Tuesday, October 15, 2013

సమాజానికి భారం!


నమ్మకం
అంద విశ్వాసం
యుద్ధ భూమిలో
ప్రతి ఆత్మా
ఒక సైనికుడే!
సమాజం భారం తగ్గించేందుకు
పోరాడుతూ
అపరాధ భావన్ని తుడిచి వేచేందుకు. 

పిల్లలకు
సోదాహరణంగా ....
నేర్పించొచ్చు!
ఏ మత దురభిమానాన్నైనా,
ద్వేషం బీజాలు
కాలిన బూడిద గ్రందాల పై ....
అభిరుచిని పెంచే,
ఒక వ్యర్ధ ప్రయత్నం చెయ్యొచ్చు!

ఒక్కో రోజు,
ఒక్కో మతం పెద్దలు
ప్రపంచాన్ని ....
మతపరంగా విభజించి,
బానిస్త్వం నుంచి
ఆ దేవుడ్నే విడుదల చేసినట్లు, 
అప్పుడు, అప్పుడు మాత్రమే ....
అందరికీ విమోచనం కలిగినట్లు.

2 comments:

  1. చెయ్యోచ్చు కానీ ఎలా, పెద్దలంతా చిన్నబొతున్నారుగా.
    పిల్లలకి పనికి వచ్చే ఎన్నో చిక్కు ముడులు పెద్దలు విప్పవచ్చు.
    భాషని అవమానించి, లెక్కలకీ, వాటివల్ల వచ్చే గొప్పలకీ కొలతలు పెడుతున్న బడులలో తెలుగు పంతుళ్ళమైన మేము భాషని కుదించి కేవలం ప్రశ్నా పత్రాలకే అంకితం చేసి, వారికి భాష పట్ల ప్రస్నార్దకం గా మిగిలి పోతున్నాం.
    మన్నించాలి మీ కవితకు ఇది కాదేమో నేను స్పందించాల్సిన విదానం.

    ReplyDelete
    Replies
    1. "చెయ్యోచ్చు కానీ ఎలా, పెద్దలంతా చిన్నబొతారుగా. పిల్లలకి పనికి వచ్చే ఎన్నో చిక్కు ముడులు పెద్దలు విప్పవచ్చు. భాషని అవమానించి, లెక్కలకీ, వాటివల్ల వచ్చే గొప్పలకీ కొలతలు పెడుతున్న బడులలో తెలుగు పంతుళ్ళమైన మేము భాషని కుదించి కేవలం ప్రశ్నా పత్రాలకే అంకితం చేసి, వారికి భాష పట్ల ప్రశ్నార్దకం గా మిగిలి పోతున్నాం.
      మన్నించాలి మీ కవితకు ఇది కాదేమో నేను స్పందించాల్సిన విదానం."

      మీ ఆవేదన మీ స్పందన లో చాలా స్పష్టంగా చెప్పారు. విద్యా విధానం లో మౌలికం గా మార్పులు వస్తేనే మీ లాంటి ఎందరి కృషి కి ఫలితం ఉంటుంది.
      మంచి విశ్లేషణ.
      ధన్యాభివాదాలు ఫాతిమా గారు! సుప్రభాతం!!

      Delete