Thursday, February 6, 2014

అది ప్రేమేనేమో ....?




 












నిదురించాలనే విఫల ప్రయత్నం ....
నిశ్చల సమాధి లో తపస్వి లా,
నీ ఎద లో,
నిదురెరుగని ఆ నిశ్శబ్ద స్మశానం లో,
పరావర్తనం చెందని ....
ఆ కాంతి రహిత ప్రస్థానం లో,
అల్లుకునున్న ఆ చీకటి పొగమంచు ముసుగులో,
నిద్దురలో .... 


 










ఎవరో .... గీసి సృష్టించిన రూపాన్ని లా,
పూసిన చిత్రవిచిత్ర రంగుల కలయికను లా,
ఆ నక్షత్ర కిరణాల వడపోసిన కాంతిని లా,
వెండి వెన్నెల మెరుగుని లా కావాలని,
సుగంద పుష్ప వృక్ష విశేష లతనులా,
బూడిద రంగు సంరక్షణ కవచంను లా ....
ఏ జీవన అర్హ అనర్హాలను విశ్లేషించని,
కేవలం నీ గురించిన భావనలతోనే అల్లుకునున్న
అనురాగ సారం ను లా, నీ నీడనులా,
నీవు, నన్నూ ....
నా లోని ప్రకాశకతత్వం ను కప్పేసినట్లు,
విచక్షణా జ్ఞానం ను కోల్పోయి ....
నా ప్రాణం, ఆత్మ, ఆలోచనల పరిబ్రమణం
నీ చుట్టే కావడం ను, ఆకర్షణే అని అనుకోలేమేమో?

10 comments:

  1. నా ప్రాణం, ఆత్మ, ఆలోచనల పరిభ్రమణం
    నీ చుట్టే కావడం ను, ఆకర్షణే అని అనుకోలేనేమో?
    అది ప్రేమే ...ఖచ్చితంగా ప్రేమే చంద్రగారు.

    ReplyDelete
    Replies
    1. నా ప్రాణం, ఆత్మ, ఆలోచనల పరిభ్రమణం
      నీ చుట్టే కావడం ను, ఆకర్షణే అని అనుకోలేనేమో?

      అది ప్రేమే! ఖచ్చితంగా ప్రేమే .... చంద్రగారు.
      ఒక చక్కని ఆస్వాసన అభినందన స్పందన
      ధన్యవాదాలు శ్రీదేవీ!
      సుప్రభాతం!!

      Delete
  2. ఎంత ఆశావాహమైన,మదురమైన ఆలోచనో కదా,,,
    చాలా బాగుంది భావం సర్ జి.

    ReplyDelete
    Replies
    1. ఎంత ఆశావాహమైన,మదురమైన ఆలోచనో కదా ....,
      చాలా బాగుంది భావం సర్ జి.

      చాలా బాగుంది స్పందన, ఒక చక్కని స్నేహ ప్రోత్సాహక అభినందన
      ధన్యాభివాదాలు మెరాజ్ ఫాతిమా గారు!
      శుభోదయం!!

      Delete
  3. అవును ప్రేమే..
    చాలా బాగుంది చంద్రగారు.

    ReplyDelete
    Replies
    1. అవును ప్రేమే ....
      చాలా బాగుంది చంద్రగారు.

      నా బ్లాగుకు స్వాగతం హిమజ ప్రసాద్ గారు!
      ఒక మంచి స్పందన, స్నేహ ప్రోత్సాహక అభినందన
      నమస్సులు హిమజ ప్రసాద్ గారు!
      శుభ ఉషోదయం!!

      Delete
  4. Vemula Chandra gaaru, chaalaa baagundi. Really superb:-):-)

    ReplyDelete
    Replies
    1. వేముల చంద్ర గారు, చాలా బాగుంది. రియల్లీ సూపర్బ్:-):-)
      ఒక చక్కని స్పందన స్నేహ ఆత్మీయాభినందన
      ధన్యవాదాలు కార్తీక్(ఎగిసే అలలు) గారు!

      Delete
  5. ప్రేమనంతా పదాల్లో కుమ్మరించి మళ్ళీ ప్రేమేనేమో అంటూ డౌట్ ఏంటండీ :-)

    ReplyDelete
    Replies
    1. ప్రేమనంతా పదాల్లో కుమ్మరించి మళ్ళీ ప్రేమేనేమో అంటూ డౌట్ ఏంటండీ :-)
      చక్కని సంశయం
      సమాధానం తెలిసీ పదే పదే ప్రశ్నించుకుని సంబరపడటం, "నేను నిన్ను ప్రేమిస్తున్నా!" అని చెప్పిన విషయాన్నే మళ్ళీ మళ్ళీ చెప్పుకోవడం .... ఒక్క ప్రేమ లోనే సాద్యం అని చక్కని ప్రేమ సాహిత్యం రాసే మీకూ తెలుసు!
      బాగుంది స్పందన స్నేహ ప్రోత్సాహక అభినందన
      నమస్సులు పద్మార్పిత గారు! శుభారుణోదయం!!

      Delete