Wednesday, September 3, 2014

ప్రియ భావమా .... వెళ్ళిపో దూరంగా


చీకటిలో
తోడెవరూ లేని రహదారిలో
ఒంటరినై
కల కంటున్నట్లుంది.

ఏది తప్పో ఏది ఒప్పో
రహదారి ఎటు తీసుకు వెళుతుందో
ఎంతవరకు వెళతానో ....
అసహనం మదిలో

నీవు నా మది వాకిలిలో
ఆలోచనల కళ్ళాపీవై
తుడిచి వెయ్యలేను.
మరిచిపోలేను

మదిపొరల్లో
జ్ఞాపకాల పునాదుల్లో
తిష్ట వేసి పాతుకుపోయావు మూలానివై
గమనించినా కదిలించలేను.

అంతా
అయోమయం, అంధకారమే
ఉక్కిరిబిక్కిరైపోతూ
దిక్కుతోచని ప్రయాణమే


నా జీవితం
నా ఇష్టం ప్రకారం
ఒద్దికగా క్రమశిక్షణతో
నడుచుకోవాలనుంది.

అందుకు,
నీ సహకారం కావాలి.
దయచేసి నా మది పొరలను
నీవు ఖాళీ చెయ్యాలి.

నీకు ఎలాంటి భావనలూ లేవని తెలిసింది.
నీలో కరుణ లేదని అర్ధం అయ్యింది.
అందుకే, ఈ రాత్తిరి
ఈ రహదారిలో ఇలా ఒంటరిగా ..... నేను,

ఏదో పట్టుదల
నిన్ను దూరంగా తరిమెయ్యాలని
నా బాధలు
నా కన్నీళ్ళు నేనే తుడుచుకోవాలని

నీవు నన్ను అలా
నిశ్చేష్టుడ్ని, వొంటరిని చెసి వెళ్ళిపోయేప్పుడు
బహుశ నేను కనిపించలేదేమోనని
ఏ నీడలానో ఉండుంటానని సరిపెట్టుకోలేను.


సామాజిక కర్తవ్యోన్ముకుడ్నైనా అయ్యేందుకైనా
నా జ్ఞాపకాల్లో, ఆలోచనల్లో ఎక్కడో ....
అక్కడి నుంచి కూడా నన్నొదిలి వెళ్ళిపో
నీవు మదిలో ఉన్నంతకాలం నాకు ఊపిరాడదు.

నా జీవితాన్ని నేనుగా నడవనీ
నా ఆలోచనలకు అందనంత దూరంగా వెళ్ళిపో
ఈ ఒంటరి రహదారిలో
స్వీయ ఆలోచనలతో ఒంటరిగానే నన్ను నడవనీ

నీ జ్ఞాపకాల గతం .... ప్రేమ భావనలు
నన్ను చెదలా తినెయ్యక మునుపే
బ్రతకాలనుకుంటున్న నన్ను నన్నుగా బ్రతకనీ
ఇప్పటికైనా నా ఆలోచనల్లోంచి .... వెళ్ళిపో దూరంగా

2 comments:

  1. కొన్ని చోట్ల భావం రిపీట్ అయ్యింది . సరిచేసుకొంటే మంచిది .

    " నీ జ్ఞాపకాల గతం .... ప్రేమ భావనలు
    నన్ను చెదలా తినెయ్యక మునుపే
    బ్రతకాలనుకుంటున్న నన్ను నన్నుగా బ్రతకనీ
    ఇప్పటికైనా నా ఆలోచనల్లోంచి .... వెళ్ళిపో దూరంగా "

    చాలా బాగుంది .

    ReplyDelete
    Replies
    1. కొన్ని చోట్ల భావం రిపీట్ అయ్యింది . సరిచేసుకొంటే మంచిది .

      " నీ జ్ఞాపకాల గతం .... ప్రేమ భావనలు
      నన్ను చెదలా తినెయ్యక మునుపే
      బ్రతకాలనుకుంటున్న నన్ను నన్నుగా బ్రతకనీ
      ఇప్పటికైనా నా ఆలోచనల్లోంచి .... వెళ్ళిపో దూరంగా "

      చాలా బాగుంది. .

      చక్కని స్పందన సూచన స్నేహ ప్రోత్సాహక అభినందన
      నమస్సులు శర్మ గారు! శుభమధ్యాహ్నం!!

      Delete