పీకలవరకూ మునిగి వెలికి రాలేక
ఎన్నాళ్ళిలా అని వాపోతున్నాను,
ముక్కలైన నేను ఒక్కడినిగా అయ్యేందుకు
శూన్యం నిండిన పాత్రను లా కాక
అద్దంలో చూసుకున్నా
నన్ను నేను గుర్తించేదెలా అని
సూర్యోదయం వేళ గడ్డి పూలు, ఆకులు
రాలిన మంచుబిందువుల్లో
ఉషా కిరణాల వెలుగులను దాచుకుని సంబరపడ్డట్లు
నీవు లేని ప్రపంచంలో
నీ అనుభూతులను నెమరువేసుకుంటూ ....
ఎనాళ్ళిలా అని
ఒకప్పటి దినచర్యల అనుభూతుల
సుడిలో చిక్కుకుని
నాటి మన ప్రతి అనుభూతీ ఒక దృశ్యరాగం గా మారి
మనోసంకెల లా నా నాడీ వ్యవస్తను అస్తవ్యస్తం చేసి
ఆలోచనలన్నీ ఆ జ్ఞాపకాల చుట్టే పరిబ్రమిస్తూ
నేను బలహీనుడ్ని అవుతూ పదే పదే గుర్తొస్తున్నాయి.
ఇచ్చిపుచ్చుకున్న నాటి చిన్ని చిన్ని అవసరాల
ఆనందాల అవశేషాలే అన్నీ అని
వాటికి ఇంతగా ఆకర్షితుడ్నౌతానని ఏనాడూ అనుకోలేదు.
చేతిలో చెయ్యేసుకుని, చెట్టాపట్టాలేసుకుని
వెన్నెల్లో తోటలో విహరించిన క్షణాలలో
నిన్ను చూసి నొచ్చుకుని ముడుచుకుపోయిన
ఆ పూల మనోగతాలు నాకు ఇంకా గుర్తున్నాయి.
నీవు జతగా నడుస్తున్నప్పుడు నాలో కలిగే
ఆ ఆనందం, ఆ విశ్మయం, ఆ గర్వం
ఊపిరాడనివ్వక పోయినా ఏదో చిత్రమైన భావన
నాకేమీ కాదని, ఏమన్నా అయినా సరే అని
ఇప్పుడు నాకు ఊపిరాడటం లేదు. శ్వాసించలేకపోతున్నాను.
నాడు నీ తలను నా భుజం పై ఆనించి
వెన్నెల వర్షం లో,
మనం నర్తించిన ఆ చిత్రమైన అనుభూతులు
సృష్టి కర్తను నేను లా .... ఆ వింత ఆనందం
అలా జరిగిన ప్రతిసారీ
నా హృదయం లో కొంత భాగం నీ సొంతం అయ్యి
వేదన, బాధ, నొప్పి తో కూడిన అనిశ్చితి నాలో
ఆ మిగిలిన హృదయంతో కదిలేందుకు ప్రయత్నిస్తున్నాను.
చిరు మాటలు, చిరు నవ్వులు, చిరు ఆనందాలు
నీతో కలిసి పంచుకున్న ప్రతి సారీ .... ప్రేమగా
అణువణువులోనూ సుతారంగా నీవు పేర్చిన
ఈ ఆలోచనలను దూరంగా నెట్టెయ్యలేను.
నీ ప్రతి చూపుతోనూ
నీ ప్రతి స్పర్శ తోనూ
నీ ప్రతి మందహాసంతోనూ నన్నూ, నా అన్నింటినీ
ఆనందం అనుభూతులన్నీ నీతో తీసుకెళ్ళావనలేను.
నేనిప్పుడు ఏమీ లేను. ఏమీ ఈ మిగుల్చుకోలేదు ....
అందుకే, తలొంచుకుని పంచభూతాల్లో కలిసిపోయిన నీకు
నివాళులర్పిస్తున్నాను.
ఎప్పుడూ అందంగా, స్థిమితంగా, సామాన్యంగా ఉండి
బలాన్నిచ్చిన జతను, నిన్ను కోల్పోయినందుకు ....
అలాగే, నన్ను కోల్పోయిన నా కోసం కూడా
నీ జ్ఞాపకాల సమాది ముందు మోకరిల్లి మౌనంగా రోదిస్తూ ....
నివాళి అర్పిస్తున్నాను.
సార్ మీ బాధను చూస్తుంటె నాకు కూడా దు:ఖం వస్తుంది. ఎవరిగురించి సార్ అంత ఆర్ద్రతతో నిండిన కవిత రాశారు? గుండెలను పిండివేసింది. వచ్చే జన్మలో మళ్ళీ మీ నేస్తాన్ని తప్పక కలుసుకుంటారు. may god give rest in peace.
ReplyDeleteSuper...
ReplyDelete