Thursday, September 25, 2014

నీటిపై రాతలు


అసత్యాల బోనులో
రహశ్యాల నీడలో నివాసం చేస్తూ
ముక్కలైన సరళత
నిలకడలేని ఆలోచనలతో
అంతరంగంలో లోలో .... సంచరిస్తూ
ఎదురుపడిన
పారదర్శకత లేని నవ్వులు,
భయానకమైన నిట్టూర్పులు
ఆరంభ వికృత మనశ్చిత్రం తో
సత్య దాపరికం, మోసపుటాలోచనల
వాంతులు
జీవితంలో విముక్తిని పొందాననుకోను.
శిక్షే అనుకుంటాను.


శరీరం గడ్డకట్టిన చల్లదనం
మసక మసక పరిసరాలు 
జన్మలు యుగాలు గడిచి
నేను మాత్రం మారనట్లు
నా ఉనికి మారనట్లు 
వర్ణంతప్పిన కలల్లోనే
నేనింకా విహరిస్తున్నట్లు
ఆత్మ గౌరవం అనర్ధమై ....
బాధ, విషాదాల నీడలు
నన్ననుసరిస్తూ ....
నా రక్తంలో దిగులు లక్షణాలు ప్రవహిస్తూ
నేనేనాడో చచ్చ్చిపోయినట్లు,
ప్రేమించబడకుండానే

No comments:

Post a Comment