Tuesday, October 29, 2013

వడలిన పువ్వులం

అతను వొక మెరుపై వచ్చాడు.
అగ్నిలా దహించాడు.
ఎండిన కళ్ళతో రోదిస్తూ .... ఆమె
రక్తం వర్షమై కురిసింది.
అప్పుడు,
అతను పువ్వై విరిసాడు.
అతను వొక పిడుగై గర్జించాడు.
కటువు మాటల గునపాలు
గుండెలో దిగినట్లై,
జీవితం నరకతుల్యం,
ఇక చాలు అనుకుంది .... ఆమె.
కొనితెచ్చుకున్న నవ్వుల
పువ్వులు పరిచాడు .... అతను.
ప్రతి సారీ తప్పని తంతే ఇది,
జీవ రంగస్థలం పై ....
నాటకీయ అట్టహాసం చేస్తూ,

4 comments:

  1. చాలా బాగారాసారండి.

    ReplyDelete
    Replies
    1. "వడలిన పువ్వులం .... కవిత చాలా బాగా రాసారండి!"
      బాగుంది అభినందన స్పందన
      _/\_లు పద్మార్పిత గారు!

      Delete
  2. ప్రతి సారీ తప్పని తంతే ఇది,
    జీవ రంగస్థలం పై ....బాగుంది

    ReplyDelete
    Replies
    1. "ప్రతి సారీ తప్పని తంతే ఇది,
      జీవ రంగస్థలం పై ...."
      బాగుంది .... ఏకీభావన ప్రోత్సాహక మీ స్పందన.
      ధన్యవాదాలు సృజన గారు! నా బ్లాగుకు శుభాహ్వానం. శుభారుణోదయం!

      Delete