు నేను వికృతంగా ... ఔనూ నేనేనా ... నేనెందుకిలా అవుతున్నానా అనిపిస్తూ
కాదనుకున్న నీవు దూరమయ్యావుగా ... మాయమయ్యావుగా
ఉత్సాహం, ఉల్లాసం ఉరకలెందుకెయ్యడం లేదో
మనసెందుకు నన్నెందుకిలా బాధిస్తుందీ అని ... మనోవేదన

అద్దంలో చూస్తున్నాను ... పరీక్షగా
నాలో ... లోలో ... ఏవో రకరకాల రాక్షస రూపాలు
ద్వేషం, వ్యాకులత, బాధ ... నేనులా
నేనులు ... వీటన్నిటి నీడలో నిర్భావంగా నిలబడ్డ నీవలా
సగటు స్త్రీని గృహిణిని నిన్ను చూసి తొట్రుపడ్డాను ... ఇక్కడా నీవేనా అని

నేలకూలాను ... రోగమేదో పీడై ... నిలువెల్లా నీరసం
అశక్తత తో కార్పోరెట్ హాస్పిటల్లో బెడ్ మీద నేను ...
ఊపిరాడని స్థితి ... సమాజం నన్ను ఏవగించుకుంటున్నట్లు ... సీరియల్స్ ల్లో
సమశ్యల ఉప్పెన కష్టాలన్నీ ఒకదాని తరువాత ఒకటొచ్చినట్లు
నర్సులు అటెండర్ల కళ్ళలో చికాకు అసహ్యం ... డబ్బుతో మారే ముఖ కవళికలవి

మళ్ళీ నీవొచ్చావు. ఆహ్వానించకుండానే ... బాధ్యతేదో నీదే అన్నట్లు
పుండైపోయిన శరీరాన్ని బద్రంగా తడిమావు తుడిచావు
మరణించడమే మేలేమో అనుకున్న క్షణాల్లో
అమృత హస్తంలా నమ్మకానివై పడిపోతున్న ప్రతిసారీ పడకుండా
చేయూత నిచ్చి వెచ్చని నీ సాన్నిహిత్యం సపర్యలతో తోడై ఉన్నావు

సిగ్గేస్తుంది సిగ్గు ... నేను విదిల్చేసిన నువ్వలా నన్ను ఆదరిస్తుంటే
చచ్చెందుకుపోలేదా ... బ్రతికెందుకున్నానా అని భావనలతో ... మనసు
నమ్మకమో, మేలుకొలుపో ఇప్పుడు నేను కోలుకున్నాను.
మనసు కళ్ళతో చూడగలుగుతున్నాను ... నా ఆలోచనల్లో పశ్చాత్తాపము
నాలోని రాక్షస రూపాలు ఒక్కొక్కటే మాయమై ... రాక్షసత్వం స్థానే నా నీడలా ఉన్న నీ ప్రేమ పూజారినై

ఆఖరి క్షణంముగింపు ... అంచు ... ఆ చివర ...
అన్నింటికీ ఉంటుంది.
ఓ అద్భుతం ... కొన్ని క్షణాల అంచుల మీద
ఓ ఘోరం ...రోడ్డు ప్రమాదం అంచులో
శరీరానికి శక్తి ...చివరి ముద్ద
తాగేసిన కాఫీ ... అలసట ముగింపు
చివరి ప్రేమ
ఆమె రూపం ... హృదయం ఆసాంతం 
తుది ముద్దు
కరిగిపోయిన ఆ కడపటి కౌగిలి
నీవు రాసిన ముగింపు వ్యాఖ్య
తుది ... అంతిమ ... గడిచిన ... చాలిన ... చివర తప్పదు దేనికైనా

కానీ,
అతిదుష్టమైన ముగింపు, అంచు ... మాత్రం
చివరి శ్వాసే
ఆ పిదప మరణమే కనుక

Monday, October 29, 2012

చంద్రశేఖర్ వేములపల్లి || జడ్జిమెంట్! ||

ఒక ఆరంభం,
ఒక అంత్యము,
మధ్యలో మనుగడ జీవితం! 
వీటి ఉనికిని తెలుసుకోవాలని
ఎందుకంటే ...
నా ఆలోచనల కలుపుమొక్కల మదిని,
ఉరితియ్యాలని ...
మొదట్లో కానీ,
ముగింపులో కానీ,
వార్డ్ రోబ్ లో హాంగర్ కు ... చొక్కాలా

నేనో కవిని! భావుకుడ్ని!కవిని
ప్రేమ, బాధ, కన్నీరు, ఆవేశం నాలో
సంఘర్షణ అక్షర రూపం
అనురాగం నా పద పేర్పిడి

కోల్పోతుంటాను.
అప్పుడప్పుడూ,
నన్ను నేను, నా కవితల్లో ...
తిరిగి వాస్తవంలోకి రాలేనంతగా,

ఆ భావనల్లో ...
పాత్రను నేనే అయినట్లు,
మరో ఊహా ప్రపంచంలో ...
జీవితం గూడు కట్టుకుని ... కాపురం చేస్తూ,

అస్తిత్వం లేని,
తెలియని దారిలో,
ఎరగని గమ్యం వైపు ...
ఆవేశం కత్తి అంచు మీద నడుస్తూ,

ఒక భావన, ఒక కవిత ...
కవిత తరువాత మరో కవిత రాస్తూ,
లోతుగా భావ అఘాదాల్ని తట్టుతూ,
మరింతగా నన్ను నేను కోల్పోతున్నాను.

నేనో కవిని!
కవిత రాసేప్పుడు,
నా అస్తిత్వాన్ని నా కవితలో ... కోల్పోతుంటాను!
వెనుదిరిగి రాలేనంతగా ...

Sunday, October 28, 2012

అందరిలో నీవూ ఒకడివివయసే వస్తుంది సాధించింది లేదు అని వెరుపు!
వెరుపెందుకు నేస్తం?
అందరిలో నీవూ ఒకడివని మరిచిపోకు.
ఈనాడు
బలంగా, ఆరోగ్యంగా, ఉన్నతంగా కనిపిస్తున్న మనుషులు,
దృఢ చిత్తంతో కార్పోరేట్ సంస్థల్ని, దేశాల్ని ఏలుతున్న మహిళలు
ఒకప్పుడు ...
వారి వారి భయం, భంగపాట్లను, ఎదుర్కొన్న వారే ...
కృంగిపోకుండా, భయాన్ని, నీరసాన్ని ... సామాజిక నిర్లక్ష్యాన్నీ
పట్టించుకోకుండా స్వేదించి, పట్టుదలతో ...
పడిన ప్రతిసారీ అనుభవాల్ని, ఏరుకుని ... లేచి నిలబడ్డవారే
వీరి గెలుపు కు పునాధి, సమశ్యను సూటిగా చూసే ... సంఘర్షణా తత్వమే.

బీదవాడ్ని! బహుజనుడ్ని! దాచుకోలేను అస్తిత్వం అని ... సిగ్గు!
సిగ్గెందుకు నేస్తం?
ఎందరిలోనో నీవూ ఒకడివని మరువకు.
నీ సామాజిక సోదరులు ... స్వేదిస్తేనే కూడు జీవితాలు
ఉదర పోషణార్ధం వృత్తుల ఆదారంగా బ్రతికే ఎందరో సగటు జీవులు
ఒకప్పటి ... దుమ్ము, దూళి, మడ్డి శరీరం మనుష్యులు
ఇప్పుడు దేశాన్నేలే ఉద్యోగిస్వామ్యం, ప్రజాస్వామ్యం ... మంత్రులు, మేదావులు!
నిన్న బట్టలుతికే చాకలి నర్సన్న నేడు ముఖ్యమంత్రి
నిన్న వీదులూడ్చిన గృహిణి రావులమ్మ నేడు గృహ మంత్రి
ఏదీ ఊరికినే రాలేదు వారి వారి స్వేదం, కృషి
వారి అమర ఆకాంక్ష ఫలితమే వారి వారి విజయ కేతనాల రెపరెపలు

ఆలోచించి చూడు నేస్తం! ... అందరమూ కారణ జన్ములమే
ప్రతి పుట్టుక వెనుక ఓ ఉద్దేశ్యం, ఓ కారణం ఉంది
ఈ సంసారం నీది ...
మరిచిపోకు విశ్వమానవాళి కుటుంబంలో నీవో నిర్ణయానివే అని
చెట్టూ, చేమ, జంతువులు ఉభయచరాలు ... అన్నీ మన సహజీవాలే
జీవించడం ప్రవాహం! ... జీవం ప్రకృతి ప్రసాదం!
పంచభూతాల ఆస్వాదన ... ప్రతి ప్రాణి సామాజిక హక్కు
స్వాగతించుదాం! అసంపూర్ణతతలెన్నున్నా ...
మనం జన్మించిన ప్రపంచాన్ని ... మనను స్వాగతించిన నేస్తాన్ని!

Friday, October 26, 2012

భూమిని మోస్తున్న భావన నాలోఒంటిరితనం మోపులా బారమై ... తలమీద
బలహీన, దుర్బల శరీరం
నిస్తేజం అవుతున్నప్పుడు
ఆశ్చర్యం అద్భుతం సాన్నిహిత్య మహిమ

ఒకవేళ ఒంటరితనానికే తూనికుంటె,
నేను మోస్తున్న ... బారం 
ఇప్పుడు నేను మునిగున్న ఒంటరి మౌనం ...
వెయ్యి రెట్లుంటుంది

ఎంతద్భుతమో సాటి మనిషి స్నేహం వెచ్చదనం
ఎంత తేలిక చేస్తుందో మనసును
ఉల్లాసం కలిగిస్తుందో హృదయంలో
ఎంత సంకటం లోనూ ... ఎంతటి జీవన సంక్షోభంలోనూ

నాలో ఒంటరితనం దూరమై బరువు కోల్పోయిన ఉల్లాసం
ప్రేమరాగం పల్లవించిన వసంత ఋతువులా
బారమంతా దిగిపోయిన భావన
తోడుగా నీవున్నావనే ఆలోచనలో ... నీ సాన్నిహిత్యంలో

Wednesday, October 24, 2012

సంసారం!నాలో అగ్ని,
ఆవేశం, ఉద్వేగం
వెచ్చదనం మనోసాంగత్యం
కామక్రోధాదిగుణరసం!

నాలో మంచు,
చలి, సీతలత్వం
ద్వేషం విషం
వైమనస్యం మనసు విరుగు లక్షణం!

నేను
సూర్యుడ్నైతే
ఉల్లాసము, ఉత్సాహము, చైతన్యం
నేను
చంద్రుడ్నైతే
విచారము, వ్యాకులము చీకటి దొరతనము!

నేను, ఆమె
మా ఇద్దరి మధ్య సన్నని మార్గం లో
ఇద్దరం కలిసి నడుస్తున్నాము
సంప్రదింపుల సమాలోచనలు చేస్తూ
..........
మా ఇద్దరికీ తెలుసు
మానవాళి యావత్తూ
సృష్ఠి, స్థితి, లయ అనే
భిన్న దశల చైతన్యమే అని
ప్రేమ, ద్వేషం
నిప్పు, మంచు ... జీవన సాగర మదనంలో
మజిలీలే అని ...
ఉష్ణాన్నీ, చలినీ
అవసరేత్యా ఆశ్వాదిస్తూ ... జీవించి ఉంటూ,
ఎదుగుతూ, రేపటి పౌరుల జన్మలకు కారణం మేమే అని

Tuesday, October 23, 2012

చంద్రశేఖర్ వేములపల్లి || ప్రేమే జీవనం! ||

నా నిశ్చల మనోభీష్టం
గాలినై, నీ శ్వాసనై ...
నీ గుండెను చేరాలని,
రక్తాణువులను శుద్ది చెయ్యాలని 
ఉప్పొంగే వరదలా,
దమనులు సిరల్లో కదలికనై
నీ ప్రతి అణువులో ఆక్సీజన్ నై
నూతన చైతన్యం,
ఉల్లాసం ఆహ్లాదాన్నై
అమర ఆనందాన్నై
ఉండిపోవాలని ... నీ జీవితంలో

వాగునై,
వరదనీరునై,
నదీ ప్రవాహం
కదలికలో వడినై ...
ప్రేమ సడినై,
హోరునై వినపడాలని
నా హృదయపు విరహతాపం
బలవంతపు దాపరికం
బయటపడుతూ దాచుకుంటున్న
మోహరాగం మొండిపట్టుదలను
ఆశను విరహపు
నిశ్శబ్ద గడియల ఆవేశాన్నీ
నిబద్దం చేసుకుంటూ సాగాలని

పూర్ణగ్రహణం
మనసును పట్టి
ప్రేమకు పరీక్షై
నిస్థైర్యం చెందే క్షణం
నీ ఆకర్షణే బలం!
నీ కళ్ళ అత్యుత్సాహం
చూపుల సూదులే ఆయుధం!
నీ తలపుల్లో
నక్షత్రాన్ని నేనై
తళతళమని మెరిసే
ప్రేమ కిరణాల స్పర్శ ... తో
జీవితం స్వర్గదామం కావాలని ...

2012, అక్టోబర్ 24, బుదవారం ఉదయం 11.30 గంటలు

Monday, October 22, 2012

ఆరాటం!
ఈ మధ్యనే
నీవు నాకు పరిచయం అయ్యింది
కానీ
నా మనసు భావనల్లో
ఎన్నో జన్మల అనుబంధం అనిపిస్తుంది

ఉల్లాసమో
వొణుకో నాలో
నిన్ను స్పర్శించాలనే ఆలోచన
నీ చెయ్యందుకుని
అలాగే ఉండిపోవాలని అభిలాష

ఆనందమో
మురిపెమో వెలుగై నాలో
నీ సాన్నిహిత్యం
మనోవాంచై
ఎప్పటికీ నీతోనే ఉండిపోవాలని

మోకాళ్ళలో తడబాటు
నిలబడలేని అలసట,
నీరసం ... గాల్లో తేలిపోతున్నట్లు
నీ కౌగిలి చేరి
కలకాలం సేదదీరుతూ అలానే ఉండిపోవాలని

నీ ముద్దు
నిశ్వాసల వేడికి నా నుదురు
శరీరం ... ఆవిరై
అద్దిన ఆ పెదాలు
అలానే ముద్దై మిగిలిపోవాలని

హృదయం ఊగిసలాడుతుంది
నీ ఆత్మీయత
చిరునవ్వు కోసం
కొలత కందని
నీ మనొజ్ఞ ప్రేమ కోసం!

నా ఆలోచనల్లో


నిద్దుర రావడం లేదు
మనసు నిండిన నీ ఆలోచనలు
మరిచిపోలేను ... నిన్ను
నీకైనా తెలుసా మరుపెలాగో

ప్రతి రాత్రి నిద్దురలో
నా కలలు నీ, నా చుట్టూ
నీవూ నేనూ కలిసున్నట్లు
కలిసి జీవిస్తున్నట్లు ... కల నిజమయ్యేనా అనిపిస్తూ ...

కాళ్ళూ చేతులూ ఆడని
అసమర్ధజీవిని ... నా తలలో, మెదడులో
నీవులేని క్షణాల్లో ... ప్రతి రాత్రీ ఆలోచన్లు
నీ గురించే ... ఉలిక్కిపడి లేచి కూర్చుని మరీ,

నా పక్కన నీవున్నప్పుడు
నీ సాన్నిహిత్యం ఊపిరాడనట్లు ... శ్వాసించలేను
అయినా ఇష్టమే ... నీతోనే నీలోనే ఉండిపోవాలని
అనుక్షణమూ అను నిత్యమూ ...

మనం కలిసి కదులుతున్నప్పుడు
నాలో వొణుకు ... మాటలు రాని మౌనం
శరీరాన్ని అల్లుకుపోయి శ్వాస వేగం పెరిగి ... ఉద్వేగం
అయినా ... స్తిమితపడి అన్ని భయాలు ఆవిరై పోయి ఆ స్థితే కావాలని ఆశ!

నీ కళ్ళలోకి చూసినప్పుడు
నన్ను నేను కోల్పోయిన భావన
నీతో ఉండటం కోసం దేన్నైనా
మూల్యం చెల్లించాలని అనిపించే లక్షణం ... ఆవేశం!

నా ఆలోచనల్లో ... నాకు నేను
పిచ్చివాడ్నైపోతున్నానేమో అనిపించే అచేతనావస్థ అది
నా హృదయం మెదడును శాసిస్తున్న క్షణం
నిన్ను నేను ఘాడంగా ప్రేమిస్తున్ననని సంకేతాలిస్తూ నిర్దేశించే గుణం!

నీపై మోహం ఎందుకో!?


నీపై మోహం ఎందుకో అని మీమాంస
దేన్నైనా చెప్పాలనిపించే ... వినే నిండుతనానివి నీవు!
నన్నెప్పుడూ సమర్ధిస్తున్నట్లు ... నీ చూపులు
ఎంత మాట్లాడినా ... ఆసక్తే ఆ కళ్ళల్లో
నీ కళ్ళు, చిరునవ్వు ... నీ మృదు శరీరం స్పర్శ నాకిష్టం!
కాలం తెలియని మన పార్కుల కదలికలు
వెన్నెల గుసగుసలు ... నెమ్మది మాటలు
మరిచిపోలేదు ... మరిచిపోలేని క్షణాలవి
ఒక వెన్నెల సాయంత్రం ఎదురెదురుగా నీవూ నేనూ
నా కళ్ళలోకి సూటిగా చూస్తూ నీవన్నావు ...
"నేనంటే ఇష్టమని! నన్ను ఘాడంగా ప్రేమిస్తున్నానని"
నేను పరిపూర్ణుడ్నని నీవన్నట్లనిపించిన క్షణాలవి!
నీ దృక్పథం, నీ వ్యక్తిత్వం నాకిష్టం!
నీవు నాపక్కనున్నప్పుడు జీవితం వరంలా అనిపిస్తుంది
నిన్ను నిన్నుగా ప్రేమిస్తా! నన్ను నన్నుగా ప్రేమించూ అని
ఒకరికివొకరం సమభావం, సాన్నిహిత్యం ... జీవన సహచరులం కావాలని
మాటల్లో చెప్పలేని విడమర్చలేని మోహ భావనల మౌనరాగం!

ప్రేమ రాగాలాపనలో


మార్పు, ప్రేమ, ప్రియురాలంటే భయం
అయినా ప్రేమిస్తున్నాను
సాంప్రదాయాల గోడలు ... దూకాలని లేదు
అయినా దూకుతున్నాను
పెద్దలున్నారు ... మంచీ చెడూ విడమరుస్తూ
అయినా చెడువైపే కదులుతున్నాను
పెద్దలంటే గౌరవం .... నీవంటే ప్రేమ
అయినా నిన్నే ప్రేమిస్తున్నాను
మారిపోయాను  
సాంప్రదాయాల గోడలు దూకాను
పెద్దల మాటల్ని దాటాను
అయినా నాకు తెలుసు
నేడో రేపో స్వేచ్చావాయువుల్ని పీలుస్తా అని
ఆకాశం తలకప్పవుతుందని
పంచభూతాల సాక్షులై
నూతనధ్యాయం మొదలని
ఆలోచిస్తేనే
పులకరింపు, పరవశం, ఆనందం నిలువెల్లా
సిగ్గొదిలి నర్తించాలని
కారణం తెలియని నీ సాన్నిహిత్య మధురిమలో
ప్రేమ రాగాలాపనలో
మనసుకెందుకో అప్పుదప్పుదూ భయపదుతుంది
నిన్ను కోల్పోతానేమో అని
నీవు నా ఆనంద పారవశ్య పులకరింపుల
సమభావం ఇష్టపడవేమో అని
నవ్విస్తావో ఏడిపిస్తావో
అసంపూర్ణంగా వదిలేస్తావో
పరిపూర్ణత్వాన్నిస్తావో తెలియనితనంలో ఉన్నాను
నీవో పువ్వువి ... నేనా పిల్లనగ్రోవినిసుమా!!

కలలు నేల జారి ...


ఆ మూల
ఆకాశాన
ఒక నక్షత్రం
ఒక దేవత నా కోసం
స్వర్గాన్నొదిలి
స్వేత వస్త్రాలతో
తెల్లని మంచులా
పాల మీగడ సౌందర్యం
సాక్షాత్కరించింది
మరువలేని మల్లియనవ్వును ముఖాన అద్దుకుని

ఒక
ప్రేమ దేవత
దైవ సాన్నిధ్యాన్ని
గుడినొదిలి
నా కోసం
ఆశల్ని, ఆనందాన్ని
ఊహలసారం ప్రేమను
ఒడినింపుకుని
తెల్లని రెక్కలు ఊపుతూ దిగి వచ్చింది
ఆశల సుగందాన్ని వెదజల్లుతూ

ఒక
అదృష్టం
కోరని వరమై
స్వర్గాన్నొదిలి
నా ఇష్టాల మట్టి ముద్దై
రంగులు పులుముకుని
ప్రత్యక్షమయ్యింది
చెయ్యి చాచి చెయ్యందిస్తున్నంతలోనే
మాయమైపోయింది నా కల మెలుకువై నేల జారి మరీ

నన్నొదిలెళ్ళకు!?


మబ్బులు రాసుకున్న మెరుపు
ఉరుమై
... హృదయం
బ్రద్దలైన శబ్దం
భరించలేని నొప్పి కన్నీరు ...
గొంతు గద్గదమై

మొదటి మేఘ మదనం
తొలిప్రేమ
మహా మాయ
జల్లై కురుస్తున్నప్పుడు
ఒణుకు, తడబాటు
నేనెరుగను
ఎడబాటు ఇంత కష్టమని

భయం నా చుట్టూ అల్లుకుపోయి
సముద్రంలో అల్పపీడనమై
వెంటాడుతుంది
ఆశ, ప్రార్ధన
ఇలాంటి రాపిడి తగదని
నీవు నాతోనే ఉండాలని

మళ్ళీ కురుస్తానని
తిరిగొస్తానని
ఇంద్రదనస్సై అలరిస్తానని
మాటిస్తున్నావు
నా కెలా తెలుస్తుంది
ఎక్కడ, ఎలా, ఏక్షణంలో అని

చీకటి ఊహల్లో,
అనుమానాల్లో వదిలెయ్యకు
తొలకరిచినుకు
సాహచర్యపు మధురిమ
మరిచిపోలేని పుట్టుమచ్చ
అనుక్షణమూ ... కళ్ళముందే కదులుతుంటే ...

అనుభుతుల అల్లిక


ఆకాశం మంచంపై కప్పుకున్న
దుప్పటి మీద నక్షత్రాలు ... నా కన్నీళ్ళు
అలసి విశ్రమించే ...
బాధలు, సంతోషాలు,
విజయాలు, అపజయాలు నెమరువేసేది
కారుమబ్బుల తలదిండులోనే ...
తల దాచుకుని విలపించేది, ఆనందించేది.
ఉద్వేగాలు చల్లారి,
శరీరం కంపించడం మానాక,
హృదయం చంద్రుడి మెత్త ... ఆ లేత మేఘాలు
సముద్రపు నీరే అంతా ... నా మంచం అంచుల్లో ...
ఆకలి మంచానికి ఎవరో రావాలని
చూడాల్సిన అవసరం లేదు!
నా కన్నీళ్ళే ఆహారం!
ఆకలికి ఆహారాన్నౌతూ ... ఆలోచనలు
మది శూన్యంలోకి చూస్తూ ...
ఆలోచనలు క్రిందికీ, పైకీ ఊగిసలాటలు!
క్రమశిక్షణ లేకుండా ...
సంతోషాన్ని మాత్రమే ...
ఆలోచనల టేప్ రికార్డర్లో
రివైండ్ చేసుకునే వీలుందేమో అని ...
వెదికి, చూసి భంగపడ్డాను
మంచాన్ని అతుక్కుని ... నేను
ఆశ, ఆపేక్ష లేని మాంసపు ముద్దను!
నా రాలిన కన్నీళ్ళు ... ప్రత్యేకం!
తారలు, నక్షత్రాలు ...
అనుభూతులు వదులుకోలేను! మరిచిపోలేను ...
నెమరువేసుకుంటూనే ఉంటాను ...
ఆకాశం మంచంపై
కప్పుకున్న దుప్పటి మీద
తారలు, నక్షత్రాలు నా కన్నీళ్ళు
అలసి విశ్రమించాక ... అనుభుతులు తపనల అల్లిక నేను!

నిదుర రాదు!
కొన్ని రాత్రులు రాలేక, 
నిదురమ్మ సిగ్గుపడి ... దూరంగా, వొదిగి.
అలక్ష్యమో, గర్వమో, తిరస్కార భావమో!

కపటం, కుతంత్రాల విఫలప్రయత్నానంతరం
నిదురమ్మను నమ్మించలేక ... అహం
దెబ్బతిని అవామానం...తో నిదురమ్మను చేరలేకే ...

నేనే నీవనుకునేవు!


నేనే నీవు అనుకునేవు
నీలో నన్ను పోగొట్టుకున్నాననుకునేవు
పోగొట్టుకోలేదు ... అనుకున్నానే కాని
అడవి కాసిన వెన్నెల్ని,
సముద్రాన కురిసిన మంచును,
మండుటెండలో వెలిగించిన కొవ్వొత్తిని ... కావాలని

నీవు నన్ను ఇష్టపడుతున్నావు!
ప్రేమిస్తున్నావు ...
చూస్తూనే వున్నాను ... నిన్ను
అందం వికశిస్తూ, నీ ప్రాణం, నీ ఆత్మ ను
అయినా, ఎందుకో ... నేను నేనే!
వెలుతురులో వెలుతురు నై పోవాలని అశించానే ... కాని

ప్రేమ మోహావేశంలో లోతుగా మునిగి
నాడి, జ్ఞానం, స్పర్స అన్నీ కోల్పోయి
మూగవాడ్నై, గుడ్డివాడ్నైపోవాలని  
నీ ప్రేమ తుఫాను, గాలివానలో
కొట్టుకుపోవాలని,
గడ్డిపూచనై, ఆకునై ... అరటినై ప్రియతమా!

నీతోనే ఉన్నాను!


సమాధిలా ...
నా సమాధిని పలుకరిస్తున్నావు!
సమాధి పక్కన నిలబడి విలపిస్తున్నావు!
సమాధి...లో నేను లేను.
అలసిపోయి ... సేదదీరడం లేదు.

గాలిలో ... తలలూపే చెట్ల,
కొమ్మల, ఆకుల ... సవ్వడిలో ...
మంచు కురుస్తున్న పర్వతాల తెల్లని
ఆచ్చాదనం మీద,
పరావర్తించే మెరుపు లక్షణాన్నై ఉన్నాను!

మంచు తుంపరులు
కడిగిన,
ఆకుల పత్రహరితాన్నై ...
సున్నితంగా తట్టి లేపే
శరత్కాలం వర్షాన్నై ... నీతోనే ఉన్నాను!

ఉదయపు దినచర్యల హడావిడీలో
పురోగమన ఆలోచనల ప్రేరేపకాన్నై ...
కోకిల గానాన్నై
చికటి రాత్రుల్లో ...
వెలుగులు కిరణాలు వెదజల్లే తారనై ఉన్నాను.

సమాధిలా ...
నా సమాధిని పలుకరిస్తున్నావు!
పక్కన నిలబడి విలపిస్తున్నావు!
సమాధిలో నేను లేను.
నిజానికి నేను మరణించిలేను.

నేనక్కడ నీ పక్కన ...


నా కోరికే నేనక్కడుండాలని
శుభరాత్రి ముద్దుల బహుమతులందిస్తూ ...
నా కోరికే నేనక్కడుండాలని
నిన్ను కదలకుండా పొదివి పట్టుకుని, హత్తుకుని ...
నా కోరికే నేనక్కడుండాలని
నీ వికశిత ముఖం చూస్తూ, దివినుండి భువికి
నాకోసం దిగి వచ్చిన దేవకన్యవని ఆశ్చర్యపోతూ
నా కోరికే నేనక్కడుండాలని ... నీపక్కనుండాలని ...

నా కోరికే నేనక్కడుండాలని
రాత్రి తెల్లవారు జామయ్యేవరకూ
నా ప్రియ సఖీ ... నీ సరసనే కూర్చోవాలని
నా కోరికే నేనక్కడుండాలని ...
నీక్షేమమే, నా లక్ష్యమనే నిజం గుర్తుచేస్తూ,
నా కోరికే నేనక్కడుండాలని ... నీపక్కనుండాలని
నా హృదయం నీ మనసు పంజరంలో బంధీ అని  
అందులో దివ్య మనోహర రూపం నీవేనని నీకు చెప్పాలని ...
నా కోరికే నేనక్కడుండాలని ... నా కోరికే నీపక్కనుండాలని

అశరీరవాణి!


నిశ్శబ్ద నిశీధిలో
శిలలా,
అచేతనంగా,
బారంగా శ్వాసిస్తున్నా!

మెరుపులు, ఉరుములు ... సవ్వడి విని
ఉలిక్కిపడ్డాను.
ఆ మెరుపు వెలుగుల్లో,

అశరీరవాణి పలుకరించినట్లు,
సుమధుర శబ్దం!
"జన్మించినందుకు జీవించడం నీ బాధ్యత! అంటూ"

తల తిప్పి కనిపించని చీకట్లోకి,
కళ్ళార్పుతూ ప్రశ్నార్ధకంగా ...
నా చూపులు!

"మంచిని, మనుగడగలిగిన సమాజాన్ని,
మంచి ప్రపంచాన్నీ నిర్మించు!" అని ...

ఆశ్చర్యమేసింది.
ఎలా?
ఇంత విశాలమైన ప్రపంచంలో ...
అణుమాత్రం మనిషిని,
నా వల్ల ఏమౌతుందీ అని!?

పదాలు పెదాల్ని దాటకుండానే ...
విన్నట్లు,
మళ్ళీ అశరీరవాణి అంది.
మృదుమధుర స్వరంతో ...
"నిన్ను నీవు నిర్మలంగా, నిష్కల్మషంగా .. మనిషిగా మల్చుకో చాలు! అని

ప్రేమ రాగం!


నిశీధిలో వినీలాకాశంలో నక్షత్రాలను చూడు!
ఎన్నుంటాయంటావు?
నీ, నా దూరాన్ని కొలిస్తే ... వచ్చే క్షణాలంతైతే కాదు!

సముద్రపు వొడ్డున కొట్టొకొచ్చిన యిసుక రేణువుల్ని చూడు!
ఎన్నుంటాయంటావు?
నీ మీద నా నమ్మకాన్ని మించైతే లేవు!

సముద్రుడ్ని పలుకరించి చూడు!
ఎన్ని నీటి చుక్కలు కలిసి సముద్రమయ్యిందో అడుగు?
నేను నిన్ను ఆశించిన ... ఆశల సంఖ్యను మించి అని అనుకోను!

నీ హృదయం కొట్టుకుంటుంది చూడు!
ప్రతి స్పందననీ విను! ... ఎన్నిసార్లు స్పందిస్తుందో గణించు!
గణించలేవా! నేను చెప్పనా! ... నీపై నాకు ప్రేమ ఉన్నంత! ... నేస్తమా శుభోదయం!

మరువలేని ప్రేమ


నీతో మాట్లాడుతున్నప్పుడు
అంత ఆహ్లాదం, అంత ఉల్లాసం
నాలో ఎందుకో అని
ఆలోచిస్తూఉంటాను సదా ...
అంత అందంగా ఎలా ఉంటావో అని
పలువరస కనిపించేలా శబ్దం రాని నవ్వు
నీవు నవ్వుతున్నప్పుడు ...

ఆ నవ్వు నాకెంతో ఇష్టం
పగటికలలు నాలో నేను
నీతో గడుపుతున్నట్లు
నీ కోకిల స్వరం మాటలే తిరిగితిరిగి వినిపిస్తూ
నీ ప్రతి చర్యనూ కొనియాడుతున్నట్లు
నీ ముద్దుముఖాన్ని
కళ్ళుమూసి మరీ చూడగలుగుతున్నట్లు ...
ఆ కలలో ... నీవు నన్నే ఆపేక్షగా చూస్తున్నట్లు

అప్పుడప్పుడూ నాలో నేనే
నవ్వుకుంటుంటాను
నా పగటి కలల్ని గుర్తు తెచ్చుకుని
ఆశ్చర్యపోతుంటాను
ఏం జరుగుతుంది ... ఆ ఆనందాన్ని తట్టుకోగలనా
ఒకవేళ మనం ఒకటైతే అని ...
ఊహల్లో సంఘటనలు వాస్తవాలు కావని తెలిసీ ...

ఒక్కటి మాత్రం నిక్కచ్చిగా చెప్పగలను
నా ఆరాధన నీవేనని
నీ సాహచర్యమే గమ్యం ...
అందుకోసం
దేన్నీ లెక్క చెయ్యను
ప్రతిక్షణాన్నీ ఆశ్వాదిస్తాను
నీవు నాతో ఉన్న క్షణం క్షణాన్ని ... మధుర లక్షణాన్ని ...

సహజీవనం!


బద్దకం వొదిలి,
మేలుకొలుపు ఉదయాన
నేనే నీ ఆలోచనల్లో ...
మొదట్లో ... కాకతాళీయము, యాదృశ్చికము అనుకున్నావు.
ఇప్పుడే తెలిసింది నీకు ... అది ప్రేమే అని!

నే నెదురుపడ్డ ప్రతిసారీ నీది నవ్వుముఖం
నీకే తెలియకుండా ...
అంతం లేని ఆలోచనలే అను క్షణం ... నా గురించి
అచేతనురాలివి ... నా సాన్నిధ్యంలో
నా కళ్ళు నీ అంతరంగంలో చొరబడి అలజడి చేస్తున్నట్లు

ఏవరో ఏదో అనుకుంటారని
నీవెప్పుడూ నాకు దూరం కావాలనుకోలేదు
అనుక్షణం నాతోనే గడిపెయ్యాలనే చూసావు.
చూపుల సంగమం మాత్రమే చాలదని ...
నీదీ నాదీ ప్రేమే నని ... సహజీవనం నీ నా గమ్యమని ...

శాంతి కాముకులే


నిన్ను నిన్నుగా ప్రేమించి
నీకోసమే జీవించే
మనిషంటూ, మనసంటూ లేదా!
నీ జీవితం అసంపూర్ణమే!
నీవు నిరుపేదవే!
ప్రేమే ఆవేశం, భావం ... కనుక ...

జీవితానికి అవసరం ... ఎంతో ముఖ్యం ...
ప్రేమ జీవన నాణ్యతను పెంచి
వివేకాన్నీ వెలికితెస్తుంది.
జీవనసరళిని
నడవడికల్ని మార్పు వైపు ...
ఒకరి జీవితమ్నుంచి ఒకరు
నేర్చుకునే ప్రక్రియే ప్రేమ!

ప్రపంచంలోని అమూల్యమైన
ఎన్ని సమకూర్చుకున్నా ...
చిన్ని చిన్ని లోపాలున్న ఇద్దరు
ఎవరి జీవితం వారు జీవిస్తూ,
ఒకరి లోపాలు ఒకరు కవర్ చేస్తూ ఒక్కటై ...
సహగమనం సాగిస్తూ,
సంకల్పాన్ని విశదపర్చడమే ... ప్రేమ!

ప్రేమ ముఖ్యం ... ప్రేమ లేని జీవనం అసంపూర్ణం
ప్రేమ జంట ...
జీవితం సమర్థవంతం ...
ఎంతో సరస, సున్నిత సహగమనం ...
ప్రతిదీ పరామర్శించుకుని చర్చించుకుని ...
సాగే సహజ, సహకార యానం ...
సర్వం తెలిసిన ... శాంతి కాముకులే ప్రేమ జీవులు!

ఒంటరితనం!


విషాదం ఈ క్షణం నాలో
అర్ధం కాని ఏదో బాధ
వెంటాడుతూ
ఎవరూ తోడులేని ఒంటరితనం
వెలిసిపోయిన ఈ జీవితం!

నాకు తెలియదు నాకేంకావాలో
ఏవరో రావాలి.
ఈ హృదయం రక్తాన్ని ఓడ్చడం మానాలి.
నరనరాన్నీ పిండే బాధ ...
ఏ స్నేహ హస్తం ... ప్రేమ హస్తం అందించాలని,

నా హృదయం గాయపడింది.
నలిగిపోయింది.
సరి చేసే ఊరటకల్గించే సాహచర్యం
నాతో ఎవ్వరూ లేని ఈ క్షణం
నిన్ను నా సరసన చూడాలని ఉంది.

నా ఈ కన్నీళ్ళు నిజం!
నీకై ఏడ్చిన ... గురుతులు ... అబద్దాలు కాని నిజాలు
ఒంటరితనమే నన్నలా
విచక్షణ కోల్పోయేట్లు చేస్తుంది.
నిజానికి ఇప్పుడు నేను ప్రాణం ఉండీ లేని వాడ్ని!

ప్రత్యేకంగా ... నాకు కావాలి ... నీవు
ఈ క్షణమే ... నీతో
నేను మాట్లాడలేకపోతున్నాను.
ఏదో ఒకరోజు నీవే వస్తావని ఆశ ... నాతోనే ఉంటావని,
ఎదురుచూస్తున్నా ... నా కన్నీరు తుడుస్తావని ...

ప్రేమ దేవతా సుఖీ భవా!


నా జీవితానికి అర్ధం
నీవూ ... నీ చిలిపి చేష్టలు
నీలో బాగమై ... నాహృదయం
నీవే నా బలం
నీతో ముచ్చటించని క్షణాల్లొ జీవనం!

పడిపోయాననుకున్నప్పుడు,
ఆసరా నీవు ...

ఒంటరిగా ఉన్నప్పుడు,
నా ఆలోచనల మధురస్మృతివి నీవు ...

ప్రతి చర్యలోనూ,
వెలుతురు దారి పరిచినట్లు
నా హృదయం ...
ప్రేమమయమైన నీ ఆలోచనలతో
చైతన్యవంతమై ....

గాయపడ్డప్పుడు,
ప్రేమ లేపనం రాసినట్లు ...

బాధలో ఉక్కిరిబిక్కిరి అయినప్పుడు,
బాం అయి ... హాయిని కల్పించినట్లు ...

హృదయానికి కాలం తోడు ...
గాయం మానడానికి!
ఆత్మకు హృదయం తోడు ...
భావనలు పెరగడానికి!

నీవు అన్నప్పుడు
"నేను నిన్ను ప్రేమిస్తున్నాను" అని

ఆ మాటలు
అశరిరవాణి మాటల్లా ...
మెరుపుల్లా, అద్భుతమైన ...
గాల్లో తేలిపోతున్న భావనల క్షణాలవి!

నేను శక్తివంతుడ్ని!
ప్రపంచమంతా ఒక్కటైనా,
ఎదిరించే బలం ... నా నరనరాల్లొ
నీ హృదయం లోంచి ప్రవహించడం మొదలయ్యింది ...
ఆ పదాలు నీ పెదాల్ని దాటిన క్షణం నుంచీ!

నీ సాన్నిహిత్యం ... ప్రేమ మహిమ
ఇప్పుడే నా హృదయం, నా ఆత్మల్ని
పరామర్శించి
ప్రేమ మళ్ళీ నీ హృదయాన్నే చేరింది
ప్రేమ దేవతా సుఖీ భవా!

చూడలేను ... నీ బాధను


చూడలేను
నీ బాధను
సొట్టలు పడాల్సిన బుగ్గలపై
జారిన కన్నీటి తడిని
నీలో అలజడిని
ఏడుస్తూ నీవు నా ముందు
నిలుచున్నట్లు ... ఊహించలేను!

నీ బాధల్నీ
కారుతున్న నీ కన్నీటిని
ఒక్క ముద్దుతో తుడిచెయ్యాలని ...
ప్రేమోల్లాసాన్నీ
పలుకరింపును ... వినాలని ...
మాటల్లో కాదు
కళ్ళతో, నీ హావభావాల్తో
ముచ్చట్లాడాలని ...


కాలం చేసిన
గాయాల్ని మాన్చే ప్రకృతినై
మనశ్శాంతినై
కష్ట సమయాల్లో నీ చెయ్యందుకుని
నీతో నీ మన్సులో
గూడు కట్టుకుని
శ్వాసనై ...
దైర్యాన్నై ...
ఒదిగి ఉండాలని ... 


చూడలేను
నీ ఏడుపును
ముద్దాడాల్సిన బుగ్గల్ని
చారలమయం చేసే
కన్నీటిని ...!

నీవే నా అన్నీ ...


నీవు లేని నేను
జీవించలేనని ...
నీవే
నా అన్నీ అని
నీవు దూరం కావడం వల్లే
అర్ధం అయ్యింది.

నీ బాద్యతలే
నిన్ను నాకు
దూరం చేసాయని తెలుసు!
ఎందుకో ...
నాకు ... ఈ దూరం
దూరమైన సమయం
క్షణాలు యుగాలైనట్లు ...

మనం
మాట్లాడుకోలేదు!
కొంత కాలంగా ...
నీవనుకోవచ్చు
ఒక్క రోజేగా అని ...
అనుకోలేకపోతున్నాను.
నాకుమాత్రం నెలలా ... ఏడాదిలా ...

నీ గొంతు వినాలని,
నీ స్పర్శ ... అనుభూతి చెందాలని ...
నీవు నీ ఒడిలో
నా తల ... జుట్టులో వేళ్ళు దూర్చి
ఆడుకుంటూ ... ఆ క్షణాలు
మన
ప్రతి ఐక్యంలోని ... భావనలు,
అనుభూతులు తిరగెయ్యాలని ...

నిన్ను కోల్పోయిన,
దూరం చేసుకున్న ...
విరహ వేధన
నన్ను విశ్రమించ,
నిలబడనియ్యడం లేదు
నిజం!
ఇదో తియ్యని తపన ...

నా ఆకాంక్ష ... మాత్రం
నీవూ నేనూ
విడదీయలేనట్లు ...
ఒక్కటై ...
ఒక్కచోటే ... ఉండాలని,
ఎదురుచూపుల హృదయభారాన్ని తగ్గించుకోవాలని ...
సమయం నీకూ నాకూ మద్య దూరం కారాదని ...

ఏనాడూ ...


ఏనాడూ అదురుతున్న
పెదాల
అల్లరి ఆహ్వానాన్ని
మన్నించలేదు!
ఆమె
అనురాగాన్ని, శరీరాన్ని,
పెదవుల్ని
చూపుడువేఅలితో తట్టలేదు!
ఆమె తో
పానుపు
సాహచర్యం ...
సేద దీరలేదు!

ఆలోచనల్లోలా,
ఊహల్లో లా,
లెక్కలకందనన్ని సార్లు
ఒక్కటైయ్యున్నట్లు ...!!
ఆమె
కళ్ళలోకి
పనిమాలా
చూడ లేదు!

ఆలోచనలు,
అల్లరి,
ఆవేశం ...
కలిసి చేస్తున్నా ...!
ఆమె ప్రేమ
సముద్రమంత ...
తేనె కంటే తియ్యన ...
అనురాగపూరితం అని తెలుసు!

ఆమె నేనూ ... ఒక్కటే!
శరీరాన్ని
తట్టకుండానే
తలపుల్నీ ...
మెదడును ...
హృదయాన్నీ ...
తట్టి లేపే ప్రేమ మాది!!

నాకు ... నీవున్నావు


పరిస్థితులు,
వాస్తవాలు ... కఠినంగా ఉండి,
ఆశ ఆవిరైపోతున్నప్పుడు ...
ముఖాన చిరునవ్వు అద్దలేక ...
బ్రతుకు దుర్బరమని అనిపించిన క్షణాల్లొ ...
నాకు ... నీవున్నావు సహకారం అందించడానికి ...
ముందుకు కదలడం ... బరువులు మొయ్యడంలో ఆసరాగా
నేను మళ్ళీ తేరుకునే వరకూ ... నీ శక్తిని ... నాశక్తిగా
నాకాళ్ళమీద నేను నడిచే వరకూ ... నాకు ఊతకర్రలా ...
నేను ఒంటరిని కానని గుర్తు చేస్తూ ...
పరిజనులు
స్థితులు ...
వాస్తవాలు ... కఠినంగా మారినప్పుడు ...
మారడం ప్రాకృతికం కనుక
నీవు నాతోనే ... నా చెంతనే
సహధర్మాన్నీ ... సహజీవనాన్నీ గుర్తు చేస్తూ ...

నీ ప్రేమ కోసం ...అలల ఫెళఫెళ ద్వనులతో సముద్రం
వన్నెల వెన్నెల రాక కోసం ముస్తాబయ్యే సంద్యారాగం
చెట్ల కొమ్మల ఆకుల గాలి గుసగుసలు
వయ్యారంగా  రాంప్ మీద నడుస్తున్నట్లు ... నది

వాడి చూపు రక్కసి రాబందుల ... గగన విహారం
చిరుతపులి లంఘింపులోని చురుకుదనం
ఎక్కడో ఆకాశంలోంచి నక్షత్రాలు రాలుతున్న దృశ్యం
కొండలు కోనల్లో ప్రతిద్వనించే శబ్దతరంగాలు

ఎర్రనేల బంగారం పై ఎదుగుతున్న గడ్డిపూల సొగసు
అరుణోదయ రాగపు కుళాయిల్లోంచి పారే చైతన్యం ... ఆవేశం
శ్రమ, సేద్యం సౌజన్యం పంటలు వెదజల్లే సౌభాగ్యం
రాత్రి పొదిగిన నల్ల రంగు నిద్దురలో పొందే ఊహల పరవశం

దైవాన్ని చూడగలిగిన స్వచ్చమైన పసిపిల్లల శ్వాస
పాలకడలి లాంటి అమ్మ మనసు అనురాగం మమకారం
ఉయ్యాలలో పసితనం కేరింతల నవ్వుల శబ్దం
కన్నతండ్రి గుబురు మీసాల మెరుపు ఆశల రూపం

మనసు కోరికలు ... అమూల్య సంపదలు
ప్రతి మనిషి జీవితపు ఆశ, లక్ష్యం.
నాకు మాత్రం ఎందుకో, మనోహరమైన నీ రూపం కోసం
ఈ క్షణంలో ... ఇవన్నీ వొదులుకోగలననిపిస్తుంది!

అక్కడ ... ఇక్కడెప్పుడు?సాయంత్రం కదిలి
చాప కింద నీరులా
చీకట్లు ముసురుతూ
చిత్రమైన భావనల
సామ్రాజ్యం ఆరంభమౌతుంది!

అక్కడ ...
మూసే నా కనురెప్పల
తలపుల వార్డ్ రోబ్ లో
హాంగర్స్ కు వేలాడుతూ
పక్కపక్కనే మనిద్దరం

అక్కడ ...
తెలిసీ తెలియని తనంలో
తప్పటడుగులు వేస్తే
అమాయకంగా మోసపోతే
సరిదిద్దడానికి
ధైర్యం ఆసరా గా నీవుంటావు.

అక్కడ ...
జీవితం అనుభవాలు
భరించలేని బాధలై
పుండై సలుపుతుంటే
శరీరం స్థిమిత పడలేకపోతున్నప్పుడు
ఓదార్పుగా నీవుంటావు.

అక్కడ ...
ప్రకృతి అందాన్ని,
ఎగిరే పక్షుల్నీ చూసి
నేను పరవశిస్తున్నప్పుడు
నా ఆనందం పంచుకోవడానికి
నా ప్రతి చిలిపిచేష్టల్ని
స్వాగతిస్తానికి నీవుంటావు.

అక్కడ ...
నా కలల
ఆదిమధ్యం వరకూ
ఉల్లాసంగా నాతో
ఆడుతూ పాడుతూ ... నీవుంటావు
అమూల్యమైన మధుర గడియల్ని పేరుస్తూ,

అప్పుడు ...
తూరుపు కొండల్లో
చైతన్యం అరుణరాగమై
ప్రపంచం నిద్దుర లేస్తుంది ...
మరోరోజు మరో ఆకలి పోరాటం
మనుగడ కోసం ఆరంభం అవుతుంది

అప్పుడు ...
నా తలపుల తలుపులు మూసుకుపోతాయి
నా కళ్ళల్లో వెలుగు విచ్చుకుంటుంది
నీవు నన్నొదిలి వెళ్ళిపోతావు
నిద్దురను నిన్నూ కోల్పోయి లేస్తాను
నా బాహువుల్లో నీవుండవు!

మరోసారి
మరో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కావాలి ...
నిన్ను చూడ్డానికి
నా ఊహల రాణి ... నీతో
నా ఆనందం ఆరంభం కావడానికి
 

నేను, ఆమె ... ప్రేమ!


కంట్లో నలుసులా కొంతకాలంగా నీవు
ఎన్నాళ్ళయ్యిందో ఆ చిరు మాయ
సొట్టబుగ్గల వెలుగుల్ని, నీ చిరునవ్వును చూసి
ఏ మాయామోహానికి లొంగి నిన్ను ప్రేమించానో ...
ఆ మాయ లాస్యం నాది కాదని తెలిసిందీ రోజు! ... ఏం చెయ్యమంటావు?

కలిసి తిరిగిన గతాన్ని,
అడుగులో అడుగై, ఒక్క మాట, ఒక్క చూపైన క్షణాల్నీ
మనసు గుడిలో నీవు ఉన్నప్పటి నీ ప్రేమ ప్రతిస్పందనల్నీ
సొట్టబుగ్గల్లోంచి జారిన నీ సిగ్గు మరిమళాల్నీ గుర్తుతెచ్చుకుని
నిదుర పట్టడంలేదు ... ఎందుకిలా అవుతుంది ... అదీ నాకే అని, అన్నీ ప్రశ్నలే!

ఉన్నంతలో ... లోపం లేకుండా చూస్తానని మాటిచ్చాను! అయినా!
ఆజానుబాహుడనా! ఆస్తిపరుడనా! అతన్నే ఎందుకు కావాలనుకున్నావు?
నా రక్తాణువుల్లో శక్తివి ... పరిశుద్దం చేసే ఆక్సీజన్ వి నీవని, నీకూ తెలుసు ...
నా అణువణువులో స్పందనవు, నా ఆలోచనల మబ్బుల్లో తారవు నీవే! అనీ నీకు తెలుసు ...
తెలిసీ ఇలా జరిగింది ... ప్రేమేమైనా నన్ను బుద్దిహీనుడ్ని గుడ్డివాడ్నీ చేసిందా!?.

ఇప్పుడు నేను కదలికల్లేని అబద్దాన్ని అయి పోయాను.
నిదురించలేను. ఆకలి లేదు. స్థిమితం లేదు. నా ప్రేమ వాగ్ధానాలను
కొంగుకు ముడేసానన్న నీ ముద్దుమాటలు నా చెవిలో ప్రతిద్వనిస్తున్నాయి.
మరిచిపోలేక, నన్ను నేను ప్రశ్నించుకుంటున్నా! ... కారణం నేనైతే కాదు కదా అని,
అనుమానంగా నా గుండె లోతుల్లో వెతుక్కుంటున్నాను! ... నాలో ఏ లక్షణం ఎడబాటుకు కారణం అయ్యిందీ అని,

పూదోటలో ఒకప్పుడు ... నీవూ నేనూ చెట్టపట్టాలేసుకుని తిరిగిన క్షణాల్ని
చిత్రంలా ... నా మనసు తెరమీద చూస్తున్నాను ... నీ అణకువతనాన్ని
నేను నీ చెవిలో గుసగుసలాడిన, వేరెవ్వరూ వినని పదాలు ... నీతో పాటు విన్న నెచ్చెలి, చిరుగాలి
అందుకే ... చిరుగాలిని సాక్ష్యం అడుగుతున్నా! కారణం నీకైనా తెలుసా నేస్తమా అని,
ఆ మధుర భావనల, మనసు బాసల, మేని పులకరింతల ... క్షణాల్ని నేనింకా మరిచిపోలేదు!

నీకూ తెలుసు నిన్ను ప్రేమించానని
నీవూ నన్ను ప్రేమిస్తున్నావని అనుకున్నా!
అతని పక్కన నవ్వుతూ నీవు నిలుచున్నప్పుడు,
నాకు మనం కలిసిన తొలిరోజు గుర్తొచ్చి, నీ నవ్వు నన్ను పరిహసిస్తున్నట్లు ...
నాకూ నవ్వొస్తుంది ... మనసారా ప్రేమిస్తున్నాను అన్న పదం ఉపయోగం ఇన్నిరకాలా అని,

మనసు పరిపరినీకు తెలుసో లేదో,
నేను మాత్రం నిన్ను మనసారా ప్రేమిస్తున్నా!
నా గుండెల్లో, ఆలోచనల్లో నీది ... ప్రత్యేక స్థానం
మధురూహలు ఆరంభం నాటి నుంచీ

అతనొచ్చాక, అతనే నీ ఊపిరి అని తెలిసాక,
సర్వనాశనం అయిపోయిన ... అసహాయత నాలో
ఎన్నో రాత్రులు మూగగా రోధించా ... నిద్దుర లేచి మరీ
వెంటనే నాకు నేను సర్ది చెప్పుకునేవాడ్ని ... అంతా సవ్యమే అని

రవంతైనా నీకు తెలియదు నా హృదయం నలిగిపోతూ ఉందని
ఆ రోజు ... కుమిలి, కన్నీరై ... నేను చచ్చిపోయానెమో అనే భావన
అతని సరసన నీవు ఎంతో అందంగా ఉన్నావు ... ప్రేమ మూర్తిలా
ఆ క్షణంలో నా కళ్ళకు నీవు ... స్వర్గం నుంచి దిగివచ్చిన అప్సరసలా కనిపించావు

చెయ్యగలిగింది ఏమీ లేదని తెలుసు ...  హృదయ భావనల్ని అణిచి ముందుకు కదలడం
ఇప్పటికైనా నిన్ను మరొకరి మనోభావనల జీవన సహచరిగా గుర్తించడం తప్ప
ప్రయత్నిస్తున్నా! నాకు నేను చెప్పుకుంటున్నా! అయినా ... జీర్ణం కావడంలేదెందుకో
ఔనూ! నీ సహచరిని ... నేనెందుకు కాలేనూ అని ... అతనే ఎందుకు అని ... మొండి మనసు!

ప్రేమ వైరాగ్యంజీవితానికో ఉద్దేశ్యం, అర్ధం ...
ఉండదు!
గుండెలు ముక్కలై
చెల్లాచెదిరి పోతాయి

పదాలు, అక్షరాలు
భావాలకు, స్థానం ...
ఉండదు!
ప్రేమ సంభవించదు!

అవసరాలు తీరని ...
ఆత్మ ...
మరణం కోరుకుంటుంది!
ఉపశమన వాఖ్యలు ... వినపించవు.

జీవము, లక్ష్యమూ లేని ...
శిలను అవుతా
స్పర్శాజ్ఞానం,
ఉలికిపాటు ... ఉండదు!

మౌన రహశ్యాలు ...
గాలి గుసగుసలు ఉండవు!
కళ్ళు ఏడుస్తూ ...
కారుతూనే ఉంటాయి!

చిరు నవ్వు ... లాశ్యం
ఎడరి మాయ
ఎండమావే అవుతుంది
నీవు లేకుండా ...

నీ ... సహవాసం,
సాహచర్యం ...
ప్రేమ, అనురాగం లేని
చావు, నిశ్శబ్దం ... కోరుకుంటున్నా!

శరీరం ఆత్మ


ఎందుకో తెలియదు ... ప్రేమ ఎక్కువయ్యో ఏమో
పొంగి పొర్లుతుంటుంది అప్పుడప్పుడూ
ఎదురెదురుగా నిలబడి మధ్యమధ్యలో టాంక్ బండ్ లోకి చూస్తూ
దెప్పుడు బాష ... వాదులాటలు
నేను స్త్రీ జాతిపై, తను పురుష జాతిపై విసురుకుంటాము విసుర్లు
కాసింత మౌన విరామం తరువాత కూర్చుండిపోతాము పక్కపక్కనే
అవునూ ... ఈ కసి, ద్వేషం ఆవిర్లెందుకు నన్ను దహిస్తున్నాయీ అని

నా కసి ఆవేదనంతా ... నేను ఆమెను అతిగా ప్రేమిస్తున్నానని
అతిగా అవసరాన్ని మించి ... ఆమె గురించి ఆలోచిస్తున్నానని
ఎంతో అపురూపమైన అనుబంధం ... మాదని
ఆమె అర్ధం చేసుకోవడం లేదని ... కోపం
అప్పుడప్పుడూ ఆమె ప్రతిస్పందన తెలిసీ ... ఆమె వైపు చూస్తాను
ముఖ భావాలను చూడాలని ... నొచ్చుకుంటుంటే నా విసుర్లు
సూటిగా తగిలాయని తెలుసుకునేందుకు ... కానీ ఆమె ఉండదు

నాకే కాదు ఆమెకూ తెలుసు ... ఒక్క క్షణం కూడా
ప్రేమతోనే పోట్లాడుతూనో మాటలు ఆడకుండా ఉండలేను అని
ప్రతి రోజూ మెలుకువలో ఉన్నా ... ఆమె మందలింపు
గోరు వెచ్చని తేనీటి కోసం ... ఎదురుచూస్తుంటాను అని
ఆమె దెప్పుతున్నప్పుడు, రోషంతో పోట్లాడుతున్నప్పుడు
అష్టవంకర్లు తిరిగే ఆమె ముఖం ... నాకెంతో ఇష్టం అని
ఆమెతో ఆటో తగవో ... మాటలు లేకుండా నేనుండలేను అని

అనుమానం వస్తుంటుంది అప్పుడప్పుడూ ఆమె కూడా
నాలాగా నన్ను ప్రేమిస్తుందా అని ... ఆ కళ్ళలోకి చూస్తాను ...
నాకంటే స్వచ్చమైన ప్రేమ నాపై ఆమెకున్నట్లు ఆ కళ్ళలో కనిపిస్తుంది
ఎప్పుడైనా అతిగా హద్దులు దాటి మాట్లాడినప్పుడు
అవసరాన్ని మించి చొరవ తీసుకుని పేట్రేగి పోయినప్పుడు
ఆ కళ్ళలొ కోపం బదులు జాలినే చూసా ... మన్నించు అని ...
మరెప్పుడూ అలా ప్రవర్తించను అని ...
పోట్లాటలొద్దు ఇక మనకు అని ... అనాలనిపిస్తుంది

ఎందరో సాహచరిని బానిసలా చూసే ప్రబుద్దుల్ని చూసా ఈ సమాజంలో
బాధే ఐనా వాస్తవం ... ఆ లక్షణాలు నాలో కలిగే అవకాశం లేకపోయినా
ఆలోచించను కాడా లేను ... నా ప్రేమకు నా సహచరికి ... ఆ అవస్థను
నా సంబంధం నా స్త్రీతో ... అర్ధ శరీరం, గుండెలో స్థానం ... అనుకోను
నేనే ఆమె అనుకుంటాను ... నేనూ నా అంతరాత్మ అనుకుంటాను
పరిపూర్ణత్వం ... ప్రాణమున్నంతవరకూ విడదీయలేని
శరీరం ఆత్మ సంబంధం ... మా అనుబంధం అనుకుంటాను!

ఒకరికొకరం


నిన్నా, మొన్నా
అనుకోలేదు ... నేను
నేడు ... ప్రేమలో పడతానని,
నిన్ను కలిసాకే ... తెలిసుకున్నాను.

కనుల ఎదురుగానో, పక్కనో
నువ్వుంటే ... స్వర్గం, ఆహ్లాదకర జీవితం
సొంతం ... అవుతుందని,
ఆలోచనల్లేవు ... నిన్ను చూసేవరకూ ...

అందమైన మనసు
అమ్మాయి
నన్ను ప్రేమిస్తుందని,
అనుకోలేదేనాడూ ... నిన్ను కలిసేవరకూ

నిర్మల ఆకాశంలా ... నీ కళ్ళు
నీ చూపుల వెలుగు ...
నా శక్తి అవుతుందని ... అనుకోలేదు
ఏక్షణానా, నీ స్వాధీనం ... అయ్యేవరకూ

నిన్ను ప్రేమించడం ... నిన్ను పొందడం
ఇంత సులభం అవుతుంది అని,
అనుకోలేదు! నీతో కలిసి ...
అరమరికల్లేని నవ్వులు వెదజల్లేవరకూ

ప్రేమ ... రెండు హృదయాల, ఆత్మల,
ఆలోచనల సంగమమని ... తెలియదు
నీతో కలిసి ... కలల్ని కనేవరకూ
ఒకరికన్నీరొకరం ... తుడుచుకునేవరకూ

వెలుగు కిరణం


పరిక్షగా చూస్తే కానీ కనబడని రూపానివి
మా కళ్ళ ఆశవు ... మాకు అప్సరసవు
దివి నుండి ... భువి విశ్వమానవాళికోసం దిగివచ్చి
మా మనో వినీలాకాశంలో స్పష్టంగా మిగిలిన తారవు

అందం నిర్మలత్వం కలబోసి ... మృదుమనస్కురాలివి
దయ, ఆర్ధ్రత నీ చూపుల్లో
రెక్కల దేవతలా దిగొచ్చావు
ఆనందం, సంతోషం అమృతబాండాన్ని అందించాలని

మా హృదయాల్లో, ఆలోచనల్లో నీవే ఎప్పుడూ
మృదువైన తెల్లని మేఘాల్లా ఆ కురులు
మా నీడై మమ్ము వెలిగిస్తూ
ఆ కళ్ళు ఇంద్రనీలమణిలా చీకట్లో మార్గదర్శకం మాకు

బ్రతకాలనుకోవడానికి కారణం నీవు
పంచడం ఆనందం అని ... నిన్ను చూసి తెలిసుకున్నాము
మంచిని మాట్లాడి, చూసి ... ప్రోత్సహించే దేవతా
నీ లక్ష్యమే, ఉన్మత్తత స్థానే ప్రేమను బోధించడమే మా జీవితం!

నీ కంటి పాపను కావాలనిమిణుకు మిణుకు మనే
నక్షత్రాలు! మెరుస్తున్న నీ ... కళ్ళు!
మనసు పారేసుకునే మన్మదాస్త్రాలు ... అవి
 ప్రకృతి పదాల నెన్నో ... బాసలు పాఠాలుగా చెబుతున్నాయి.

ఆ వింత కాంతిలో,
నీ చూపు ... వెలుగు ప్రవాహం ... వరద లో,
ప్రాణం పణంగా పెట్టి ... ఎదురీదే చేపలా నేను ..
ఎదురీదే ప్రయత్నం చేస్తూనే కాలగతిని కొట్టుకుపోతున్నా!

వేల వేల జ్ఞాపకాలు పసితనపు ఆలోచనలు
ప్రేమ కథల్లా నా చుట్టూ పరిభ్రమిస్తూ,
చరిత్రలో అక్షరానివి కా అని ... మనసును  ప్రేరేపిస్తూ,
చిక్కటి నమ్మకం బలాన్నిస్తుంది ... కట్టుబాట్లను కాలరాసెయ్యమంటుంది.

ఒకరకంగా ... నేను అదృష్టజాతకుడ్నేనని అనుకుంటున్నా!
ప్రేమ జీవితాల సారమంతా గ్రోలిన,
చదివేసిన కథల కావ్యాల చిరునామాను కావాలని ఆకాంక్ష!
వెచ్చని నీ స్పర్శానుభవం పొందిన, నీ జీవన సహచరుడిగా మిగిలిపోవాలని ...

మన్మధుడి బాణం
మోహపు అంచు సూది మొన బలంగా గుండెల్లో దిగి,
ఏదో అయ్యింది నాకు  ... ప్రపంచమంతా దేధీప్యమానంగా,
సౌందర్యం సంతరించుకున్నట్లు ... నీ కళ్ళ ప్రకాశం నిర్మలత్వమే ఎటు చూసినా

ఉదయం కురిసిన మంచులా,
అసాధారణ, విలక్షణ అందం నీ కళ్ళలో ... నీలో చూస్తున్నా!
మనొహరంగా కొత్తగా చూస్తున్నట్లుంది ప్రపంచాన్ని ... నిన్ను
ఎటు చూసినా వసంతం ఆనందమే పురివిప్పి నర్తిస్తున్న నాట్య మయూరాల్లా

నీ కళ్ళలోకి చూసిన ప్రతిసారీ ...
మనసు కేదో అవుతుంది గాల్లోకి తేలిపోతున్నట్లుంటుంది.
అంతులేని ఏ జన్మానుబంధ జ్ఞాపకాల్లోకో జారిపోతున్నా!
నన్నూ నా నీడల్నీ నడుస్తున్న నా జీవన వాస్తవాల్నీ మరిచిపోతున్నా

నేనేమీ ఆశించదంలేదు!
ఆకాశాన్ని అందుకోవాలని లేదు ... నక్షత్రాలతో దోభూచులాడాలని లేదు.
నీ సహజీవిగా గుర్తించబడాలని, కలిసి సహజీవనం చెయ్యాలనుంది.
ఆ కంటి వెలుగు కు కారణం ... కంటి పాపను కావాలనుంది ...

ఒక దేవత ... నా స్నేహం


నీవంటే ప్రేమ అని
అందంగా కనిపిస్తున్నావని
నీవే ఎప్పటికీ నా సహచరుడివని
నీవు తప్ప నన్నెవ్వరూ రోధించేలా చెయ్యలేరని
నా చూపుల్లో చుక్కుకున్న వెన్నెల రాజువని
నీవు మాత్రమే అని ... ఒక దేవత నాతో ... తన మాటల్లో ...

ఆగు మానవా
నీ కోసం ఎన్ని గడియలు యుగాలైనా ఎదురుచూస్తా
నీ మనసు నన్ను కోరుకునే రోజొస్తుంది
ఆ మంచి రోజు గడియకోసం ఇక్కడే ఉంటాను
నిన్ను మనసారా ఇష్టపడుతున్నాను అని,
ఒక దేవత నాతో ... తన చూపుల్తో ...

నీ అవసరం నాకు
తలవొంచి ప్రార్ధిస్తున్నాను నన్నొదిలెళ్ళకు
నిన్ను నేను మబ్బుల పుష్పకంలో తిప్పుతాను
నిన్ను మానవుడ్లా కాదు దేవూడ్లా చూస్తాను
నన్నుద్దరించే దైవంలా
నిన్నే పూజిస్తా అని ... ఆ దేవత నాతో ... తన కదలికల్తో ...

నాకు తెలుసు
ఆమెకు నేనిష్టమని
నేను మాత్రం ఒక అభిప్రాయానికి రాలేదని
నా మనసు మరెక్కడో తారట్లాడుతుందని
నా మనసులో ఆమెకు స్థానం యివ్వలేనని  
మబ్బుల్లో దేవత ఊహలు కలలవరకే పరిమితం కావాలి
ఆమెలో సౌందర్యాన్నీ శ్రేయోభిలాషినే చూస్తున్నానని ...

అందుకే అంటున్నా! ... నీవంటే ఇష్టం
నీ సాన్నిహిత్యం ఇష్టం ... సాహచర్యం ... నీవు కోరుకున్నట్లు కాదు
నీవు నన్ను మరువాలి  ... సుందరీ
వాస్తవాల్ని చూడు ...
మన మంచికే ...
ఒట్టేసి చెబుతున్నాను ...
నేను నిన్ను ప్రేమిస్తున్నాను ...
నిన్నలా చూస్తూనే ఉండాలనుంది ఊహల్లో ... మంచిని కోరే నేస్తంలా నే!