Sunday, February 9, 2014

తొలి అడుగు



 














కప్పుకునున్న చీకటి దుప్పటి
మడతలు విప్పి
కలల్ని భద్రంగా ముడిచి దాచుకుని
ఆవహించిన
పొగమంచు బద్దకం విరిగిపోతూ
మరో ఉదయం
ఆత్మ ఆవిష్కారం
నీడలు, ప్రతిధ్వనులు నిశ్శబ్దంగా సర్దుకుంటూ,

ఆర్బాటం లేకుండా
ఆ తూరుపు .... సుదూరపు కొండల్లోంచి,
చైతన్య కిరణాలు కదిలి వస్తూ,
ఆకుల అంచులపై మెరుస్తూ మంచు బిందువులు
చిరునవ్వుతో పలుకరిస్తూ
పల్లవించి పరిమళించి రాలిపోబోతున్న
ఆ ఎర్రని గులాబీ రేకులు ....
అనిర్వచనీయమైన ఒక అందమైన భావన
జీవన లక్ష్యాన్ని ప్రబోధిస్తూ

కన్నీళ్ళు కారుతున్నాయి. 
ఎద లోతుల్లోంచి .... ఊటై ఊరుతూ
ఆనందం అశృ పొరలు అడ్డొచ్చిన
పరిసరాలు మసకమసగ్గా మారి
ప్రేమ భావనలేవో ప్రబలమౌతూ
రెక్కలు విప్పుకుని
గుండె స్పందనల్ని పొదువుకుని .... ఈ ఆత్మ
ఒక అందమైన సీతాకోకచిలుక లా

4 comments:

  1. జీవితాన్ని పూల రేకులతో పోల్చిన సున్నిత సాహిత్యాన్ని చూశానీరోజు.
    సుప్రభాతంగా అనిపించింది. మరో..కృష్ణ శాస్త్రి(అతిశయోక్తి కాదు ) కనిపించారు.

    ReplyDelete
  2. జీవితాన్ని పూల రేకులతో పోల్చిన సున్నిత సాహిత్యాన్ని చూశానీరోజు.
    సుప్రభాతంగా అనిపించింది.
    మరో .... కృష్ణ శాస్త్రి ( అతిశయోక్తి కాదు ) కనిపించారు.
    జీవితం ను నందనవనముగా మార్చుకుందుకు మనిషి పడే తపన, ఆరాటం, ఒక వొలికిన ఆవేశం అనే కన్నా సాటి మనిషి భావనల్లో ఔన్నత్యాన్ని ప్రశంసించే కవయిత్రుల స్నేహ హస్తం అందుబాటులో ఉంటే .... ఎందరో కృష్ణ శాస్త్రులు .....
    అంత గొప్ప మహనీయుడ్ని జ్ఞప్తికి తెచ్చిన మెరాజ్ గారికి మనోభివాదాలు.

    ReplyDelete
  3. ఎంతో అహ్లాదకరమైన శుభోదయం మీ కలం నుండి జాలువారింది

    ReplyDelete
    Replies
    1. ఎంతో అహ్లాదకరమైన శుభోదయం మీ కలం నుండి జాలువారింది.
      మాయావిశ్వం గారు నా బ్లాగు కు స్వాగతిస్తూ మీ చక్కని ప్రోత్సాహక అభినందన కు ధన్యాభివాదాలు! శుభోదయం!!

      Delete