Monday, August 22, 2016

ఉలికిపాటు హృదయం



గుండెకు ఒత్తిడి నొప్పి
శ్వాస భారము

మెదడు కు అర్ధం కాని భావనల
భాష ను క్రక్కుతూ శరీరం

ఎంత ఎదురుచూసినా

ప్రపంచం మొత్తం లో
నన్ను తెలుసుకోవాలని నేననుకునే అస్తిత్వం

ఆమె

సూపర్ మార్కెట్ లోకి వచ్చి
మాటకు వినబడేంత దగ్గరగా మెదులుతూ

అందుబాటులో నేనక్కడే ఉన్నానని
గమనించక  పోవడం

చిత్రం సుమా!
స్పందించాలను ఎద భావనలు

No comments:

Post a Comment