Saturday, May 30, 2015

నేనో నిస్సహాయుడ్ని


నా చెయ్యందుకో
స్రవిస్తున్న కన్నీటి ధారలకు
దూరంగా
ఎక్కడికైనా
నీతో పాటు తీసుకుని వెళ్ళు
భయం ఇక్కడ ఎటుచూసినా

కన్నీళ్ళు ఆగడం లేదు.
నీరసపడి, మసకేసిపోతున్నాను.
ఎంతో కాంతివంతమైన గతం
నిన్ను కోల్పోయి ఇప్పుడు
కాంతి హీనమై
ఈ హృదయం కుళ్ళబొడవబడి
వెచ్చని కన్నీళ్ళు మండుతున్నాయి.
వేడి కన్నీటితో జీవితం తడిచిపోతుంది.

జీవితం లో ఆశ దూరమై
కలలు రాకుండా పోయాయి.
నీవు వెళ్ళిపోతూనే
అన్నీ నన్నూ వదిలి వెళ్ళిపోయాయి.
నేనిప్పుడు వేచి చూస్తున్నాను. నీ కోసం
ఎన్నటికీ రావని కనిపించవని తెలిసీ

నెమ్మదిగా మరణిస్తున్నాను.
అణువు అణువుగా క్షీణిస్తున్నాను.
వెలుతురు చీకటిగా
పగలు రాత్రిగా
తెలుపు నలుపుగా
ఆనందం అశాంతిగా
నవ్వు నిట్టూర్పుగా పరిణమిస్తూ  


నా వద్ద ఇప్పుడు ఏమీ లేవు.
నీవు కూడా లేవు
నన్ను బ్రతికించి
నాకు దూరంగా
ఆ స్వర్గాన్ని
ఒంటరిగా చేరిన అన్యాయివి నీవు

No comments:

Post a Comment