Friday, May 1, 2015

ఒక్క చిరునవ్వు చాలు


అడ్డంకులెన్నున్నా అధిగమించేందుకు ప్రేరణగా
ఆ ఒక్క చిరునవ్వివ్వు చాలు, నీ చూపులు నా ఆత్మ రంద్రాల్లోకి దూరి
అక్కడి అన్ని గుణాలనూ చిత్రాలుగా దాచేసుకునేట్లు చూడు చాలు 
 
నా అభిరుచి, ఉత్సాహము, తపన .... ఒక విప్పని పేదరాసి పెద్దమ్మ కథే
నీ పట్ల ప్రేమ తో అప్పుడప్పుడూ నిన్నొక దేవత అనుకుంటూ
వెంటనే వాస్తవంలోకి జారివస్తూ, ఏ గుడి గంటల శబ్దాలో విని
 
తెల్లని పిండారబోసినట్లుండే ఆ వెన్నెల మార్గనిర్దేశం చేస్తుందనుకుని
సిగ్గు అభిమానాలను దాచుకునే వేళ ఎప్పుడైనా కన్నీళ్ళు రాలాల్సొచ్చినా
నీ నవ్వు వెలుగులే ఆసరా అనుకుంటాను .... మన ప్రేమ మార్గం లో మనకు 


నన్ను పరిక్షించేందుకు వచ్చిన దేవతవేమో నీవు అని,
అప్సరసవై నీవు, రెక్కలు విస్తరించుతూ, ప్రేమ ఆవిర్భవమని అనిపిస్తుంది.
గాలి, నీరు, ఆకాశం అంతటా వ్యాపించి నన్నూ చేరిందని
 
ధరిత్రిలో నన్ను నేను కోల్పోయిన అనుభూతి
నీవు లేని నేను అని
ఒక ఒంటరి ఆత్మ ధరించిన ఒక శరీరాన్ని మాత్రమే నేననే భావన పెరుగుతూ
 
నా పెదవుల పై నీవు అద్దాల్సిన ముద్దు సంతకం ప్రామాణికతగా
నా జీవితం లో నీ ఉనికి ఒక సరికొత్త చరిత్రయ్యి ....
మోహావేశపు చిత్రాలు నా మది గోడలపై వ్రేలాడాలని అనిపిస్తుంది.
 
నేనెల్లప్పుడూ నిన్నే ప్రేమించి ఆరాధించేలా అనుమతిని పొందాలని
నిన్నే చూస్తూ నడిచేప్పుడు, ఆ నక్షత్రాల కాంతిని తలదన్నే 
నీ నవ్వుల్ని కళ్ళ బుట్టలోకి ఏరుకునే .... ఒక సదవకాశాన్ని పొందాలని

No comments:

Post a Comment