Saturday, October 19, 2013

నేనూ నా రాక్షసి

తలుపు తోసుకుంటూ లోపలికి వచ్చాను.

కిచన్ రూం లోంచి శబ్దాలు వినిపిస్తున్నాయి.

అడుగుల సవ్వడి చేస్తూ లోపలికి వెళ్ళాను.

కిచన్ ప్లాట్ ఫారం ముందు నిలబడి ఉంది సివంగి. ఒక చేతి లో చెక్క గరిట మరో చేతిలో చిన్న కత్తి ఉన్నాయి. స్టవ్ మీద గిన్నె ఉంది. గరిట తో గిన్నెలో తిప్పింది. రుచికరమైన వాసన గుప్పుమంది.
“కొత్త వంటకం లా ఉందే" అన్నాను. 

ఆమె నన్ను చూస్తూనే నా రాకను ఊహిస్తున్నట్లు చిరునవ్వు నవ్వింది.

నేనే ఉలిక్కిపడ్డాను "నేనొచ్చాను" అన్నాను గుర్తు చేస్తూ.
“ఏయ్ రాక్షసీ నిన్నే నేనొచ్చింది నీకు వంటలు చెయ్యడం రాకపోతే వంట సామానంతా తీసుకెళ్ళిపోదామని," అంటూ కుర్చీ ఒకటి లాక్కుని ఆమెకు దగ్గర్లో కూర్చున్నాను.

ఆమె కత్తి తో పచ్చి మిరపకాయల్ని తోటకూర కాడల్ని కట్ చేస్తుంది.
వెన్నను వేడి చేసి కరుగనిచ్చి ఉల్లి పాయల్ని విడదీస్తూ తన పని తాను చేసుకుపోతుంది.
సాటి స్త్రీలకు కూడా అసూయ కలిగించేలా ఆ కట్టూ, ఆ బొట్టూ, ఆ నవ్వు ముఖం, ఆ నుదుట స్వేదం .... ఆమె అందంగా కనిపించింది ఆ క్షణం లో.

ఆమె ఇబ్బందిగా కదిలింది. నా చూపులు గుచ్చుకున్నట్లు, "అవును నీకిక్కడేం పని. పోయి హాల్లో కూర్చో". "ఇది బాగా ఉడకాలి" అంది.

“అవునూ నీకీ టేజింగ్ కాలేజీ రోజుల్నుంచే అలవాటా” .... ఆమెను భుజాలు పట్టుకుని దగ్గరకు లాక్కుంటూ అడిగాను.

కళ్ళతో గదుముతూ సున్నితంగా వదిలించుకుంది.

అప్పుడే చూసాను ఆమె వేసుకున్నఈ అప్రాన్ మీద అక్షరాల్ని.  "వంట ముద్దుగా .... నా చేత్తో చేస్తే” అని ఉంది.

"ఏదైనా ముద్దే నీ చేత్తో చేస్తే, ఆ అప్రాన్ అలాగే ఉండనీ .... ఇంట్లో ఉన్నంత సేపూ! అన్నాను దగ్గరకు జరుగుతూ చొరవగా.

సివంగిలోని రాక్షసి ఒక్కసారి గుర్రుగా చూసింది.

నా గుండె వేగంగా కొట్టుకుంది. ఆ సీరియస్ చూపుల్ని తట్టుకోలేక హాల్లోకి కదిలాను.

6 comments:

  1. అందమైన మీ రాక్షసి తో మీ అనుభవాలను మాతో పంచుకొనేందుకు సీరియల్ రూపమ్లో అందిస్తే ఎంత బాగుంటుంది. ఆలోచించండి.

    ReplyDelete
    Replies
    1. అందమైన మీ రాక్షసి తో మీ అనుభవాలను మాతో పంచుకొనేందుకు సీరియల్ రూపం లో అందిస్తే ఎంత బాగుంటుంది. ఆలోచించండి.....స్పందన
      మీ అభినందనకు అభివాదాలు మెరాజ్ ఫాతిమా గారు!
      ఎన్నో యేళ్ళ తరువాత చేసిన తొలి ప్రయత్నం ఇది. మీ లాంటి సాహితీవేత్తలు స్వాగతించడమే గొప్ప అదృష్టం గా భావిస్తాను. సీరియల్ లా ఐడియలిజాన్ని చెప్పాలని మనసులో ఉన్నా నా మీద నాకు నమ్మకం లేదు. ప్రస్తుతానికి అంత సాహసం చెయ్యలేను. ముందుముందు ఆలోచిస్తాను.

      Delete
  2. టపా బాగుంది. స్నేహాభినందనలు...

    ReplyDelete
  3. "టపా బాగుంది. స్నేహాభినందనలు" .... ప్రోత్సాహక స్పందన
    ధన్యాభివాదాలు బివిడి ప్రసాద్ గారు.

    ReplyDelete
    Replies
    1. చూశారా.., ఎంత పెద్ద కవిగారి ప్రొత్సాహం లబించిందో...
      ప్రసాద్ గారు కూడా మెచ్చుకున్నారు కదా..

      Delete
    2. "చూశారా.., ఎంత పెద్ద కవిగారి ప్రొత్సాహం లబించిందో .... ప్రసాద్ గారు కూడా మెచ్చుకున్నారు కదా .... !" .... స్పందన అభినందన
      ఔను! బివిడి ప్రసాదరావు గారు ఒక గొప్ప కవి, రచయిత ....
      మెరాజ్ ఫాతిమా గారు ఒక గొప్ప కవయిత్రి రచయిత్రి.
      వారిద్దరి రచనలు చదువుతూ భావ యాగం అర్ధం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. వారిద్దరు ఎవరికి వారే గొప్ప భావుకులు. వారిదంటూ వారికో స్టయిల్ ఉంది. వారి వ్యాఖ్యలను ప్రోత్సాహకర స్పందనలుగా తీసుకుంటున్నాను.
      నమస్సులు ఫాతిమా గారు.

      Delete