Monday, February 17, 2014

అయిష్టం



 













నా భావనలు, నా మానసిక స్థితి
నాకెంతో అయిష్టం!
ముఖ్యంగా
నేను నీ సమీపం లో ఉన్నప్పుడు ....
సరైన మాటలు ....
పెగలని
ఆ తడబాటు
నా ఆలోచనల్లానే, నేనూ అస్తిరంగా అలా
విచలితుడ్నౌతుండటమూ,
నా మీద నాకే అసహ్యం!
నాకు నేను పరధ్యానం లో
ఉన్నాననిపించడం ....
నవ్వుతూ నువ్వు ఎదురుపడిన ప్రతిసారీ
నీ సమక్షం లో
నిలబడలేని ఆ స్థితిని .... ఊహించలేను.
నా గుండె హెచ్చించిన వేగంతో
కొట్టుకోవడం .... భారం గా ఉంటుంది.
అనుకోకుండా,
ఎప్పుడైనా నీ చెయ్యి తగిలితే
విధ్యుత్తు తగిలినట్లు పక్కకు జరిగి
వెర్రిముఖం వేసుకుని
వెంటనే సర్దుకుంటుంటాను.
నా మది, ఎదలకు తెలుసు
అది ద్వేషభావన కాదు, నీ పై ప్రేమ ఆని
ఆ వాస్తవం గుర్తించిన ప్రతిసారీ 
నన్ను నేను ద్వేషించుకుంటుంటాను.

6 comments:

  1. ఓ మనిషి తన పరిదిని దాటక పోవటం, ఆతనిలో ఉన్న సంస్కారమూ కావచ్చూ, పెరిగిన వాతావరణమూ కావచ్చుఅయితే తాను మనసుపడే వ్యక్తి ఎదురుగా తన భావాలను ప్రకటించలేకపోవటానికి ఎన్నో కారణాలుంటాయి. అది ఆత్మ నిందకు దారితీయకూడదు,
    సర్, ఓ కొత్త దారిలో ఆలోచించగలిగే మీ కవితలు యువతకు తమను తాము ఆత్మవిమర్శకు లోనుచేస్తాయేమో...,

    ReplyDelete
    Replies
    1. ఒక మనిషి తన పరిదిని దాటక పోవటం, ఆతనిలో ఉన్న సంస్కారమూ కావచ్చూ, పెరిగిన వాతావరణమూ కావచ్చు .... అయితే తాను మనసుపడే వ్యక్తి ఎదురుగా తన భావాలను ప్రకటించలేకపోవటానికి ఎన్నో కారణాలుంటాయి.
      అది ఆత్మ నిందకు దారితీయకూడదు,
      సర్, ఓ కొత్త దారిలో ఆలోచించ గలిగించే మీ కవితలు యువతకు తమను తాము ఆత్మవిమర్శకు లోనుచేస్తాయేమో ....,

      ఒక గొప్ప కాంప్లిమెంట్ మీ స్పందన. మీరన్నట్లు నిజంగా యువత తమను తాము సహచరి సమక్షం లో ఆత్మవిమర్శకు లోనైతే .... నా ఈ భావనలకు, ఈ అక్షరాలకూ అది ఒక అమూల్య పురస్కారమే! సంస్కారం ఆత్మ నిందకు దారి తీయకూడదు అన్న మీ సూచనను గుర్తుంచుకుంటాను.
      నమస్సులు మెరాజ్ ఫాతిమా గారు!

      Delete
  2. అవ్వన్నీ ఏమో కానీ మీరు రాసే పదం నాకిష్టం.

    ReplyDelete
    Replies
    1. అవ్వన్నీ ఏమో కానీ మీరు రాసే పదం నాకిష్టం.
      సంతోషాన్ని కలిగించే స్పందన .... అభినందన
      ధన్యవాదాలు పద్మార్పిత గారు! శుభోదయం!!

      Delete
  3. ఆ వాస్తవం గుర్తించిన ప్రతిసారీ
    నన్ను నేను ద్వేషించుకుంటుంటాను.
    ద్వేషించుకుంటే ఎలా,ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవాలిగాని,
    ఇంతటి సంస్కారం ఉన్న వ్యక్తి కాబట్టే ఆమె దగ్గరయిందేమో,
    చంద్రగారు బాగుంది ఓ సంస్కారవంతుని ప్రేమించే హృదయం.

    ReplyDelete
    Replies
    1. ఆ వాస్తవం గుర్తించిన ప్రతిసారీ నన్ను నేను ద్వేషించుకుంటుంటాను.
      ద్వేషించుకుంటే ఎలా, ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవాలిగాని ....
      ఒక అమ్మ, ఒక ఆడబడుచు మందలింపు లా .... ఉన్నత సంస్కారం .... స్పందన లో

      ఇంతటి సంస్కారం ఉన్న వ్యక్తి కాబట్టే ఆమె దగ్గరయిందేమో,
      కావొచ్చు శ్రీదేవీ!

      చంద్రగారు బాగుంది ఓ సంస్కారవంతుని ప్రేమించే హృదయం.
      ధన్యవాదాలు శ్రీదేవీ!

      Delete