Friday, October 2, 2015

నీ ప్రేమ కావాలి



ప్రతి రాత్తిరి, ప్రతి పగలూ 
అది నీ కోసమే అని .... నీకు తెలుసో లేదో!? 
ఎప్పుడూ .... నేను కల కనేది నిన్నేనని. 
సున్నితంగా దిద్దబడిన నుదురు, 
ముఖ వర్చస్సుల సౌందర్యం  
ప్రకాశం, ప్రేమ వెలుగులా 
నీవు నా హృదయం లో 
ఎదిగి వ్యాపించావని 
లోలోతుల్లో నీవే అన్నీ అయి 
నా ఆలోచనల్లో, ఆవేశంలోనూ అని 

నా జీవితము, నా ప్రేమ సర్వమూ 
నాతోనే ఉన్న భావన .... నాలో 
నీవు పక్కన ఉన్నప్పుడు .... 
అన్నీ సవ్యంలా 
ఒడుదుడుకుల తప్పులన్నీ అకశ్మాత్తుగా 
ఒప్పులుగా .... స్పష్టంగా కనిపించి 
నా హృదయం నీ భావనల తో 
ఆలోచనలతో నన్ను ప్రభావితం చేసి 
నీవే వెనుక ఉండి నన్ను నడిపిస్తున్నట్లు
నా ప్రేమను స్వంతం చేసుకున్నట్లు 

నన్ను ప్రభావితం చెయ్యగలిగింది..  
ఒక్క నీవు మాత్రమే 
నమ్మేలా 
ప్రేమను, నన్ను నేను .... మరొక్కసారి 
నాకు తెలిస్తే చాలు
భవిష్యత్తులో నీ సాహచర్యం నాదే అని 
ఈ జీవిత కాలం 
ఎందరో స్నేహితులు మనల్ని 
అర్ధం చేసుకోలేక పోయుండొచ్చు 
నీవూ నేనూ మాత్రం 
పూర్తిగా అర్ధం చేసుకున్నాము. 
అది చాలు 

నేను ఎదురుచూస్తున్నది 
వెదుకుతున్నది .... ఈ సాంగత్యం కోసమే 
ఈ సాహచర్యం కోసమే 
ఎంత తాగినా తీరని దాహం 
నీ ప్రేమామృతం పొందడం కోసమే ....
ఒంటరినై తియ్యని బాధను తపిస్తూ
నీ వద్దకు వస్తుంది. నిన్ను విసిగిస్తుంది. 
నవ్వుతూ పరామర్శిస్తుంది. 
కలలోకొచ్చి కలవరపరుస్తుంది.. 
ఎంత పొందినా .... చాలని 
మరింత ప్రేమను పొందడం కోసమే 

No comments:

Post a Comment