Tuesday, October 15, 2013

మారుతున్న జీవితాలు

యౌవ్వనం లో పిల్లల అస్తిత్వం
ఊహలు వురకలు వేసే చైతన్య ఆలోచన
లు
ఒక ఉడుకు మది లక్ష్యం
పసి ఆవేశం అనుకోలేము.
యువత ప్రతి నిర్ణయమూ ఒక తొందరపాటని,
శ్వాస....ను బంధించినట్లు బంధించి, నిబద్దించాలని చూడటం
నిన్నటి కట్టుబాట్ల ఆలోచనల చట్రం లో ....
అది, ఒక అభద్రతాభావన!
అప్పుడు, మోదలౌతుంది.
మమకారం పిడికిలి నుండి
తప్పించుకోవాలనే పెనుగులాట.
ఒక పరిమళం లా,
ఒక భావుకురాలి హృదయం లో కవితలా,
ఒక ఆలోచన, ఒక ఆవేశం రగిలి
కిటికీలు మూసిన తలుపుల ఇంటి ....
పొగ గొట్టం లోంచి వచ్చే పొగలా
స్వేచ్చ ను పొంది, మారుతున్న జీవితాలు.

2 comments:

  1. గుండెను నియంత్రించలేని స్వేచ్చకన్నా,
    ఒంటరితనమ్లో ఆలోచనలను నియంత్రించే మనస్సు మిన్న.
    తరచి చూడండి తార్తమ్యం తెలుస్తుంది.
    కవిత బాగుంది సర్.

    ReplyDelete
    Replies
    1. "గుండెను నియంత్రించలేని స్వేచ్చకన్నా, ఒంటరితనం లో ఆలోచనలను నియంత్రించే మనస్సు మిన్న. తరచి చూడండి తారతమ్యం తెలుస్తుంది. .... కవిత బాగుంది సర్."
      అవును మెరాజ్ గారు! మొండిది ఎద, నియంత్రణుండదు. నియంత్రణున్న మది మనిషి వ్యక్తిత్వం లో కనిపిస్తుంది. మీ ఆలోచనతో ఏకీభవిస్తున్నాను.

      Delete