వ్యక్తి పూజ,
స్వీయ దురబిమానము
ఆరాధనాభావనలకు
ప్రచార మాధ్యమాలే
కారణం అని
అమానుష
అశ్లీల
బలాత్కారాలకు
ఇంటర్నెట్టే
కారణం అని
పెరుగుతున్న హింస
అమానవత్వ ఘటనలకు
ఆయుధ కర్మాగారాలే
కారణం అని
తన అవివేకానికి
తన తొందరపాటుతనానికీ
విద్యా వ్యవస్థే
కారణం అని
తన ఆబ కూ
తన స్థూలకాయానికీ
ఫాస్ట్ ఫుడ్ పరిశ్రమే
కారణం అని
అభిప్రాయపడి
ఆరోపిస్తే
అణువంతైనా
అతనికి
సామాజిక బాధ్యత
అస్తిత్వము ఆలోచనా లేవని
అనుకోవాల్సొస్తుంది.
No comments:
Post a Comment