Wednesday, April 10, 2013

ఒంటరిగా పుట్టాను .... ఒంటరిని నేను!


నిర్మానుష్యమైన రహదారి లో
ఒంటరిగా నేను .... గమ్యమెటో తెలియటం లేదు
భూమి ఆకాశాలు ఆశ్చర్యంగా నన్నే చూస్తున్నట్లు .... భావనలు
నేను ఒంటరిని .... ఎందుకని? అని ప్రశ్నల వర్షం!
ఇదే తంతు ..... గత కొన్నేళ్ళుగా
సూర్యుడి తో పోటీ నా పయనం .... మండే ఎండ నా నేస్తం
వడగాలులు వీస్తూ, వెన్నులోంచి చెమటలు చిమ్ముతూ
ఒంటరిగా నేను .... ఒంటరితనం నా చుట్టూ వలయంలా
ఎవరో పిలుస్తున్నట్లు .... నా ఇంటికే నేను వెళుతున్నట్లు
జీవితం ఖర్చు అయిపోయి, బట్టలు చిరిగి
అఘాదాల్లోకి నమ్మకం జారిపోయి
బురదలో బుడతడి లా,
విశ్వాసం కోల్పోయి ....
ఆత్మన్యూనతాబావం .... నేను,
నా గమ్యం రహదారి అంతాన్ని చేరుతున్నా!
నా కెవ్వరూ లేరు .... ప్రేమించేందుకు స్నేహించేందుకు
ఒంటరిగా నేను .... ఒంటరితనం నన్ను మింగేస్తూ
నా భావనల్లో నాకదే పుట్టిల్లు
అంతిమ ధర్మం శ్మశానానికి మరో ఏడాది దగ్గరౌతూ ఉన్నా!

No comments:

Post a Comment