Saturday, May 2, 2015

వేచి చూస్తున్నా


నిశ్చలంగా కురుస్తున్న వర్షపు సడి వింటూ
నిన్న మధ్య రాత్రి వరకూ
నిద్రాదేవి రాక కోసం ....
ఒక ప్రియురాలి గుసగుసల కోసం
వేచిచూసే ఒక సహనశీలి ప్రేమికుడ్ని లా

దారగా పైపుల్లోంచి జారు వర్షపు శబ్దం
పెనుగాలి తోడై
వర్షపు చినుకులు కిటికీ అద్దాలను వేగంగా తాకినట్లు
పక్కటెముకలపై గుండె కొట్టుకుంన్న శబ్దం
వేగం తగ్గి నెమ్మది చేకూరాలని  


ఎండిన భూమి వర్షం కోసం ఎదురుచూసినట్లు
తుఫానులా నీ రాక కోసం
నేను నీతొ కలిసి
నీవు తెచ్చే మురిపాలు పంచుకునే
ఆనందానుభూతుల కోసం కళ్ళు తెరుచుకుని

1 comment: