Monday, February 28, 2011

ప్రకృతి మాత

కలలు కనే యువతా ... నీకు ఉష్ణబారం తెలుసా ...
తళుకుల, మిణుకుల, మెరుపుల ప్రపంచం పట్టణమే కనిపిస్తుందా ...
కానీ అతని భవితవ్యాన్ని ప్రకృతి మాత్రమే కాపాడుతుంది ... తెలుసుకో
చెట్లు కొట్టడానికి బదులు ...
చెట్లు పెట్టదం నేర్చుకో ...
ప్రకృతి విపత్తును తప్పించుకో ...
నిర్లక్ష్యంతో నీవో కారణం కాకు
నదీ నదాలు పారని నాడు ...
చెట్లు పెరగవు ...
అడివిని నరికి ...
ప్రకృతి మాతను కలవర పెట్టకు
ప్రపంచాన్నెందుకు ఉష్ణ పీడితం చేస్తావు?     

వర్షఋతువు

జోరున వర్షం కురుస్తోంది
చెట్ల కొమ్మల్ని విల్లులా వంచి మరీ
ప్రియురాల్ని ఆత్రంగా ముద్దాడుతున్నట్లు ...
చెట్లు మాత్రం నిలబడే ఉన్నయి
ఈదురు గాలులువీస్తున్నాయి ...
శరీరాలు జల్లుమని ...
నదీతలాలు మాత్రం
పొంగిపొర్లుతున్నాయి
కప్పలు గెంతుతున్నాయి ...
బెకబెకల రొధ ...
పసి పాపలు మాత్రం
నిద్రపోతూనే వున్నారు
రవ్వంత కూడా వినిపించని ...
నిశ్శబ్దం కుహరంలో
గబ్బిలాలు ... పక్షులు మాత్రం
కూస్తూనే వుతున్నాయి
తేనెటీగలు రొధ రొధ గా గాలిలో 
అర్ధం కాని రాగంలో అలజడి చేస్తూ  ...
పూల మొక్కలు మాత్రం
మొలకలెత్తుతున్నాయి
ప్రవాహానికి ఎదురీదుతున్నాయి చేపలు ...
వినిపిస్తుందా మిత్రమా నీకు ఆ సవ్వడి
వర్షఋతువు రాబోతుందని ...
కాలబద్దంగా సద్భావపూరితంగా  ...

Sunday, February 6, 2011

మనసు సంకెళ్ళు

నిశిరాత్రి
భరించలేని నిశ్శబ్దం .... ఒంటరితనం
నివురుగప్పిన నిప్పుల మధ్య
నుశిగా మారిన
మధుర శ్మృతులు ... వదిలివెళ్ళలేను.
నీరసం
సర్వం .... నిర్మానుష్యం
సడలించుకోలేని ... మనసు సంకెళ్ళు!
ఆకాశం మబ్బుల మయం గా ....
మబ్బులు రోధిస్తున్నట్లు .... నన్నోదారుస్తున్నట్లు
ఉపశమనానుభూతి అది!
వర్షించే నీ కన్నులు ఆ మేఘాలైనట్లు
నీ ప్రెమే అలా .... వర్షించుతున్నట్లు
నా పక్కనే నీవు వున్నట్లు .... భ్రమ
అది .... కాలి బూడిదైన వాస్తవం!
ఆ మేఘాల వెనుక .... మిణుకు మిణుకు మని
నన్ను జాలిగా చూస్తున్న ... ఆ నక్షత్రానివి నీవు కాదూ!
మిగిలిన ఈ తోడులేని జీవితం ...
అ సంకల్పం .... ఊహించని నిజం!
ఔనూ! .... నా కళ్ళెందుకు ప్రతి వర్షిస్తున్నాయి?
నా మనస్సెందుకు ఊగిసలాడుతుంది?
నా అభిలాష మాత్రం ....
నీ పక్కనే నా స్థానం అని .... నీ వద్దకు నే చేరాలని!