Friday, May 29, 2015

నేన్నిన్ను కోల్పోలేను




 

















ఆలోచిస్తుంటేనే చాలా కష్టం గా ఉంటుంది
నడుస్తున్న బాటలో సజావుగా నడవడం
వాస్తవాలను జీర్ణించుకోవడం
నిజాన్ని కళ్ళలో కళ్ళు పెట్టిచూడగలగడం
నేనిప్పుడు అలాంటి అవస్థలోనే ఉన్నాను

నా హృదయాన్ని తెరిచి చూపిస్తాను
నా మనోభావనల్ని నీ ముందు పరుస్తాను
నీవు చూసేందుకు వీలుగా
నా ప్రేమలో ఎలాంటి సందిగ్ధత లేదు
నీ పట్ల నేను దాయగలిగిందీ లేదు

అందుకే విశాలమైన నీ కళ్ళను తెరిచి
జన్మజన్మల బంధాన్ని
నన్ను గుర్తించేందుకు ప్రయత్నించు
నా కోసం నీవు ఏమి కావాలనుకుంటున్నావో .... మరిచి
నన్ను నన్నుగా పరిశీలనగా చూడు

నేన్నిన్ను కొల్పోయే స్థితిలో లేను.
సమస్యలెన్నున్నా ఏదో లా దాటగలను కానీ
ఇప్పుడే కాదు ఎప్పుడూ నేన్నిన్ను కోల్పోలేను
ఎంతో కష్టపడి జీవితం లో నిలబడ్డాను
నీ కోరికే అయితే నీ చుట్టే తిరగమన్నా సరే కానీ 

మనుష్యులం .... ఎన్నో పొరపాట్లు తప్పులు చేసి
ఎదురుదెబ్బలు తింటూ ఉంటాము
గమ్యాన్ని కొల్పోతూ ఉంటాము అయినా
కాలం పెట్టే ప్రతి పరిక్షలోనూ నిలబడి నెగ్గి
అదే జీవన సత్యం అని అనుకుంటుంటాము

పిల్లా! నిర్ణయాన్ని నీకే వదిలేస్తున్నాను.
నన్ను ఉండమనడమో వెళ్ళిపో అనడమో
అంతా నీ ఇష్టమే! .... ఎందుకో తెలుసా
నాకుగా నేను నిన్ను వొదిలి వెళ్ళలేను. వెళ్ళను కూడా
నా హృదయానికి తెలిసింది నీవు మాత్రమే కనుక


No comments:

Post a Comment