Sunday, May 3, 2015

నీతో కలిసి జీవితాన్ని చూడాలని.


ఆ వెన్నెలను తాకాను
వేల వేల సార్లు
ఆ చంద్రుడి ని ముద్దాడాను.
 
అంతరిక్షం లో సమయం తో సహవాసం చేసి.
వేసవి మధ్యహ్నపు ఎండల్ని
సాయంత్రానికి సముద్రుడిని చేరి, చల్లరిన ఆ సుర్యుడ్నీ
అనుభూతి చెంది మరీ చూసాను.

ఎంతో ఎత్తైన ఆ ఎవరెస్ట్ మీదనుంచి
ప్రపంచాన్ని చూసాను.
స్వచ్చమైన జలాలలో
పవిత్రమైన ప్రేమ తత్వాన్ని తాగాను.

అందంగా మెరిసే నీ పెదవులపై కోరికనూ
నాలో ప్రతిక్రియలా
కలిగిన కోరికల ముచ్చెమటలనూ ....
ఎన్నో అద్భుతాలను చూసాను

నీ ఆలోచనలలో మునిగి ఉన్నప్పుడు
నొప్పులు,
బాధలు మాయమై
నా మది స్థిమిత పడటం చూసాను.

అయినా,
ఇంకా చూడాల్సినవి ఎన్నో ఉన్నాయి 


పక్కనే ఉండి, నీతో మాట్లాడుతూ
కలుగు గిలిగింతలను అనుభూతి చెందలేదు.
బలహీనుడ్నై నేను పడిపోయి
నీనుంచి ధైర్య గుణాన్ని పొందలేదు.

నా అంతరాంతరాలను నీవు లోతుగా
సరైన సమయం లో స్పర్శించలేదు.
నన్ను బలహీనుడ్నీ చెయ్యగలిగినట్లే
మృగాన్నీ చెయ్యగల ప్రేరణను చూదలేదు.

అందుకే, నీవు
నేను ఆశించే లక్షణాల రూపానివి కావాలి.
నేను కలల సాగరం లో
ఈదుతూ చేరిన తీరానివి కావాలి.

నేను, ఆ సూర్యుడు
సముద్రాన్ని ముద్దాడటం చూసాను.
వేల వేల సార్లు నేనూ ఆ వెన్నెలను తాకాను
ఆ చందమామను ముద్దాడాను.

No comments:

Post a Comment