Friday, May 29, 2015

మరణం




రాత్తిరి రంగును
అద్దుతూ
అనామకుడు .... లా
కాటికాపరి

నల్లని నీడలా
బక్క శరీరం చుట్టూ
మృత్యువు, కాకి నలుపు లా
విస్తరించుతూ

గాఢాంధకారం 
దయ్యాల సైగలు
శ్వాసల గుసగుసల
ఊళల ప్రతిధ్వనులు

మరణం వైపు
తిరిగిరాలేని దిగంతం వైపు
ఆకట్టుకోబడుతూ 
ఆమె


No comments:

Post a Comment