ఎందుకు!?
ఎందుకు
ఆమె చూడలేకపోతుందో
తన అందాన్ని
నా కళ్ళలో ....
ఎంతో స్పష్టంగా
ప్రతిబింబిస్తున్నా
ఎందుకు
అలా
నటిస్తుందో తెలియనట్లు
తన గురించే నేను
నిరంతరం
ఆలోచిస్తున్నానని తెలిసీ
ఎందుకు
అనుభూతి చెందలేకపోతుందో
చేరువ కాలేకపోతుందో
నా హృదయం లో
తనకు మాత్రమే
స్థానం ఉందని తెలిసీ
చాల బాగుంది
ReplyDeleteWith Your Permission Will Share This Post
www.computerintelugu.com