Thursday, August 6, 2015

నమ్మకమే ఊపిరిగా


ఆకాశంలోని నక్షత్రాలను లెక్కించలేను.
సప్త సముద్రాలను ఈద లేను
కనీసం హిమ శిఖరాగ్రాన్నీ చేరలేను.
నిజమే, ఒప్పుకుంటాను
ఆశలు ఆశయాలు కృష్తోనే సాద్యం
కోల్పొయిన కాలాన్ని తిరిగి పొందలేనని

నేను నీకు ఎంతో దూరంలో ఉన్నాను.
ఇక్కడ ప్రతి క్షణమూ నాకు ఒక యుగం లా
నీవు తోడు లేక
జీవిస్తూ శ్వాసిస్తున్నాను తెలుసా .... నీ ప్రేమ కోసం
నమ్మకంతో .... ఆ రోజొస్తుంది
జీవితమే నన్ను నీ సరసకు చేరుస్తుందని

ఉత్తరానికి దక్షణం అవసరమైనట్లు
గాలికి మేఘాలు అవసరం అయినట్లు
నా జీవనాశయాలు
ఆశల ..... అవసరం నీవు
తప్పులు జరగకుండా ఒప్పులుగా మార్చి
నేను చేరాల్సిన గమ్యంవైపు నన్ను నడిపేందుకు 


కాలమూ జీవితమూ
నన్ను నీ పక్కన నిలబెడుతాయి
నన్ను పరిపూర్ణుడ్ని చేస్తాయి
ఒక నాడు అని
అప్పటివరకూ
నేను ఇలా నమ్ముతూనే ఉంటాను.

No comments:

Post a Comment