అన్నింటిలోనూ అన్నీ పొందాలని తహతహ
దేన్నీ కాదనడు.
ప్రతిదీ ఆరంభిస్తాడు
ముగిస్తాడో లేదో కాని .... దేన్నీ
చిత్రంగా అనిపిస్తుంటుంది, అప్పుడప్పుడూ
అతని తలలోనే అతని మెదడుందా అని
అతన్ని చూస్తే అతనికే నవ్వు రావాలి.
అతని యాంత్రికతలోనూ స్వార్ధాన్ని చూసి
ఏ పనైనా ఇష్టమయ్యే చేస్తున్నాడా అని చూసి
అందరూ చేస్తున్నారు అతనూ చేస్తున్నాడు.
అందరితోపాటు అతనూ సంపాదిస్తున్నాడు అంతే
పని, ప్రతిఫలం, తిండి, నిద్ర
శ్వాసించడం ఇవేగా జీవితం అనుకుంటూ
అతనితో జీవించడానికి అంకితమైన జీవన బాగస్వామికి
అతను వారానికో గంట ఇవ్వలేనని
పిల్లలతో కాలక్షేపం చెయ్యలేనని
కన్నతల్లిని కుశలమా అని పరామర్శించే సమయం లేదని.
కన్నతండ్రి కళ్ళలోకి సూటిగా చూడలేనని
జీవించేందుకు దొరికిన ఒక అవకాశం జీవితం
అనుకోలేదు ఏనాడూ అతను
సంపాదించేందుకు అవసరంగా వాడుకున్నాడే కాని
కాలమే అన్నింటికీ సమాధానం అంటారే .... అబద్దం కాదూ
మానవతా విలువలు కాలం గడుస్తూ దిగజారిపోతూ ....
ఔనూ .... ఈ ఆలోచనలన్నీ ఎవరిలోనైనా చెలరేగితే
ఈ అనాలోచిత ఆత్మావలోకనానికి కారణమైతే!?
No comments:
Post a Comment