Tuesday, April 9, 2013

అంతే తేడా!


ఎప్పుడూ అంటూ ఉండేవాడ్ని నా ఉద్దేశ్యం వేరని
కానీ అదే నిజం
నా మనోభావాలు నీకెక్కడ కనిపిస్తాయో అని బెట్టు
చాలా కష్టం నీకైనా అర్ధం చేసుకోవడం

నా కళ్ళచుట్టూ ఇప్పటి ఈ నల్లని మరకలు
నిజం! వదులుకోలేకపోయిన అభిమానం గురుతులు.
నొప్పిని, తపనను, తియ్యని బాధను
మందు ఉపశమనంలో ఆనందానికి అడ్డిక్ట్ ను అయ్యి

ఇప్పుడు చెప్పు! నా ఎద మరకలు దాయమంటావా
సరే! నీకు, నీవు పరిచయం చెయ్యబోయే నీ స్నెహితులకు
నీ తల్లిదండ్రులకు, మన ఈ సమాజానికి
నా ఎద భావాలు కనబడకుండా దాయమంటావు .... అంతేగా!

నీ ఆలోచనల్లో, నీ మాటల్లో నేనో గందరగోళాన్ని
అది నిజం కాదని నీకూ తెలుసు
ఆలశ్యం చేసాను .... ఒప్పుకుంటాను.
నేను పచ్చాత్తాపం పడే సమయం దాటిపోయింది

నీవు నన్ను నన్నుగా చేరదియ్యగలిగే స్థితి కాదు నీదిప్పుడు
కొన్ని జీవితాల బాధ్యత నీమీదుందిప్పుడు
నా కథ ఏదో విధంగా ఎలాగూ ముగియబోతుంది.
ముగియనియ్యొచ్చుగా .... వీడ్కోలు చెప్పొచ్చుగా!

నీ స్నేహితుల్తో, నీ సమాజంలో సంతోషంగా సహవసించు
మనస్పూర్తిగా చెబుతున్నా!
వెళ్ళు! నాకు దూరంగా వెళ్ళిపో! 
నేననే వ్యసనపరుడ్ని నీవెరుగని భావదూరాల తీరాలకు వెళ్ళిపో!

నేను ఎప్పుడూ అంటుండేవాడ్ని అదుపుతప్పనని
అది నిజం కాదు!
చేసేప్పుడు నాకు తెలుసు నేను ఏమి చేస్తున్నానో
నీవే నావద్దకు రావాలనే అహంకారం దురబిమానం

ఈ మత్తుకు నేను దేవదాసును
ఈ అలవాటుకు ఓ కారణం చెప్పుకుంటున్నాను
ఆనాడు నా సాహచర్యం నా ప్రేయసికి అవసరం అని తెలిసిన్నాడు
అలక్ష్యం, ఆలశ్యం చేసాను సహచరుడ్నని చెప్పడానికి .... కనుక అని
 
అర్ధం అయ్యి
నిన్ను దూరం చేసుకున్న నాటి నుంచి
భ్రమలో బ్రతుకుతున్నాను
మత్తులో మునిగి నిన్ను ప్రేమించట్లేదనుకుంటూ

నీతో కూర్చుని సిగ్గు విడిచుంటే బాగుండేదని
అప్పుడప్పుడూ మనసు ఎదురుతిరుగుతుంటుంది.
ఆలశ్యం, అలక్ష్యం చేసావు .... లివర్ పాడయ్యేంతగా! ఎందుకూ అని
ఇప్పుడు సమయాన్ని నన్నూ చంపుకుంటున్నాను .... అంతే తేడా!

2013, ఏప్రిల్ 10, బుదవారం ఉదయం 5.40 గంటలు

No comments:

Post a Comment