దేవుడిని ఉదహరించే
ఆ కేకలు, ఆ అరుపులు, ఆ రోదనలు
గుండెలు ద్రవించే ఆ శాపనార్ధాలు
పరిసరాలను వ్యాపించి
ఆ కేకల్లో ఆమె కోపం
నన్నెందుకు ముందుగా తీసుకెళ్ళాడని
నేను చేసిన ఏ పాపానికో
ఏ రక్త విధ్వంసానికో ప్రతిక్రియ గానో అయినా
ఆ అనర్ధం రోదనలు లీలగా
ఏ అశరీరవాణి పలుకుల్లానో ప్రతిధ్వనిస్తూ
ఆమె ఆరోపణలను వినలేక ముడుచుకుని
నా ఆత్మ పరిసరాల్లో పరిబ్రమిస్తుంది.
చుట్టూ కురుస్తున్న, వర్షం శబ్దం ను మించిన
శబ్దం తో తీవ్రమైన ఆరోపణలు చేస్తుంది ఆమె
గోడలు కట్టిన అబద్దాలు నిజాలుగా
ఎన్నో ఓదార్పు గొంతులు దైవ ధిక్కారాల్లా వినిపిస్తూ
రుజువులుగా .... ఆ శాప వాఖ్యాలు
అన్ని వైపులకు విస్తరించి, వర్షంలా .... అందరిని తడిపి
ఒక్కసారిగా వినిపించడం ఆగిపోయింది.
ఆశ్చర్యపోయాను. నిజానికి,
అప్పుడే నా శరీరాన్ని పాడె లోనికి జరిపారు.
సహజీవన ప్రమాణం చేసి వదిలెళ్ళుతున్న నన్నో
నన్ను దూరంగా తీసుకెళుతున్న దేవుడ్నో
ఇప్పుడు ఆమె ఆక్రోశము నాకు వినిపించడం లేదు.
ఆర్ధికంగా సామాజికంగా
భర్త పైనే ఆధారపడ్డ
ఒక సగటు ఇల్లాలు ఆమె ....
పాపం అనిపించింది.
ఎందుకో గానీ
No comments:
Post a Comment