Saturday, November 21, 2015

అమానుషత్వం చెరలో


నిశ్శబ్దం నిండిపోయిన ఓ శీతల రాత్రి .... క్షణాలు 
మంచుకొండల మధ్య అర్ధ ప్రాణంతో
చల్ల గాలి కి ఒణుకుతూ గడ్డకట్టుకుపోయిన శరీరం

ఎవరి ఉశ్వాస నిశ్వాసలు వారికే వినిపిస్తూ
నా వరకూ నేను చుట్టూ చూసే ప్రయత్నం చేసినా
చూపుకేమీ అంద లేదు .... అంధకారం తప్ప

మంచు గడ్డల్లో గడ్డ లా మారిపోక తప్పనిసరి స్థితేమో
శూన్యం చుట్టుముట్టిన మౌనాంధకారమే
అస్సహాయత ఒంటరితనమే ఎటుచూసినా

కొండల్లో కొండలా మంచులా గడ్డకట్టుకుపోవడానికి
అంగుళాలదూరంలోనే ఉన్నామని అర్ధం అయినా 
పరిణామక్రమం అగంతక ఆలోచనల్ని మార్చలేని అశక్తత 



ఇప్పుడు నేను కళ్ళతో చూడగలిగింది చాలా తక్కువ
భారంగానైనా నడవాలి ఏదో ఒకటి చెయ్యాలనుకుంటూ 
బయటపడాలి .... ప్రాణాల్ని నిలుపుకోవాలనే తపన

అగంతకుల చెర చిత్రవధలతో స్పర్శను కోల్పోయిన
సహకరించని అవయవాఉ .... అనాలోచితంగానే
మంచు తేలిన తటాకం వైపు నడుస్తున్నాను.

అప్పుడే చూసుకున్నాను స్వయాన్ని .... దూరం గా చావును
సాగదీస్తూ ఉన్న నా పరిగణాన్ని వారి మూలుగుల్ని వింటూ,
ఆలోచిస్తూ మానవ పరిణామ క్రమాన్ని .... ఆవేదన తో

No comments:

Post a Comment