Saturday, May 2, 2015

మళ్లీ అదే దృశ్యం ....


అదే నువ్వు, అదే కల
మళ్లీ మళ్లీ అదే దృశ్యం ....
సందర్శించుతూ,
అది వాస్తవం కాదని అనుకోలేను?
వాస్తవం అనీ అనుకోలేను.

కొన్ని తీగలు, గొలుసుల సంకెళ్ళు
నీ గొంతు చుట్టూ బిగుసుకుని భయం, భీతి నీ కళ్ళలో
అలౌకిక శక్తి సహాయం కోసం .... నీవు గొంతెత్తి పిలుస్తూ
ఆ గొలుసులు, తీగలు నీ చుట్టూ మరింత బలం గా
గాలిని కూడా చొరనీయనంతగా
పెనవేసుకుని నీ గొంతు మూగబోతుండటము 


నిద్రలోంచి లేచినట్లు
ఆ దుర్బలస్థితి లోంచి నీవు ఒక్కసారిగా
ఆ తీగలు ఆ సంకెళ్ళను తెంచుకుని బయటపడి
అంతలోనే మళ్ళీ,
అదే స్థితికి బంధీవి అయ్యేందుకు ఎదురుచూస్తుండటము
ఎలా అర్ధం చేసుకోను.?

No comments:

Post a Comment