మరిచిపోలేని మది మృదు భావనవు నీవు
ఎంతో దూరంగా ఉన్నా .... ఇంకా చేరువలోనే ఉన్నా
వినిపిస్తూ, ఒక ప్రేమ పాట లా
హృదయం పాడిన ప్రేమకీర్తన లా
నీ భావనలు నా మనసుకు అతుక్కుపోయి
ఎంతగా ప్రభావితం చేస్తాయో .... ఆ ఊహలు
ఎవ్వరూ ఇంతకు ముందెన్నడూ చెయ్యనంతగా
ఏ విధంగానూ మరువలేని ఉన్నత మనోభావనవు
ఎప్పటికీ కావాలనిపించే ఔన్నత్యానివి.
ఎప్పుడూ భరోసా ఇస్తున్నట్లు ఉంటావు.
మానసా! అందువల్లనేనేమో .... నీవు
ఎప్పటికీ పోగొట్టుకోలేని సౌకుమార్యానివి.
అద్భుత అపురూప అతిశయానివి అనిపిస్తావు.
నీ సహవాసం లో నేనూ నీ లా ....
అందమైన అభిలషంచబడే అస్తిత్వాన్ని కావాలని
నిను వీడని పీడను నేనే. కలలో ఇలలో నిన్నే కసిగా ప్రేమిస్తా. జన్మ జన్మల బంధం మనది. నీ ఖర్మ తప్పదంతే.
ReplyDelete