Friday, May 13, 2016

కలువభామ


ఒడ్డున కూర్చుని
కొలనులోకి చూస్తుంది .... ఆమె
కన్నీటి కొలనులయ్యాయి
ఆమె కళ్ళు

ఎన్నాళ్ళి లా
ఈ ఎదురుచూపుల
ఈ నరకయాతనల
ఆవేదన అని

అప్పుడే
అటుగా వెళుతూ ఉన్న
పిల్లగాలి అల ఒకటి ఆగి
ఆమె భుజాన్ని తట్టింది.

చిరు ఓదార్పు విసురు
స్పర్శతో ....
అతని స్పర్శలా
గోరు వెచ్చదనాన్నిస్తూ

ఔనూ ఎందుకిలా?
ఎందుకు
ఈ ఏకపక్ష మనోభావన
ఈ ప్రేమ

అనాసక్తతను
ఆసక్తి గా
తియ్యని బాధను
తీరని అనుబంధం గా మారుస్తూ 

No comments:

Post a Comment