Tuesday, August 30, 2016

జీవితం సరిహద్దుల్లోనీతో అతుక్కుపోయిన నా ఆత్మను
తిరిగి పొందేందుకు, నిన్ను తెలుసుకునేందుకు 
చనిపోయినా పర్వాలేదనిపిస్తుంది.
నీతో కలిసి ఉండేందుకు
ఈ హృదయాన్నిచ్చెయ్యాల్సొచ్చినా

నిన్ను అర్ధం చేసుకోవడానికి
జీవితాన్నే పరిత్యజించాల్సొచ్చినా
నేను ఎంత లోతుగా, ఎంత ఘాఢంగా
నీ జతను కోరుకుంటున్నానో
నీకు తెలిస్తే చాలు అని
ఆశలు కలలన్నీ నీతో ముడివేసుకుని అని

నిజం మానసీ!
ఈ గుండె కొట్టుకునేది నీ కోసమే 
నేను శ్వాసించేది నీ కోసమే 
ఈ నరనరాల్లో
రక్తం ప్రవహించేది నీ కోసమే

ఎందుకో మరి నేను ఏ వాగ్దానానికో
ఏ కర్మ బంధానికో బంధీనౌతున్నట్లుంటుంది. 
నిన్ను ముద్దాడాలనిపించిన ప్రతిసారీ ....
మనది ఎన్నో జన్మల బంధం లా
ఎల్లప్పుడూ నీడలా నీతొనే ఉండాలనుకునేలా

నన్ను ప్రేమిస్తున్నాను అంటావు ఎప్పుడో
అప్పుడే దాగుడుమూతలు ఆడుతున్నట్లు
మాయమౌతుంటావు. 
అందుకే నీతో ఉండీ సర్వం శున్యమైనట్లు 
ఏకాంతం లో ఉన్నట్లుంటుంది.

ఓ మానసీ! నేనున్నది నీ కోసమే
ఈ జీవితం జీవించుతున్నది
నీతో ఉండీ
ఏకాకినైనా అదే భాగ్యం అని
ఒంటరి మరణం పొందినా

నా శరీరమూ అరచేతులు
చెమట తో తడిచిన శీతలత్వం 
కళ్ళముందు ఇంద్రధనస్సు మెరుపులా  
అనూహ్యమైన నొప్పి భయం
ఏ వాగ్దానమో ఎడబాటో ఊహించుకుని 

ఈ ప్రియభావన ముళ్ళ కిరీటం తో
నాకు నేనొక అమాయకపు చక్రవర్తినిలా
నాలుగు రోడ్ల కూడలిలో .... నీ ప్రేమ కోసం
దారి తెలియక .... మరణమార్గం వైపు
పరుగులు తీస్తూ ఆగినట్లుంటుంది. 

ఇప్పుడు ఈ జీవితం ప్రసాదంగా
నీ ముందు ఉంచుతున్నాను .... మానసీ!
మరో సారి సవినయంగా మనవి చేసుకుంటూ
నా మరణం మనల్ని విడదీసేవరకూ
నీవే నా అన్నీ అని విడమరుచుతూ

Monday, August 29, 2016

ఎలా!?బహు సాధారణ వేషధారణ
నిరాడంభరత, ఆకర్షణ
ఖచ్చితమైన సంకల్పము
పొంగిపోతున్న ఉత్సాహం
సామర్ధ్యం, తెలివి, ఆశావాదం ....

కళ్ళముందు నిండు జీవితం
అవకాశాల మయం .... ఎదురుచూస్తూ,
ఎన్నో వెళ్ళవలసిన స్థలాలు
ఎందరో కలవవలసిన మనుష్యులు
కలలు నిజం చేసుకునే జీవన క్రమం లో

వేగవంతంగా కాకపోయినా
ప్రతి ఒక్కరికీ .... మనలో
ఒక అనుచిత విధానం అంటూ ఉంది.
పుట్టిన స్థితిగతులు, వాతావరణం
పెరిగిన సామాజిక నడవడిక లో

తుప్పు సాంప్రదాయాల సంకెళ్ళు కొన్ని
తెంచేసెయ్యాలనుంటుంది. కానీ
సామాజిక అంచనాలు, సంకోచాలు 
అతిక్రమించని మంచి మనిషి అనే  
పేరుకు మచ్చరాని విధంగా .... ఎలా!?

Saturday, August 27, 2016

అమ్మా!
ఒక అమ్మ కడుపులో రక్తపు ముద్దను
ఒక అమ్మ ఒడిలో వెన్నముద్దను
ఎక్కడో పుట్టి
ఇంకెక్కడో పెరిగి, నేను
నాలా 
జన్మించిన ఇంటిని ఒదిలి,
మెట్టినింటి ముంగిట్లో రంగులద్ది
బ్రహ్మ కార్యానికి ఆలంబనౌతూ ఉన్న నీకు
ఒక చిన్న విన్నపము ....
నా అమ్మలు ఇద్దరి
విలక్షణ అబౌతికానందం ను
నీలో చూస్తూ ఉన్నా
అమ్మా! 
జన్మదినమని కేకులు తినిపిస్తావేమో
వద్దు! వెన్నముద్దే ముద్దు నాకు
స్వచ్చ మమతానురాగాల ప్రేమ వెన్నే
తినాలని ....
ఓ స్త్రీ మూర్తీ .... అమ్మా!

Friday, August 26, 2016

వ్రేలాడుతూ బొమ్మనైనేను, ఇక్కడ నీ పక్కన
కిటికీ కర్టెన్ కు రెండవ వైపున
బహుశ ఏ మందమారుతాన్నో లా ....

నిశిని నిశ్శబ్దాన్నీ నిస్తేజం చేసే
కదులాడే చైతన్యం
ఆహ్లాదానుభూతిని లా ....

నీ వాకిట ముంగిట
వరండాలో హడావుడీ చేసే
అర్ధం తెలియని అపక్రమ శబ్దాన్ని లా ....

ఆదమరచి నిద్రలో నీవు
నిండా మునిగి ఉన్నప్పుడు
నీ శ్వాసను వింటున్న శూన్యాన్ని లా ....

ఎప్పుడైనా నా చేతి చిరు స్పర్శతో
నీ మూపు పై
జలదరింపునై జారుతూ ....

ఎన్నో అందమైన కలలను
నువ్వు ఏరుకునేలా
ఒక్కోసారి పరిమళ వింజామరాన్నౌతూ ....

వ్రేలాడుతూ ఉంటాను ఎప్పుడూ 
నరదృష్టి నీమీద పడకుండా
నీ వీది గుమ్మం బయట ఉరేసుకుని ....

నేను మాత్రం వికృతమైన కలలు కంటూ
నిశ్శబ్దాన్నీ నిశినీ దుమ్మునూ దూళీనీ
పలుకరిస్తూ సకల వేళల్లో చిత్తరువునై .... 

Monday, August 22, 2016

ఉలికిపాటు హృదయంగుండెకు ఒత్తిడి నొప్పి
శ్వాస భారము

మెదడు కు అర్ధం కాని భావనల
భాష ను క్రక్కుతూ శరీరం

ఎంత ఎదురుచూసినా

ప్రపంచం మొత్తం లో
నన్ను తెలుసుకోవాలని నేననుకునే అస్తిత్వం

ఆమె

సూపర్ మార్కెట్ లోకి వచ్చి
మాటకు వినబడేంత దగ్గరగా మెదులుతూ

అందుబాటులో నేనక్కడే ఉన్నానని
గమనించక  పోవడం

చిత్రం సుమా!
స్పందించాలను ఎద భావనలు

Monday, August 15, 2016

ప్రేమ ఒక పదం మాత్రమేఆ ప్రేమే నిన్నూ నన్నూ
తన సర్వశక్తులతో ....
స్వాధీనం చేసుకుంటుంటే
లొంగిపోవడంలోనే
జీవితం,
అనిపించే వరకూ
ఎవరైనా ఆ ప్రేమ కు
ఒక అందమైన అర్ధం
ఇస్తారనిపించే క్షణం వరకూ

Saturday, August 13, 2016

నాలోనే ఉన్నావు నీవుగట్టిగా పట్టుకునైనా ఉండాల్సింది.
పోనివ్వకుండా ఎటూ ....
అప్పుడు వెసులుబాటిచ్చుండాల్సింది కాదు
ఎలాంటి భారమూ ఉండరాదనుకుంటే 
ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఏమిటి?

విఫల ప్రయత్నం అని తెలిసీ పోరాడుతున్నావు
గతం ను మర్చిపోయే విఫల ప్రయత్నం చేస్తున్నావు
కొన్ని ఆశలు అనుభూతులు అంతే
అసంపూర్ణమనే
మర్చిపోలేని నిజాలు అంగీకరించక తప్పదు.

ఎవరి ప్రస్తుత స్థితికి వారే కారకులు  
ఆశక్తత అస్థిరత తో కోల్పోయిన రోజుల్ని  
గణించుకుంటూ నిస్తేజుడివై ఉండే కన్నా 
తెలిసింది చెయ్యగలిగిందీ చెయ్యడం లో
వర్తమానం వికాసం ఉందని గుర్తుంచుకో

ఏ వైఫల్యాన్నీ అంతగా పట్టించుకోవాల్సిన
అవసరం లేదు గుండెకు .... అనుకుని
సందేహాలను పక్కకు నెట్టేసి
కదలాలని నిర్ణయించుకో
ఎవరి బలం వారిలోనే ఉందని తెలుసుకుని

గతం అనుభవాల్లొంచి గుణపాటం ఉంటే
నేర్చుకోవాల్సింది పోయి
మనసు భారం తగ్గుతుందనే బ్రమ లో 
మనో ఫలకం పై మానసి చాయల్ని
తుడిచెయ్యాలనుకోవడమే పెద్ద తప్పు 

నింపాదిగా మనసును పరిచి చూడు
భావోద్వేగుడివి కాకుండా .... ఆలోచించి 
నీ మానసి శ్రేయస్సే నీ ఆకాంక్షైతే ....
నీ సామర్ధ్యం నీ బలమే నీకు తోడ్పడేదని
అది ఎప్పుడూ నీలోనే ఉంటుంది కనుక

నీ ప్రేమ .... బంగారు పంజరం లోప్రాకృతికమేమో అనిపిస్తుంది.
పరిశీలించుకుని విశ్లేషించుకునే కొద్దీ
నీ పట్ల నా ప్రేమ భావనలు
ఆ అనుభూతుల లోతుల్లో
నాలో నా అంతరాంతరాల్లో
ఆ విలక్షణ ప్రకాశం
ఆ ప్రకాశంలో కరిగిపోతూ నా ఆత్మ
ఔదార్యం నీడలో కలిసిన ఛాయాచిత్రం లా
నీ ప్రేమ నీడ లో ....
ఆ ప్రేమకు నేను స్వాధీనం అయి
నా అణువు అణువు మూలాలతో సహా
నీ ఆధీనం లో కి జారిపోతూ
ఆ జైలులోనే అనంతానంత ఉద్వేగం లో
అనంతకాలమూ అలాగే ఉండిపోవాలనిపిస్తూ
ప్రేమ చైతన్యానికి చిరునామాను గా మిగిలిపోవాలని
గాలికి .... వీచే ఆకుల కదిలికలా
ఒక ప్రేమ పరామర్శనై కదలాలి అని
ముగింపు గమ్యం లేని
అనంతాన్నై మరింత అనంతాన్నవ్వాలని
నియంత్రణను కోల్పోయిన ఒక సుడిగాలి సుడిని లా
నాకు తెలుసు ....
ఈ ప్రేమ అతి ప్రమాదకరం అని
కానీ నాకు దప్పిక చావడం లేదు.
ఆకలి తీరడం లేదు.
నిన్నూ నీ ప్రేమనూ వీడలేకపోతూ ....

Friday, August 12, 2016

శిలాశాసనంను వినాలనిచెబితే నీవు .... "నేను నిన్ను ప్రేమిస్తున్నాను" అని
ఆ హామీ ఆనందం తో
నా గుండె పరిపూర్ణంగా నిండి 
పరిత్రాణం పొందాలని ....

నీ మృదు బాషణలతో
నీవు నా విరిగిన గుండె ను చక్కదిద్దాలని
అఘాదాల్లోకి జారిన
నా జీవన జాతకాన్ని రహదారిలా మార్చాలని  

మూడు సాధారణ పదాలతో
"నేను నిన్ను ప్రేమిస్తున్నాను" అని నీవు చెప్పాలని
నీ పదాల మాటల్లోని
ఆ ప్రతి అక్షరమూ శిలాక్షరమై శిలాశాసనమౌతూ ....

Thursday, August 11, 2016

నీ ప్రేమ ను నేను అయ్యినీ సుతిమెత్తని హృదయాన్ని అందుకోవాలని
నీ గుండె అలజడిని
కొట్టుకునే చప్పుడును వినాలని 
నీలోని ఆ అమాయకత
ఆ మొహమాటం ను తుంచెయ్యాలని  

ఎప్పుడైనా నేను అలసి అశక్తుడ్నై
ఒంటరినను అనుభూతి చెందినప్పుడు మాత్రం
నిన్ను గురించే ఆలోచిస్తుండాలని 
మనది కేవలం ఒక ప్లాట్ ఫారం పరిచయమే అయినా
చొరవగా నిన్నే తలుస్తూ ఉండాలని

నీ ఆలోచనల్ని బాధల్ని పంచుకోవాలని 
నీకు తగదని, తటస్తత నిర్లిప్తత  
నీ కళ్ళు అలా వర్షించరాదని
నీ జతనై ఉండి జన్మజన్మలకు ....
నీ సమశ్యలకు సమాధానమై నేనుండాలని  

Wednesday, August 10, 2016

అంపశయ్యను చేరాకఏ చీకటి నీడలలోనో అస్తిత్వాలను కోల్పోయి
విరిగిపోయిన కలలతో మిగిలి
పొగలా మారిన నిశ్శబ్ద రోధనల మంటలలో
కాలిపోతున్నప్పుడు ఎవ్వరూ సహకరించరు.
నీది ఎంత ఎదురు చూపుల తపనైనా
గాయాలు నొప్పి మినహా
ఏవీ నీ చీకటి భయాలను పారద్రోల లేవు.
నీ కళ్ళు రక్తం స్రవిస్తూనే ఉంటాయి.
అలసీ, నీవు పరుగులు తీస్తూనే ఉంటావు.
గుడ్డితనం అవివేకానికి దారి చూపిస్తున్న
జీవన సరళిలో, అన్నీ కోల్పోక తప్పని అభాగ్యత
మరణం తప్ప మరేది మిగలని దుర్దశ ....
అవివేకం మూల్యం చెల్లించుకుంటున్నామనే
అవగాహన, నీకైనా నాకైనా
బహుశ అంపశయ్యను చేరాకే తెలుస్తుందేమో

Sunday, August 7, 2016

ఎంత బాగుంటుందోనేనొకవేళ నా శరీరంలో దాచేసుకున్నా
నీ ఆలోచనల్ని
మన నివాసం చుట్టూ అల్లుకునున్న మంటలు
మనల్ని ముట్టెయ్యక తప్పవు

ఎవ్వరమూ ఏమీ చెయ్యలేము.
నిస్తేజులమైపోవడం మినహా
మనల్ని మనం ఎలా భద్రంగా ఉంచుకోవాలో
అసలు విశ్రమించే వీలు కల్పించగలమో లేమో

అందుకే నేను ఇప్పుడు ఒక కత్తితో
మన ఆలోచనల కొమ్మల్ని కొన్నింటిని
భద్రంగా కత్తిరించుతున్నాను. వాటి అంటుల్ని కట్టి
పక్కనే వాటితో పానుపు ఏర్పరిచేందుకు

ఆకాశం ఎదురుచూడదు
ఎప్పుడూ ఎవరికోసమూ ఎందుకోసమూ
అది వర్షించుతుంది. ఎండల వేడిమిని
చలి మంచులను విస్తరించుతుందే గాని

ఈ సుందర రమణీయ ప్రకృతి లో
ఈ ఋతుమయ ఆవాసజీవనం లో
ఈ సుందర ఆనందాల నిలయాలయం లో
మమైకమైన పక్షులమై కలిసుండిపోతే .... మనం