Friday, May 22, 2015

ఆశ్వాసనము


నా హృదయ అంతరంగం అంతా శూన్యం గా 
ఆ శూన్యమే కదులుతూ, తిరుగుతూ 
రక్తం స్రవించేలా ఒత్తిడి చేస్తూ, గుచ్చుతూ .... 
అయోమయం, అంధకారం జిజ్ఞాస 
కానీ అక్కడ అంతా ఖాళీ గా ఉంది.
అభ్యంతర మందిరం పరిసరాలు
దీపం వెలుగు కోసం 
నీ ఆగమనం కోసం ఎదురుచూస్తూ

నా కోరిక నీవు, నా అవసరం నీవు, 
నా ఆవేశం నీవు. 
నా పరిసరాలు, నా నీడ, నా లోపల 
నా శూన్యం, నా భయం 
పారద్రోలి జీవనార్ధాన్ని పెంచే ప్రియరాగం నీవు.

నరాలు, కండరాలు, పక్కటెముకలతో కట్టబడిన 
ఈ కోమల హృదయ మందిరంలో 
చిత్రమైన శబ్దాలు, మూలుగులు సవ్వడులు  
దయ్యాలు, ఆత్మల కదలికల్ని తరిమికొట్టాల్సిన     
దీపం వెలుగు .... మనొజ్ఞివి నీవు అని
నా పక్కటెముకలు నిన్ను అర్ధిస్తూ ఉన్నాయి.
అర్ధపారదర్శకంగా తెరుచుకుని .... నీ ఆగమనంకోసమే అని 

ఎంతో విశాలమైన 
నా హృదయ మందిర ప్రాంగణంలో 
రక్త తివాచీ మీద నీవు నడుస్తూ వస్తూ ఉంటే
అందమైన ఆశ్వాసన ఏదో భుజం తట్టుతున్నట్లు ఉంది.
నీ రాకతో ఇప్పుడు, 
నాలో లోలోపల విస్తృత వైభవ ప్రకాశం 
పండుగ వాతావరనం

మరో నిజం తెలిసింది. 
నీవు అపరిచితురాలివి కావు అని 
ఒక సంతులనశక్తివి అని
ఊపిరులతో చీకటి లోనూ గుర్తించబడే పరిమళానివని 
నా మనోగగన వెన్నెల ప్రకాశానివి అని
నీ నామ సౌందర్యారాధనే ఇక్కడ అన్ని వేళలా అని

No comments:

Post a Comment