Tuesday, October 6, 2015

అన్యాయమే సుమా



నాలో మిగిలి ఉన్న
కాస్తంత మంచితనాన్ని కూడా
ప్రలోభపెడుతూ
నీ లోని స్వచ్చత
ఒక ఆశావహ పరిపూర్ణతై

నీ స్పర్శతో
నాలో ఎన్నెన్నో వింత మార్పులు
నా న్యాయ విరుద్ధపు
అవినీతి ఆలోచనలు, వాటితో పాటు
నేనూ ప్రభావితమై

న్యాయ
ధర్మ రూపిణివై నీవు
ఎప్పుడూ తప్పులు మాత్రమే చేసే
దుష్ట రాక్షస ప్రవృత్తి
రూపాన్నై నేను 



నా ఎండిపోయిన పెదాలమీంచి
దొర్లిన
ప్రతి నిరుపయోగ పలుకు అర్ధమూ   
నీవు ముద్దాడుతూనే
పరమ పవిత్రంగా మారి

నా నరనరాల్లోనూ మంటలు 
విపరీతత్వం, పోషించబడిన వక్రబుద్ధి
దహించుకుపోతూ
ప్రేమ,  గాంభీర్యమూ
ఒకదాన్నొకటి వ్యతిరేకిస్తూ

ఈ అనిశ్చితి
ఎందుకో?
ఒక ఓడిపోయిన ప్రేమికుడ్నై నేను
లొంగిపోయి
తలొంచుకుని నీ ముందిలా

No comments:

Post a Comment