ఒక్కసారి అపరిచితులం అవుదాం
మనం
ఇన్నాళ్ళూ
నా కోసం నీవూ
నీకోసం నేనూ జీవించామని
మరిచిపోయి
మళ్ళీ ప్రేమలోపడదాం!
నేను నీ కళ్ళలోకి
ప్రవరాక్యుడి తొలిచూపు లా
నీవూ నన్నే చూస్తూ ....
ఎప్పుడూ ఎండలోనే తిరిగేవాడు
తడికి భయపడే వాడి లా .... నేను
జీవ సాగరాన్ని ఈదుతూ
నీ చేతులు నేనూ నా చేతులు నీవూ
పట్టుకుని
ఒకరి వెచ్చదనం ఒకరు
ఏనాడూ పోందనట్లు అనుభూతి చెందుతూ
ఉదయ సంద్యా రాగాల్ని ఆస్వాదిస్తూ
తొలిసారి చూసినట్లు స్వాగతిద్దాం!
ఒకరికి ఒకరము ఏమీ కానట్లు
ప్రేమ సాగరములో ఈదుతూ
ఈ జీవనయానాన్ని మరోసారి
అలసట తెలియని విధంగా .... అన్యోన్యం గా
నేనొక ప్రేమ పిశాచిని. నీవొక ఒంటరి మహిషివి. మనమిద్దరం మూడు చక్రాల సైకిలెక్కి బీచికి వెళ్ళి బాహుబలిసినిమా చూసి పిజ్జా తిని వద్దామా?. ఎందుకు బయ్యా ఈ చింతకాయల ప్రేమ కవితలు?
ReplyDelete