ఎన్నాళ్ళుగానో ఎన్నో చెప్పాలనుకుంటున్నాను
నిన్ను, ఎప్పుడూ ప్రేమిస్తునే ఉంటాను
ఎప్పుడూ ఒంటరిగా ఉండనీయను అని, కానీ
మరిచిపోతూ ఉంటాను .... తొందరపడి
అంతలోనే పశ్చాత్తాప్పడుతూ ఉంటాను.
గుండె పగిలిన బాధ .... నీవు ఏడుస్తుంటే లోలో
నాకు నిన్ను కోల్పోవాలని ఉండదు.
ఒంటరిగా కోల్పోనియ్యను నిన్ను .... నేను
మరోసారి మనసు విప్పి చెబుతున్నాను.
ఎంతకాలమైనా పోరాడుతూనే ఉంటాను,
నీ గౌరవాన్ని కాపాడుకునేందుకు .... అని
నీవు కలలు కనే కథానాయకుడ్నౌతాను అని
మానసీ! మనం ఒకరిని ఒకరు అర్ధం చేసుకుని
యుగాంతాలవరకు కలిసి జీవించుదాం
మన జీవనం ఆదర్శ జీవనమయ్యేలా
ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేమే మనం అన్నట్లు,
నన్ను ఉన్నతుడ్నిగా చూస్తూ ....
గౌరవనీయుడి గా ఉంచాల్సిన బాధ్యత నీది.
అందుకు కావల్సిన అన్ని సహాయ సహకారాలూ
నీవే సమకూర్చుకోవాలి. నీకు తెలుసా ....
నేనెంతో బలాడ్యుడ్ని నీవు నా పక్కన ఉంటే అని
మనసీ మరోసారి ప్రాదేయపడుతున్నాను.
ఎప్పుడూ నీ తోడు కావాలి నాకు అని
ఒంటరిగా ఏమీకాని అవశేషాన్ని నేను అని
ఈ జీవనయానం లో సంరక్షణ కోసం
నా అస్తిత్వం ధరించిన కవచంలో
ఆ మెరుస్తూ ఉన్న పదునైన ఖడ్గం నీవు
ఎన్నిజన్మలుగానో ఆపత్సమయం లో తోడుండి
సంరక్షిస్తూ ఉన్నావు నన్ను .... నిజం మానసీ!
నా ఈ ప్రేమ దుర్గానికి మహారాణివి నీవు.
మనం, ఒకరిని ఒకరం అర్ధం చేసుకుని కలిసుందాం
ఈ ప్రేమ సామ్రాజ్యాన్ని మహోన్నతంగా తీర్చి
నన్ను ఉన్నతుడ్నిగా చూస్తూ ....
ReplyDeleteగౌరవనీయుడి గా ఉంచాల్సిన బాధ్యత నీది.
అందుకు కావల్సిన అన్ని సహాయ సహకారాలూ
నీవే సమకూర్చుకోవాలి.
నీకు తెలుసా .... నేనెంతో బలాడ్యుడ్ని- బయ్యా, ఎవరు బయ్యా నువ్వు అంతగా ప్రేమిస్తున్న మనిషి. నా గుండె ద్రవించి పోతున్నది. బాహుబలి లెక్క కొండలు ఎక్కుకుంట, జలపాతంల దుంకుకుంట ప్రేయసిని కలుసుకోవాలె అని మనస్పూర్తిగా కోరుకుంటున్నానె.