Saturday, August 13, 2016

నీ ప్రేమ .... బంగారు పంజరం లో



ప్రాకృతికమేమో అనిపిస్తుంది.
పరిశీలించుకుని విశ్లేషించుకునే కొద్దీ
నీ పట్ల నా ప్రేమ భావనలు
ఆ అనుభూతుల లోతుల్లో
నాలో నా అంతరాంతరాల్లో
ఆ విలక్షణ ప్రకాశం
ఆ ప్రకాశంలో కరిగిపోతూ నా ఆత్మ
ఔదార్యం నీడలో కలిసిన ఛాయాచిత్రం లా
నీ ప్రేమ నీడ లో ....
ఆ ప్రేమకు నేను స్వాధీనం అయి
నా అణువు అణువు మూలాలతో సహా
నీ ఆధీనం లో కి జారిపోతూ
ఆ జైలులోనే అనంతానంత ఉద్వేగం లో
అనంతకాలమూ అలాగే ఉండిపోవాలనిపిస్తూ
ప్రేమ చైతన్యానికి చిరునామాను గా మిగిలిపోవాలని
గాలికి .... వీచే ఆకుల కదిలికలా
ఒక ప్రేమ పరామర్శనై కదలాలి అని
ముగింపు గమ్యం లేని
అనంతాన్నై మరింత అనంతాన్నవ్వాలని
నియంత్రణను కోల్పోయిన ఒక సుడిగాలి సుడిని లా
నాకు తెలుసు ....
ఈ ప్రేమ అతి ప్రమాదకరం అని
కానీ నాకు దప్పిక చావడం లేదు.
ఆకలి తీరడం లేదు.
నిన్నూ నీ ప్రేమనూ వీడలేకపోతూ ....

No comments:

Post a Comment