ఎన్నెన్నో చెప్పాలనుంది. చెబుతున్నా విను
ఈ ఊహలు
ఈ ఆలోచనలు ప్రామాణికం గా
నన్ను నేను
నీకు అర్ధం అయ్యేలా విప్పుకోవాలని
నువ్వు నా మానసివి .... నిజం
నీకు కనిపిస్తున్న .... సామాన్యత వెనుక
ఏ అమాయకత్వమూ
పిచ్చితనమూ లేవు
విజ్ఞత, ఈ మాటలకు సాక్ష్యమూ తప్ప
నిన్ను ప్రస్తావిస్తున్నప్పుడు,
నా హృదయ స్పందనారాటం పరవశాన్ని
గమనించు .... అప్పుడు నేను
పొందుతున్న తన్మయానుభూతినీ
నా గుండె చేసే ప్రతి అల్లరి శబ్దం లోనూ
నీ నామమే మనోహరీ .... ఓ పిల్లా!
బిగ్గరగా,
స్పష్టంగా ....
వేదమంత్రం లాగుండె కొట్టుకుంటూ ....
ఆ లయబద్దత లోఏదో విశిష్టత,
వింత అభిమాన భావన ఎవరికైనా
నన్నెరిగిన ఏ పురజనునికైనా
నిజమిదేనని తెలుస్తుంది.
ఈ గుండె కొట్టుకుంటుంది నీ కోసమే అని
సాంప్రదాయపద్దతిలో
ఒక నేను ఒక నీ అనుమతిని పొంది
ప్రస్తావించితే
మన కదలికలు,
మనోభావనలు ఒకే దిశగా ఉన్నాయి కనుక
ప్రపంచాన్ని ఒడిలో గుమ్మరించమని
ఆశించని నీవూ
పరిపూర్ణతే కావాలని కోరుకోని నేనూ
ఒక్కటవ్వాలని .... కోరికను నీముందుంచితే,
కేవలం ప్రేమే లక్ష్యం గా
మనుగడలో ఎదురయ్యే ప్రశ్నలకు
సమాధానాలమైతే చాలని
అందుగ్గానూ అను క్షణమొకరికొకరం
తోడుందామని అంటే
నా ప్రతి శ్వాసలోనూ
నా ప్రాణం లా నిట్టూర్పులా నీవే ఉన్నావని
నా ఊపిరితిత్తుల ఉల్లాసం కదలికలకు
కారణం నీవని
నా గుండె తీవ్రంగా కొట్టుకుని
వర్ణం, వేగం మారిన
అద్భుత ప్రతి స్పందనకు ప్రేరణ నీవని
అవునూ
ఈ ప్రస్తావన వింటూనేనీవు కానీ,
నేనునమ్మకం అంచుమీద
కూర్చుని ఉన్నాననుకుంటావేమో
నిజం మాత్రం ఇదే ....
ఈ పలుకుల్లో సత్యమే ఉంది.
నేను నిన్ను ప్రేమిస్తున్నాను
ఇక్కడే ఉంటాను అనుక్షణమూ నీతోనే .... లో
"నా ప్రతి శ్వాసలోనూ నా ప్రాణం లా నిట్టూర్పులా నీవే ఉన్నావని "
ReplyDeleteఈ సుత్తి మాటలనుంచి పిచ్చి భ్రమలనుంచి ఎప్పుడు బయటపడతావో కదా.