Wednesday, May 1, 2013

నీ ఆత్మ భావాన్ని .... నేను!


స్వేదం కరగడం
విసిరే వర్షంలో తడవడం
కాళ్ళు బురదలో కూరుకుపోతూ లాక్కోవడం నా ఆనందం

సంక్లిష్టత ఉండి, చాకచక్యంగా బయటపడాలనుకునే ఆశావాదం నాది.
ఎవరూ ఇష్టపడని దేన్నో మోసెయ్యాలని ....
ఏదో అద్భుతం నా ద్వారా జరిగిపోవాలని .... ఆశ!

నావి విపరీతపు ఆలోచనలంటుంటారు అందరూ 
చెడు వార్త విన్నప్పుడు నాలో ఉత్సాహం ....
బాధ, విచారం అనుభూతి అనిపించి మాత్రం కాదు.

అది శుభవార్త గా మార్చేందుకు నేనెందుకు కారణం కాకూడదని
అవకాశం చేజిక్కించుకుని సాధించొచ్చుగా అని
నిజం! .... అందుకే వర్షం వర్షిస్తేనే నాకిష్టం!

నీ బాధలు కష్టాలను గుమ్మరించు .... నా ముందు, నా మీద
నాకెంతో ఆనందం .... కష్టాలను ఎదుర్కుని, సహాయం చేసి
నీ కళ్ళల్లో కాంతుల్ని విజయోత్సాహాన్నీ చూడటం!

నాకు .... ఎంతో ఇష్టం! వర్షంలో తడవడం, తల భారం పెంచుకోవడం
తప్పుదారిన ఎవరైనా వెళుతుంటే సరైన దారి చూపించడం
మార్గదర్శకుడ్ని కావడం! మంచి వైపు మార్గం చూపాననే అనుభూతి .... నాకెంతో ఇష్టం!

మొన్నటి మధుర గీతాలు
బాధాతప్త హృదయ రాగాలు
నాకెంతో ఇష్టం! .... కురుస్తున్న కష్టాల్లో మునకెయ్యడం!

చీకటుంటేనే నవ్వాలని
చీకటి నల్లదనాన్ని చెదరగొట్టడంలో
సౌకర్యం ఆనందం ఉందనుకునే వేదాంతం నాది.

నిజం! నాకు చీకటిని చెదరగొట్టే
చిరునవ్వు కాంతిలో మునగడం ....
కష్టాలు బాధలు వర్షంలో తడవడం ఇష్టం!

నా ఆశయాలు నా పోరాటం నా ఆవేశం గురించి
తెలుసుకోవాలని ఉందా! నీలోనే ఉన్నా .... నేస్తమా!
నేను, లోతైన నిరాశావాదానికి ముక్కుతాడేసి స్వారీ చెయ్యాలనుకునే రౌతును.

ఎవరి కష్టాలైనా గుమ్మరించేసుకుని
పోరాడటంలో ఉన్న ఆనందాన్ని చవిచూడాలనుకునే
నీలోని మరో మనిషి అంతర్మధనాన్ని .... నేను.

2013, మే 01, బుదవారం రాత్రి 9.20 గంటలు

2 comments: