Monday, October 19, 2015

రెక్కలు తొడుక్కుని వచ్చాను



నిన్ను చేరాలనే
నీవద్దకు వచ్చాను
ఎగురుతూ 
సీతాకోకచిలుక రెక్కలు
అద్దెకు తొడుగుకుని

నాతో తీసుకుని వచ్చాను.
ప్రేమను,
అన్యోన్యానురాగభావనలను
నీవూ, నేనూ కోరుకునే
సాంగత్యం మార్పులను 


నా అంతరంగంలో నీవు
నీ శ్వాసనై నేను
విశ్రమించి శాంతించి
పరిపూర్ణ మమైకం చెంది
మనుగడ సాగించేందుకు 

హృదయ నందనవనం
పూతోటలో 
పరిమళాలు వెదజల్లి
మరో నూతనోదయమై
నిద్దుర మేలుకొనాలని

1 comment:

  1. సున్నిత భావాలతో భాషకందని స్పందనతో మంచులో విరిసిన మల్లెమొగ్గ సొగసు మీ కవిత

    ReplyDelete