Saturday, February 1, 2014

చిత్రం!


అది నాకు ఒక తాజా అనుభూతి.
ఒక కొత్త అనుభవం!
ఆ సూర్యుడు ప్రకాశవంతంగా
కిరణాలు ప్రసరిస్తూ,
ఉదయపు మంచులో ఆ కిరణాలు
తళతళ మెరుస్తూ,
గడ్డిలో గిరగిరా తిరిగిన .... నీవూ నేనూ
ఆ తళతళల్ని పులుముకుంటూ ....
ఊహల రెక్కలమర్చుకుని .... మనం
ఆ నీలి ఆకాశం లోకి ఎగిరి, మేఘాలపై పచార్లు చేసి ....
అక్కడ్నుంచి లోతైన సముద్రం లోకి దూకి,
నీలిరంగును పులుముకోవడము,
ఊరుబయట పొలం లో విప్ప చెట్టుకింద
మనం కూర్చునున్నప్పుడు ....
గడ్డి ఆరగిస్తూ ఆలమందలు 
అప్పుడప్పుడూ "అంబా!" అని అరుస్తున్నట్లు,
కొమ్మలు, ఆకుల్లోంచి వడపోసినట్లు
రాలుతున్న కొన్ని సూర్యుని కాంతి కిరణాల్ని మనం
ఒక సీసాలో పట్టుకుని బంధించినట్లు,


 










నిజం! ఎంత అందమైన దృశ్యం .... ఈ ఊహ, నా మదిలో
గోరువెచ్చని గాలి నిన్నూ నన్నూ తాకినట్లు
మన బాహ్య ఆత్మలను గిలిగింతలు పెట్టినట్లు
నీవు పక్కనున్నావన్న భావనే చాలు!
అది ఒక నూతనానుభవం. ఒక చిత్రమైన అనుభూతి!

6 comments:

  1. నీవు పక్కనున్నావన్న భావనే చాలు!
    అది ఒక నూతనానుభవం.Beautiful feel

    ReplyDelete
    Replies
    1. నీవు పక్కనున్నావన్న భావనే చాలు!
      అది ఒక నూతనానుభవం.

      అది ఒక బ్యూటిఫుల్ ఫీల్ ....

      అది చక్కని స్పందన స్నేహాభినందన
      ధన్యవాదాలు పద్మార్పిత గారు! శుభోదయం!!

      Delete
  2. ఊహలే అందమైనవి ,ఇక వాటికి రెక్కలుంటే ఇక ఆపడం ఎవరికి సాధ్యం...చంద్రగారు మీ కవిత ఒక మంచి అనుభూతి.

    ReplyDelete
    Replies
    1. అందమైన ఊహలు, ఇక ఆ ఊహలకు రెక్కలుంటే ఆపడం ఎవరికి సాధ్యం...
      చంద్రగారు మీ కవిత ఒక మంచి అనుభూతి.
      చక్కని భావనాత్మకత స్పందనలో ....
      ధన్యవాదాలు శ్రీదేవీ!

      Delete
  3. అందమైన ఊహలు రావటానికి అంతే అందమైన మనస్సుండాలి.
    అల్లకల్లోలమైన ఊహలొస్తాయి నాకు. సో...ఇదో జబ్బు కాదంటారా?

    ReplyDelete
    Replies
    1. "అందమైన ఊహలు రావటానికి అంతే అందమైన మనస్సుండాలేమో అనిపిస్తుంది.
      అల్లకల్లోలమైన ఊహలొస్తున్నాయి నాకు.
      సో...ఇదో జబ్బు కాదంటారా?"

      మీవి ఆరోగ్యకరమైన ఊహలు మెరాజ్ గారు! సమాజం లో మీరు కోరుకునే మార్పు మీ రచనల్లో రాస్తుంటారు. అవి ఎంతో గొప్పగా ఉంటాయి. అందుకే అవి చదువుకుని హృదయపూర్వకంగా అభినందిస్తుంటాము. కొందరు అందమైన ఊహల ఐడియలిస్టిక్ జీవితాన్ని కోరుకుంటారు.

      ఊహ ఏదైనా మంచిదే .... ఒకరికి కీడు కలిగించనంతవరకూ ....

      ఒక చక్కని అభినందనగా మీ స్పందనను చూస్తున్నాను.
      నమస్సులు మెరాజ్ ఫాతిమా గారు!

      Delete