Sunday, August 30, 2015

అందమైన ప్రపంచం మనది


గుట్టుచప్పుడుకాకుండా ఒక పసి శరీరం
భూమ్మీద చెత్తతొట్టిలోకి విసిరివేయబడిన రోజు
స్వాగతించేందుకు ఎవరూ ఉండరు.
దారిద్ర్యం గర్భాన జనియించిన శిశువు
ప్రాణం పోసుకుని ఆనందంగా
తొలి ఊపిరి తీసుకోవలసిన సమయం లో
ఆ కంట కన్నీరు ....
తనకో కుటుంభం లేదని, పేరు లేదని కాదని
కన్నీరు తుడిచి చేరదీసే మానవత్వం
కనరాదేమనని అనుకుందాము  


అందుకే .... తుడవొచ్చు ఎవరిమైనా
ఆ కన్నీరును మచ్చలవ్వకుండా
బుగ్గలపై,
చెయ్యొచ్చు ....
బుగ్గలమీంచి నేలరాలకుండా
మానవత్వం మలినం కాకుండా 


ఎవరైనా ముందుకు వచ్చి .... ప్రేమగా,
చేరదీయొచ్చు! సంరక్షించొచ్చు! 
ఒక అందమైన కుటుంభం లో ఒకరినిగా చేసి
గర్వపడొచ్చు!
చూడొచ్చు ....
ఆ ముఖం పై ఒక అందమైన చిరునవ్వును,
కన్నీళ్ళకు బదులు కలల ముత్యాలను,
ఆ కళ్ళలో కృతజ్ఞతల మెరుపును

ఆ ఉత్పత్తే ఒక విషాద అనుభవమై
నిరాశ నీడలో నిలుచుని ఉన్న  
ఆ ప్రపంచం పై కాంతి ని ప్రసరించి
హృదయాకాశం లో ఆశల తారాగణాన్ని పేర్చి
ఆ కన్నీటి ప్రపంచం లో
కుటుంభమూ, పేరు లేని ఆ జన్మలో
ఆశయాల ఇటుకలను కూర్చి
మానవతావాదానికి మనవంతు సహాయం అందించి

No comments:

Post a Comment