Friday, August 26, 2016

వ్రేలాడుతూ బొమ్మనై



నేను, ఇక్కడ నీ పక్కన
కిటికీ కర్టెన్ కు రెండవ వైపున
బహుశ ఏ మందమారుతాన్నో లా ....

నిశిని నిశ్శబ్దాన్నీ నిస్తేజం చేసే
కదులాడే చైతన్యం
ఆహ్లాదానుభూతిని లా ....

నీ వాకిట ముంగిట
వరండాలో హడావుడీ చేసే
అర్ధం తెలియని అపక్రమ శబ్దాన్ని లా ....

ఆదమరచి నిద్రలో నీవు
నిండా మునిగి ఉన్నప్పుడు
నీ శ్వాసను వింటున్న శూన్యాన్ని లా ....

ఎప్పుడైనా నా చేతి చిరు స్పర్శతో
నీ మూపు పై
జలదరింపునై జారుతూ ....

ఎన్నో అందమైన కలలను
నువ్వు ఏరుకునేలా
ఒక్కోసారి పరిమళ వింజామరాన్నౌతూ ....

వ్రేలాడుతూ ఉంటాను ఎప్పుడూ 
నరదృష్టి నీమీద పడకుండా
నీ వీది గుమ్మం బయట ఉరేసుకుని ....

నేను మాత్రం వికృతమైన కలలు కంటూ
నిశ్శబ్దాన్నీ నిశినీ దుమ్మునూ దూళీనీ
పలుకరిస్తూ సకల వేళల్లో చిత్తరువునై .... 

No comments:

Post a Comment