Sunday, August 30, 2015

అందమైన ప్రపంచం మనది


గుట్టుచప్పుడుకాకుండా ఒక పసి శరీరం
భూమ్మీద చెత్తతొట్టిలోకి విసిరివేయబడిన రోజు
స్వాగతించేందుకు ఎవరూ ఉండరు.
దారిద్ర్యం గర్భాన జనియించిన శిశువు
ప్రాణం పోసుకుని ఆనందంగా
తొలి ఊపిరి తీసుకోవలసిన సమయం లో
ఆ కంట కన్నీరు ....
తనకో కుటుంభం లేదని, పేరు లేదని కాదని
కన్నీరు తుడిచి చేరదీసే మానవత్వం
కనరాదేమనని అనుకుందాము  


అందుకే .... తుడవొచ్చు ఎవరిమైనా
ఆ కన్నీరును మచ్చలవ్వకుండా
బుగ్గలపై,
చెయ్యొచ్చు ....
బుగ్గలమీంచి నేలరాలకుండా
మానవత్వం మలినం కాకుండా 


ఎవరైనా ముందుకు వచ్చి .... ప్రేమగా,
చేరదీయొచ్చు! సంరక్షించొచ్చు! 
ఒక అందమైన కుటుంభం లో ఒకరినిగా చేసి
గర్వపడొచ్చు!
చూడొచ్చు ....
ఆ ముఖం పై ఒక అందమైన చిరునవ్వును,
కన్నీళ్ళకు బదులు కలల ముత్యాలను,
ఆ కళ్ళలో కృతజ్ఞతల మెరుపును

ఆ ఉత్పత్తే ఒక విషాద అనుభవమై
నిరాశ నీడలో నిలుచుని ఉన్న  
ఆ ప్రపంచం పై కాంతి ని ప్రసరించి
హృదయాకాశం లో ఆశల తారాగణాన్ని పేర్చి
ఆ కన్నీటి ప్రపంచం లో
కుటుంభమూ, పేరు లేని ఆ జన్మలో
ఆశయాల ఇటుకలను కూర్చి
మానవతావాదానికి మనవంతు సహాయం అందించి

Thursday, August 27, 2015

నిన్నటివరకూ కలిసే జీవించినా


ఒక్కసారి అపరిచితులం అవుదాం
మనం
ఇన్నాళ్ళూ
నా కోసం నీవూ
నీకోసం నేనూ జీవించామని
మరిచిపోయి
మళ్ళీ ప్రేమలోపడదాం!
నేను నీ కళ్ళలోకి
ప్రవరాక్యుడి తొలిచూపు లా
నీవూ నన్నే చూస్తూ ....
ఎప్పుడూ ఎండలోనే తిరిగేవాడు
తడికి భయపడే వాడి లా .... నేను
జీవ సాగరాన్ని ఈదుతూ
నీ చేతులు నేనూ నా చేతులు నీవూ
పట్టుకుని
ఒకరి వెచ్చదనం ఒకరు
ఏనాడూ పోందనట్లు అనుభూతి చెందుతూ
ఉదయ సంద్యా రాగాల్ని ఆస్వాదిస్తూ
తొలిసారి చూసినట్లు స్వాగతిద్దాం!
ఒకరికి ఒకరము ఏమీ కానట్లు
ప్రేమ సాగరములో ఈదుతూ
ఈ జీవనయానాన్ని మరోసారి
అలసట తెలియని విధంగా .... అన్యోన్యం గా

Tuesday, August 25, 2015

ఏం చెయ్యను?


ఊపిరాడనివ్వని 
అబద్దాల పలుకుల పై  
విశ్వాసం తో
తప్పని మరణం 
వాగ్దానాల సంకెళ్ళతో   
కట్టివేయబడి 
నమ్మకం ఉరికి 
వ్రేలాడదీయబడినట్లు 

Sunday, August 23, 2015

అర్ధం చేసుకుంటే


పవిత్రమైన కన్నీళ్ళను
.........
అవి రాలిన
దుమ్ము
దూళి భావనలను 
.........
పంటిగాటు పెదాలపై
జిగురులా జారి
అవి పేర్చిన తిట్లను
.........
భారమైన
ఆ గుండెలు
కోల్పోయిన స్పష్టతను
.........
అర్ధం చేసుకునేందుకు ....
అవసరం
నిబద్ధత, సూక్ష్మ పరిశీలన 
.........
ఆనందము సంతోషము
ముసుగు చాటున
కన్నీళ్ళను బంధించినప్పుడు
కలిగే జ్ఞానోదయం లో
తప్పక తెలుస్తుంది ....
చెల్లించాల్సొచ్చిన మూల్యం

Saturday, August 22, 2015

హృదయం స్పందిస్తూ ....


  
ఎన్నెన్నో చెప్పాలనుంది. చెబుతున్నా విను
ఈ ఊహలు
ఈ ఆలోచనలు ప్రామాణికం గా 
నన్ను నేను
నీకు అర్ధం అయ్యేలా విప్పుకోవాలని 
నువ్వు నా మానసివి .... నిజం
నీకు కనిపిస్తున్న .... సామాన్యత వెనుక
ఏ అమాయకత్వమూ
పిచ్చితనమూ లేవు
విజ్ఞత, ఈ మాటలకు సాక్ష్యమూ తప్ప 
నిన్ను ప్రస్తావిస్తున్నప్పుడు,
నా హృదయ స్పందనారాటం పరవశాన్ని
గమనించు .... అప్పుడు నేను
పొందుతున్న తన్మయానుభూతినీ 


నా గుండె చేసే ప్రతి అల్లరి శబ్దం లోనూ
నీ నామమే మనోహరీ .... ఓ పిల్లా!
బిగ్గరగా,
స్పష్టంగా ....
వేదమంత్రం లాగుండె కొట్టుకుంటూ ....
ఆ లయబద్దత లోఏదో విశిష్టత,
వింత అభిమాన భావన ఎవరికైనా
నన్నెరిగిన ఏ పురజనునికైనా
నిజమిదేనని తెలుస్తుంది. 
ఈ గుండె కొట్టుకుంటుంది నీ కోసమే అని 


సాంప్రదాయపద్దతిలో
ఒక నేను ఒక నీ అనుమతిని పొంది 
ప్రస్తావించితే 
మన కదలికలు,
మనోభావనలు ఒకే దిశగా ఉన్నాయి కనుక 
ప్రపంచాన్ని ఒడిలో గుమ్మరించమని
ఆశించని నీవూ
పరిపూర్ణతే కావాలని కోరుకోని నేనూ
ఒక్కటవ్వాలని .... కోరికను నీముందుంచితే,
కేవలం ప్రేమే లక్ష్యం గా
మనుగడలో ఎదురయ్యే ప్రశ్నలకు
సమాధానాలమైతే చాలని  
అందుగ్గానూ అను క్షణమొకరికొకరం
తోడుందామని అంటే 


నా ప్రతి శ్వాసలోనూ
నా ప్రాణం లా నిట్టూర్పులా నీవే ఉన్నావని 
నా ఊపిరితిత్తుల ఉల్లాసం కదలికలకు
కారణం నీవని 
నా గుండె తీవ్రంగా కొట్టుకుని
వర్ణం, వేగం మారిన 
అద్భుత ప్రతి స్పందనకు ప్రేరణ నీవని 
అవునూ
ఈ ప్రస్తావన వింటూనేనీవు కానీ,
నేనునమ్మకం అంచుమీద
కూర్చుని ఉన్నాననుకుంటావేమో 
నిజం మాత్రం ఇదే .... 
ఈ పలుకుల్లో సత్యమే ఉంది. 
నేను నిన్ను ప్రేమిస్తున్నాను
ఇక్కడే ఉంటాను అనుక్షణమూ నీతోనే .... లో

ప్రతిదీ ఓకే .... సరేనా


నా పక్కన చోటుంది 
కేవలం
ఒక మనిషి  
కూర్చునేందుకే 

జుట్టు లో వేళ్ళు దూర్చి 
సుతిమెత్తని ముద్దొకటి అద్ది 
సౌకర్యం పరిధిలోకి 
తీసుకు వెళ్ళి .... నిన్ను   

మనసు బాష్యం 
విప్పి

ప్రతిదీ సజావుగానే సాగుతుందని  
ఈ జీవ యానంలో 
ప్రయాణించే ప్రతి క్షణమూ 
అమూల్యం అని చెప్పేందుకు 

నీడంటే నీడ కాదు అని


ఎవరో అన్నారు
నాలుగు గోడలు మరియు
పై కప్పు ఉంటే మాత్రమే
ఇల్లు కాదు అని
కళ్ళలో నిర్మలత
గుండెచప్పుడు లో లయబద్దత ....
అవసరం అని
బహుశా అదే నిజం కావచ్చు
నా తలపుల తలుపులు తెరుచుకుని
ఏనాడు వెళ్ళిపోయావో .... నీవు
ఆనాటి నుంచి
నిరాశ్రయుడ్నను .... భావన,
అనుభూతి నాలో
ఇప్పటికీ ....
నీవు తిరిగిరావాలని
నా హృదిలో నీ స్థానం నీదై 
నేనో నీడను పొందాలనే ....

Friday, August 7, 2015

ఇలా జరిగి ఉండాల్సింది కాదు


అనుమానపడ లేదు
అనుకోలేదు
ఎప్పుడూ
ఈచోటే తలపడతామని
మన
కలలు,
వాస్తవాలు
ఒకదానికొకటి ఎదురెదురై
డీకొని
విద్వంసాన్ని సృష్టిస్తాయని

Thursday, August 6, 2015

నమ్మకమే ఊపిరిగా


ఆకాశంలోని నక్షత్రాలను లెక్కించలేను.
సప్త సముద్రాలను ఈద లేను
కనీసం హిమ శిఖరాగ్రాన్నీ చేరలేను.
నిజమే, ఒప్పుకుంటాను
ఆశలు ఆశయాలు కృష్తోనే సాద్యం
కోల్పొయిన కాలాన్ని తిరిగి పొందలేనని

నేను నీకు ఎంతో దూరంలో ఉన్నాను.
ఇక్కడ ప్రతి క్షణమూ నాకు ఒక యుగం లా
నీవు తోడు లేక
జీవిస్తూ శ్వాసిస్తున్నాను తెలుసా .... నీ ప్రేమ కోసం
నమ్మకంతో .... ఆ రోజొస్తుంది
జీవితమే నన్ను నీ సరసకు చేరుస్తుందని

ఉత్తరానికి దక్షణం అవసరమైనట్లు
గాలికి మేఘాలు అవసరం అయినట్లు
నా జీవనాశయాలు
ఆశల ..... అవసరం నీవు
తప్పులు జరగకుండా ఒప్పులుగా మార్చి
నేను చేరాల్సిన గమ్యంవైపు నన్ను నడిపేందుకు 


కాలమూ జీవితమూ
నన్ను నీ పక్కన నిలబెడుతాయి
నన్ను పరిపూర్ణుడ్ని చేస్తాయి
ఒక నాడు అని
అప్పటివరకూ
నేను ఇలా నమ్ముతూనే ఉంటాను.

ఓ అందాల మానసీ


రాగలవా 
స్రవిస్తూ నాలోనికి 
రక్తానివై ....
ఒకవేళ, 
నన్ను కోసుకుని 
చర్మం పొరలు ఒలుచుకుని 
స్వాగతిస్తే .... 

వస్తావా లోపలికి 
భద్రంగా 
మలుచుకోగలను .... 
నాలోనే  

Wednesday, August 5, 2015

అగమ్యుడు మనిషి


అతని ఆలోచనలకు ఒక గమ్యం లేదు
అన్నింటిలోనూ అన్నీ పొందాలని తహతహ
దేన్నీ కాదనడు.
ప్రతిదీ ఆరంభిస్తాడు
ముగిస్తాడో లేదో కాని .... దేన్నీ
చిత్రంగా అనిపిస్తుంటుంది, అప్పుడప్పుడూ
అతని తలలోనే అతని మెదడుందా అని

అతన్ని చూస్తే అతనికే నవ్వు రావాలి.
అతని యాంత్రికతలోనూ స్వార్ధాన్ని చూసి
ఏ పనైనా ఇష్టమయ్యే చేస్తున్నాడా అని చూసి
అందరూ చేస్తున్నారు అతనూ చేస్తున్నాడు.
అందరితోపాటు అతనూ సంపాదిస్తున్నాడు అంతే
పని, ప్రతిఫలం, తిండి, నిద్ర
శ్వాసించడం ఇవేగా జీవితం అనుకుంటూ 


ఒక్కటి మాత్రం చెప్పగలడు.
అతనితో జీవించడానికి అంకితమైన జీవన బాగస్వామికి
అతను వారానికో గంట ఇవ్వలేనని
పిల్లలతో కాలక్షేపం చెయ్యలేనని
కన్నతల్లిని కుశలమా అని పరామర్శించే సమయం లేదని.
కన్నతండ్రి కళ్ళలోకి సూటిగా చూడలేనని 

జీవించేందుకు దొరికిన ఒక అవకాశం జీవితం
అనుకోలేదు ఏనాడూ అతను
సంపాదించేందుకు అవసరంగా వాడుకున్నాడే కాని
కాలమే అన్నింటికీ సమాధానం అంటారే .... అబద్దం కాదూ
మానవతా విలువలు కాలం గడుస్తూ దిగజారిపోతూ ....

ఔనూ .... ఈ ఆలోచనలన్నీ ఎవరిలోనైనా చెలరేగితే
ఈ అనాలోచిత ఆత్మావలోకనానికి కారణమైతే!?

Tuesday, August 4, 2015

తెల్లవారింది


కలకన్నాను.
ఆ కలలో నిన్న రాత్రి
నాకు, అతి సమీపం లో
నీవు ఉన్నావు ....
ఎంతో సన్నిహితంగా

సాధారణంగా అనిపించింది.
మాట్లాడుతుంటే
ఎలా ఉన్నావు?
ఏమి చేస్తున్నావు?
కుశలమేనా? అని
నీవు పరామర్శిస్తుంటే  

అదో వింత అనుభూతి
వెన్నెల్లో స్నానించి  
పొందాలనిపించే వెచ్చదనం పొందినట్లు ....
మనసువ్వీళ్ళూరింది ....
ఎంతోసేపు
తెల్లవారకపోతే బాగుణ్ణని

ఒంటరిప్రేమ


నేను, నీపక్కన లేను .... నీ జతనై
నీ కన్నీరు తుడిచేందుకు
నిన్ను రోదించకుండా చూసేందుకు
నేను ప్రేమించింది, ప్రేమిస్తుంది.
కారే ఆ కన్నీటిని కాదు .... నిన్ను,

నిజం గా నాకు జ్ఞాపకం లేదు.
చివరిసారి ఎప్పుడు నీ నవ్వులు చూసానో ....
చూసానో దివ్య మనోహర సౌందర్యాన్ని
నీ ఆనందాన్ని అందాన్ని,
వర్ణించలేని ఆ అనుభూతిని

నిజం పిల్లా! ఎంత వింత అనుభూతో
ప్రేమించడం, ప్రేమించబడటం
అన్నీ ఉండి దూరంగా ఒంటరిగా
జ్ఞాపకాల
తేనె గూడుకట్టుకుంటూ జీవించడం 


చిత్రమైన నిరాసక్తతను
విరామ సంకేతాన్నీ చూస్తున్నా ....
నీ కళ్ళలో ....
ఇప్పుడు .... అయినా
నిన్నొదిలి వెళ్ళాలని లేదు, నాకు

ఎంత కొరతదనమో, ఎంత పీడో ....
నీకు దూరంగా ఉండటం 
ఎడబాటు పీడలోని తియ్యదనం 
ఒంటరి ఆనందం కు
నీవు బానిసవైపోతావనే .... ఈ భయం

Monday, August 3, 2015

మరో లోకం


మెరిసే ఆశాజనక
లోకాన్ని
వైభవోపేతంగా నీకు చూపిస్తాను
ఓ పిల్లా
నిజం చెప్పు
నీ మది
నీ ఎదభావనల్ని
ఒప్పుకుందా ఇప్పటికైనా   

నీ కళ్ళకు విందుగా 
నీకు అర్ధం అయ్యేలా
చెయ్యగలను.
వరసగా అద్భుతాలను
చూపించి 
ఒకటి పిదప ఒకటి
అన్నికోణాలనుంచీ
మాయా జగత్తనిపించేలా

మరో ప్రపంచం సుమా
అందంగా, ఊహామయంగా
ఒక కొత్త జగత్తు
ఒక కొత్త సృష్టిలా
అక్కడ
ఎవరూ చెప్పరు నీకు
ఏదీ కాదని ....
ఏవైపు వెళ్ళాలో అని
మనం కలలోనే ఉన్నామని

అది ఒక నవలోకం
మిరమిట్లు కొలుపుతూ
అంతకు ముందు ఎన్నడూ
చూడని లోకం అని
స్పష్టంగా తెలుస్తుంది.
నీతో కలిసి
నేను కదిలి .... మనమై
నదిలా కరిగి ప్రవహిస్తూ

నమ్మలేని దృశ్యాలు ఎన్నో
విడమర్చి,
విశ్లేషించలేని భావనలు అవి.
రెక్కలు కట్టుకుని
ఎగురుతూ
తప్పటడుగులు వేస్తూ
అప్పుడే పరుగులు తీస్తూ
స్వేచ్చగా మనం
ఆ నక్షత్రాల పడీదులో

ఎంత విశాలమో
ఆ ప్రపంచం
కళ్ళుమూసుకోవాలంటే భయం వేస్తూ
అక్కడ ఎన్నో
అసంఖ్యాక అద్భుతాలు
అక్కడే, నీకోసం వచ్చి
తిరిగి పోలేని
ఒక నక్షత్రాన్ని లా నేను

ఒక కొత్త అనుభవంలా ఉంటుంది.
క్షణక్షణమూ ఒక విచిత్రం
శొధించాల్సి వచ్చిన
కొత్త గమ్యాలె అన్నీ
ఆ గమ్యాల వేటలో
పరుగులు తీస్తూ
నీతో సమయం గడిపేందుకే 
నేను ఆగినట్లు అనిపిస్తుంది 

అది మరో నవలోకం
మనం నివశించాల్సిన
ఆత్మ లోకం
ఒళ్లు జలదరించే
ఊహాతీత లోకం
అక్కడే నీవూ నేనూ
ఉద్వేగంగా
నర్తిస్తూ, మమైకమైపోతూ
ఆ నక్షత్రాల సరసన