Thursday, May 9, 2013

అమ్మా!


నేను పడిపోయి
మోకాలు కొట్టుకుపోయినప్పుడు
నీ మది రోధించడం
స్కూల్లో ఆటల్లో గెలిచినప్పుడు
నీవు ఆనందించడం
జారిపడ్డప్పుడు లేపి గుండెలకు హత్తుకోవడం
ప్రతిరోజు నా సంతోషం కోసం
నాతో ఆటలాడటం నాకింకా గుర్తుంది.

గర్బంలో ఘాడనిద్రలో నిదురించే నన్ను
ఈ ప్రపంచం లోకి తెచ్చి
వెలుగును ప్రసాదించి
భవిష్యత్తును అందంగా దిద్ది
నా కష్టంలో స్వేదానివై
నా బాధల కన్నీటివై
నా చిన్న ప్రపంచంలో నేనెరిగిన
తొలి అప్సరసను నిన్నింకా మరిచిపోలేదు.

అమ్మా!
నీ ఆశల
అమృత రూపాన్ని నేను.
నీ ఆశీర్వాదపు పాదు మొక్కను
నీ ప్రార్ధనల పూజల కృషి ఫలితం ....
విజయకేతనం .... నేను!
అమ్మా!
నీ పట్ల నా ప్రేమ
కాలం కొలవలేదు .... ఏ బ్రహ్మా విడమర్చలేడు! .... అమ్మా!


No comments:

Post a Comment