Saturday, September 6, 2014

భయాన్ని జయించనిదే



కదలలేము.
కంటినిండా కునుకుండదు
భయాన్ని పారద్రోలకపోతే ....
నీరసపరచి
నిశ్చేష్టుల్ని చేసి
ప్రతి పనిలోనూ జోక్యం చేసుకుని
పులుముకుపోయే
ఏ అడవి పూ పరిమళమో భయం,


అతి ప్రమాదకర తడబాటు,
ఘోర,
అమిశ్రమ లక్షణం
అస్తిత్వ
వ్యక్తిత్వ నాశని,
తాడుపామై
నీడ మృత్యువయ్యే భావన
భయం ....


మూడొంతుల జీవితం
అందరిలోనూ
మురికి
అసహ్య అనుభవాలమయం
గతం, వర్తమానం ....
భయం భూతం
ఆత్మస్థైర్యం
నమ్మకం దూరమై
అర్ధం తెలియని నిర్దయ భయం


భయమే
నిన్నూ, నన్నూ, అందరినీ ....
తెరచాటునుండి
అశక్తుల్ని అచేతనుల్ని
దోషుల్ని చేస్తుంది ....
అధిగమించి పోరాడని జీవాల్ని.
అందుకే
జీవించేందుకు
అవసరం .... భయం పై జయం

No comments:

Post a Comment