Friday, June 16, 2017

చీకటి నీడలు
నెమ్మదిగా శ్వాసిస్తూ ఉన్నాను.
భూత వర్తమాన భవిష్యత్ కాల
రహశ్యాల గుసగుసలేవో వినివస్తున్నట్లు
కలల్లో కరిగి స్వర్గం చేరి వచ్చిన
అనుభూతులనేవో పొందుతూ ఉన్నట్లు

కేవలం అది కూడా ఒక చీకటి నీడే
సాయంత్రపు నీడలు సాగిన
చీకటి వేళ
లెక్కించిన నక్షత్రాలు
సూర్యోదయమౌతూనే కరిగి మాయమైనట్లు

పొరపాటున కూడా
ఆ సాహచర్య అనుభవాల్లోకి
తొంగి చూడాలని అనుకోను
ఆ ముగింపును
గుర్తుతెచ్చుకోవడం .... దుర్భరం