Friday, June 10, 2016

భవదీయుడుని




నిన్ను సంతోషంగా చూడటం నా అభిమతం అని నీకూ తెలుసు.
నీవు గుర్తించి గమనించనట్లు తల పక్కకు తిప్పుతుంటావు.
నీవు ఎప్పుడూ కననట్లున్నా .... నా విన్నపాలు, మొరలను
కలలా జరిగినా చాలు అని సంభరపడుతుంటానని,

నాకు తెలుసు, నీవు ఉత్తమురాలివి అని, నేను తగను ....
నన్ను మించిన గొప్ప వ్యక్తిత్వాన్నే నీవు పొందగలవు అని
అయినా బతిమాలుకోవాలనిపిస్తుంది, ఎందుకో ....
నీవు ఆనందంగా ఉంటే చాలు ఆనందంగానే ఉండాలి అనిపిస్తూ

నీ ఆనందం కోసం నేను నా ఆనందం కోల్పోవాల్సొచ్చినా సరే
నేను నీ వాడిననుకోవడంలోనే నా ఆనందమంతా ఉంది అనిపిస్తుంది.
ఏ కారణం వల్లనైనా నీవు నన్ను కోరుకోకపోయినా ....
నేను మాత్రం నిన్నిలా ప్రార్ధిస్తూనే ఉండాలనిపిస్తూ,

నా కంటే ఉత్తముడు ఎవరైనా చేరువకావొచ్చు అనిపించినా
ఎందుకో తెలియదు నీ కోసం, నీ ఆనందం కోసం పోరాడాలనుంటుంది.
అందులోనే నా మానసిక శాంతి సంతోషమూ ఉన్నాయనిపిస్తూ ....
నీ మది మాటల్లో నన్ను వినాలనుంటుంది.

నిజం! మనోజ్ఞి .... మానసీ
నీ ఎద స్పందనల కారణాన్నయ్యి
నీ మనోహరుడ్నై, అతి గొప్ప అదృష్టవంతుడ్నై ....
నీ జతను అవ్వాలని, కాలాంతం వరకూ

No comments:

Post a Comment