Thursday, October 10, 2013

ప్రేమ వృక్షం పువ్వులం


తప్పొప్పుల సరిహద్దులను దాటి, 
మురిపిస్తూ, మెరుస్తున్న
అద్భుత సౌందర్యం .... నా చెలి

చావు పుట్టుకలెరుగని
శ్వాస ను లా ఆమెతో కలిసి
ఆమెకు మాత్రమే వినిపించేలా .... నేను.

వెచ్చదనం, చల్లదనం
విడదీయలేని తడి, పొడీ లక్షణాలు
ఆమె పెదవి అంచుల మీద,
ఆమె స్పర్శ లో అనుభూతులు.

ఏ యుద్ధమూ, ఏ శాంతి ప్రస్తావన
అవసరం లేని, ఎవరూ
దొంగిలించలేని ప్రేమ అది.

పగలు, రాత్రులు .... ఒకేలా ఉండి,
అన్ని వేళలా సీతాకోకచిలుకలు
ఆటలాడే ఆ మనోబృందావనం లో,

ఆ .... సత్య అసత్యాల ఎడారిలో,
ఎప్పుడూ ఎండని ఆ ఒయాసిస్సు
ఆ అన్యోన్యతా సరోవరం, ప్రేమ లో
ఔనని కాదనే మొహమాటాలుండవు.

నా కళ్ళెదురు చంద్రబింబం
ఆమె ముఖం వెలుగులు ....
ప్రేమ, ద్వేషం లు లేని, గుండె వేగం పెంచే
స్వర్గ సౌరభాల పరిమళాలు.

అప్పుడే తెరుచుకుని మూసుకునే కళ్ళ కు
వికశిస్తున్న ఆమె అందం బంధం అయి
విత్తిన మా ప్రేమ వృక్షం పువ్వులమై
పదాలు, అందం ను మించిన .... పరిమళాలం కావాలని.

2 comments:

  1. ఒక అద్భుతమైన ప్రేమతత్వాన్ని చూస్తున్నాను నేనీ కవితలో,
    అదేవిదంగా కవి తన తలపులను క్రమానుగునంగా పేర్చలేకపొయానే నఏ తపన కనిపిస్తుంది.
    "ఆ .... సత్య అసత్యాల ఎడారిలో,
    ఎప్పుడూ ఎండని ఆ ఒయాసిస్సు
    ఆ అన్యోన్యతా సరోవరం, ప్రేమ లో
    ఔనని కాదనే మొహమాటాలుండవు." ఈ పలుకులు గొప్ప కావ్యానికి తీసిపోవు,
    నిష్కలమషమైన తన అభిమానాన్ని ప్రేమగా మార్చుకొవటం లో లేదా చూసుకొవటమ్లో కవి పడ్డ తపన కనిపిస్తుంది.

    ReplyDelete
    Replies
    1. "ఒక అద్భుతమైన ప్రేమతత్వాన్ని చూస్తున్నాను నేనీ కవితలో, అదేవిదంగా కవి తన తలపులను క్రమానుగుణంగా పేర్చలేకపొయానే అనే తపననూ చూస్తున్నాను."
      "ఆ .... సత్య అసత్యాల ఎడారిలో, ఎప్పుడూ ఎండని ఆ ఒయాసిస్సు .... ఆ అన్యోన్యతా సరోవరం, ప్రేమ లో .... ఔనని కాదనే మొహమాటాలుండవు." ఈ పలుకులు గొప్ప కావ్యానికి తీసిపోవు,"
      "నిష్కల్మష అభిమానాన్ని ప్రేమగా మార్చుకొవటం, చూసుకొవటం లో కవి పడ్డ తపన కనిపిస్తుంది. "
      స్పందించడం లోనూ మెరాజ్ ఫాతిమా గారిది ఒక ప్రత్యేక శైలే! ఒక గొప్ప స్పందన గా భద్రపరుచుకుంటాను.
      _/\_లు మెరాజ్ ఫాతిమా జీ!

      Delete