Saturday, September 12, 2015

శూన్యరాగం


నేను
ఒక ఖాళీ మనసును.
ఒక తడి ఆరని రెల్లును,
నిటారుగా నిలబడలేని
నిర్జన రహదారిలో ....
పిచ్చితనాన్ని లా
తూలుతూ కదులు ప్రేమను 


నేను
ఒక అపరంజిని.
స్వచ్ఛతను,
అమాయకతను,
ఆడుకోవడటానికి సరదాపడేంత
పడేస్తే పడి పగిలి ....
గుండె ముక్కలైపోయే 
సౌందర్యాలరాసిని

1 comment:

  1. కొత్తగ వస్తున రాజకియ వార్తలు సినీమ వార్తలు celebrities గొస్సిప్స్, videos, photographs, అన్నీ సినీమ trailers, మరియు interviews అన్నీటి గురించి తెలుసుకొవలి అనుకొంటె ఇప్పుడె చదవండి మీ Spice Andhra News

    ReplyDelete